| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
శ్రీ మత్కటాక్షరోచి | స్స్తోమ సముల్లాస విహిత సుస్థిర లక్ష్మీ భూమానందిత భక్త! వ్యామోహ విదూరయుక్త! హరిహరనాథా! |
001 |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు దివ్యజ్ఞాన దేదీప్యమానుండైన దేవవ్రతుండు వివరింప వివిధంబులగు ధర్మంబు లాకర్ణించి, యజాతశత్రుం డతనికి సభక్తిక ప్రణామం బాచరించి, వినయ విశేష విభూషితుండై. | 002 |
| సీ. |
‘అనఘ! నాదగు చిత్తమునకు శమంబు గా | వించుటకై నీవు వివిధ విశద భంగులఁ బరమ కృపానిరతుండ వై | సకల ధర్మోపదేశములుఁ జేసి; తిమ్మెయిఁ జెప్పఁగా నించుక యేనియు| శమము లేకున్నది; చలముకొని య నేక బంధుల వధియించితి; నది యొక్క | తలయు, నీ కలిగిన దారుణత్వ |
|
| ఆ. |
మొక్కతలయు నైన యుగ్రకర్మంబులు | చిత్తవృత్తిఁ దగిలి, యుత్తలంబుఁ జేయ, శాంతి యెట్లు సిద్ధించు మునిమాన | నీయ! యింక నేమి సేయువాఁడ? |
003 |
| వ. | దుర్యోధనుం డతి లోభంబున నాతోఁ బంచి కుడువ నొడంబడండ; యేనును నాగ్రహంబున నతనికి, రాజ్యం బిచ్చి, తొలంగి నిలువను; మా యిద్దఱ కతంబున నింత పుట్టెం; బశ్చాత్తాపం బెప్పాటనుం ద్రోపువడ దయ్యెడు’. | 004 |