| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
మునిహృదయాబ్జ శాంతిమధుమోద వినోది మరాళ! గాఢ చ క్రనిహత శూలనిర్మథిత రాక్షసయూధ! నితాంత భక్తి భా వన రమణీయ! వేద పరివాదనిరర్గళ సేవనీయ! ని త్యనిరుపమాన నిర్మల నిరంజన ఖేలన! ధర్మపాలనా! |
386 |
| క. |
సదయాపాంగా! పరిణా | మదశా సంగమ నిరాసమధురతమాంగా! మదశోక రహితచేత | స్సదనా! సంజనిత సముపసంహృతమదనా! |
387 |
| మాలిని |
గరుడవృషపతాకా! కల్పితాశేషలోకా! సురపరిషదుపాస్యా! శుద్ధసంవిద్వికాస్యా! పరమమహిమసీమా! భవ్యకారుణ్యధామా! నిరతిశయగుణాలీ! నిష్కలానందశాలీ! |
388 |
| గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 389 |
| ఆనుశాసనిక పర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. | ||