| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని చెప్పి భీష్ముం డా భూపతితో వెండియు నిట్లను; ‘భూసుర విషయంబై వాసుదేవునకుం బృథివికి సంవాదంబు గలిగె; నది యితిహాస రూపంబునఁ జెల్లు; దానిఁ జెప్పెద నాకర్ణింపుము. వాసుదేవుం డొక్కసమయంబునం బృథ్వి నాలోకించి. | 146 |
| క. |
లోకజనని వగుటన్ నిను | నోకాశ్యపి ! యడుగవలయు నొక్కటి దెలియన్ నాకుం జెపుమా ! పాపము | లే కృత్యము సేసి గెలుతు రెల్ల జనములున్.’ |
147 |
| ఆ. |
అనినఁ బృథివి యిట్టులను; ‘విప్రసేవను; విప్రపూజనమున, విప్రహిత వి ధానమునను, బాపతతి నోర్చు, మానవ | ప్రతతి, యెందు నివి నృపాలు పనులు. |
148 |
| ఆ. |
అమరవిభుని, భగసహస్ర చిహ్నునిఁ గాఁగఁ | జేసినదియు, నేత్రభాసురుండు గా నొనర్చినదియుఁ, | గమలాక్ష! విప్రున | ల్కయుఁ బ్రసాద సంపదయును గావె!’ |
149 |
| క. |
అనిన విని మెచ్చి, పృథివిం | గొనియాడె రథాంగ పాణి గురునృపవర! నీ వనిశంబు మిగులనుతిమ | న్ననలను విప్రులకుఁ బ్రియ మొనర్పుము కృపతోన్. |
150 |
| క. |
అని మఱియు శాంతనవుఁ డి | ట్లను ‘జననంబునన విప్రు నధిప! మహా భా గునిఁగాఁ జెప్పుదు రార్యులు | జనులకు వంద్యంబు లతని చరణాంబుజముల్. |
151 |
| వ. | బ్రాహ్మణుల సృజియించి బ్రహ్మ వారలతోఁ జెప్పిన విధం బాకర్ణింపుము. | 152 |
| ఆ. |
‘అరయ మీకుఁ గృత్య మన్యంబు లే; దాత్మ | కర్మ మూఁది యుక్తధర్మనిరతి బ్రహ్మగోపనంబుఁ బాటింపుఁ డవ్విధ | మధిక శోభనంబు నావహించు. |
153 |
| వ. | బ్రాహ్మణ్యం బెల్ల వర్ణంబులకుం దారకంబు బ్రాహ్మియైన శ్రీఁ దపస్స్వాధ్యాయంబుల వెలుంగంజేయుం డనియె; నట్లు గావున రాజులకు బ్రహ్మ వచన పరిపాలనంబు ప్రధాన కర్తవ్యం బని చెప్పి వెండియు. | 154 |
| ఆ. |
అగ్ని నంట, హిమవదచలంబుఁ గదలుప | గంగఁ గట్టవచ్చుఁ గాని, విప్ర రాజిఁ బరిభవింపరాదు; విప్రుల కొల్వు | కల్పవృక్ష సేవకరణి యధిప! |
155 |
| వ. | ఏ తద్విషయంబైనది శక్రశంబర సంవాదంబను నితిహాసంబు గలదు వినుము. శక్రుండు జటాసురనందనుండైన శంబరు కడకుంబోయి తదీయ గోష్ఠి నుండి, యతనితో, ‘నీ వేమిట నున్నతిం బొంది యుందు?’ వనిన నతం డతని కిట్లనియె. | 156 |
| క. |
‘అలుకయు, నసూయయును, వి | ప్రులయెడ లే వనఘ! వారిఁ బ్రోతుం గాతున్ సొలయఁ దదీయారాధన | ముల కట్టులు గావునన్ విభూతి వహింతున్. |
157 |
| వ. | దేవాసుర యుద్ధంబున విప్రానుగ్రహంబు దేవతల గెలిపించుట గని, మజ్జనకుండు సోమునితో ‘భూమిసురులు మహానుభావులుగదే!’ యనుటయు నమ్మహితాత్ముం డతని కిట్లను ‘వారలు తపస్స్వాధ్యాయ సిద్ధులై యుండుదురు. వారితెఱం గాకర్ణింపుము. | 158 |
| ఆ. |
‘అప్రవాసి యైన యవనీసురుని యుద్ధ | శాలి గాని ధరణిపాలు నురగ ముల బిలాంధకారమున నడంచిన యట్లు | మెఱయనీక భూమి మ్రింగు నండ్రు. |
159 |
| క. |
దాని నెఱింగి, గృహంబున, | మానిత మగు చదువునందు మనసు గొలుప కెం దేనిఁ జని చదువుదురు శ్రుతు | లానంత్యమునకుఁ దపస్వు లగుదురు విప్రుల్. |
160 |
| వ. | కావున వారలు సర్వాధికులు; వారల యెడ బహుమానావమానంబు లెట్టివారికి శుభాశుభంబుల నొందించుటకు సందియంబు లే ‘దనిన సోముని వాక్యంబులు పాటించి మజ్జనకుండు విప్రజనంబులం బూజించి తేజిష్ణుం డయ్యె; నేనుం దదాచారంబునం బెంపువడసితి’ నని పలుకుటయు నయ్యసురేంద్రుని వచనంబు లూఁది, సురేంద్రుండు భూసురులకుం బరితోషంబు గావించి సవిశేష సమున్నతిం బొందె ‘నని చెప్పిన విని గాంగేయునితోఁ గౌంతేయాగ్రజుం ‘డపూర్వ చిరసమాశ్రిత దూరాగతులలోన, నధికతమం బగు పాత్రం బెవ్వ?’ రని యడిగిన, నప్పుడమిఱేనికి నప్పురుషవరుం డిట్లనియె. | 161 |
| క. |
‘చెలులుం జుట్టలు, సంబం | ధులు, ఋత్విజులునుఁ, బురోహితులుఁ, దగు పాత్రం బులు, హింసా క్రోధేర్ష్యా | దులు లేని జనంబు లైన దురితవిదూరా! |
162 |
| క. |
దూరాగతులు, నపూర్వులుఁ, గౌరవకులముఖ్య! పూజఁ గనుటకు నర్హుల్; సారాచారము విద్యా | గౌరవముం గలుగఁ జూపు కరణీయ మగున్. |
163 |
| క. |
ఈ మూఁడు తెఱంగుల జను | లే మెయిఁ జూచినను నశుచు లేనియుఁ బాత్ర శ్రీ మహితుల నిజభృత్య | స్తోమము జీవనము నడపి చుమ్మీ యీగుల్.’ |
164 |
| క. |
అనిన విని ధర్మసుతుఁ డి | ట్లను శంతనుసుతునితోడ ‘నఘకోటికి నె ల్లను మూలము వనితల య | జ్జనముల తెఱఁ గెఱుఁగఁ జెప్పు చాతుర్యనిధీ’! |
165 |