పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
తిలదాన విషయక యమ బ్రాహ్మణ సంవాదము (సం. 13-67-1)
సీ. మధ్యదేశమున గ్రామంబు విద్వజ్జన | బహులమై యొక్కటి పర్ణశాల
యను పేర నొప్పారు నందుల విప్రుని | శర్మి నామునిఁ బ్రీతి జముఁడు పిలువఁ
బనిచి దానముల కెల్లను దిలదాన మె | క్కుడు తిలలకుఁ బితృకోటి వేడ్క
సేయుఁ బాపంబులు సెందవు తిలభక్షిఁ | బుణ్య కర్తృత్వంబు బుద్ధిఁ గోరు
 
తే. దేనిఁ దిల లెప్డువిప్రుల కిమ్ము భక్తి | ననియె వస్త్ర దీపము లీగి యతుల దాన
మనఘ! చీరల దివియల నమర పితృ స | మర్చనము సేఁత పరమధర్మ మని చెప్పె.
409
వ. అని యిట్లు యమబ్రాహ్మణ సంవాదంబు వినిపించి శాంతనవుం డమ్మహీకాంతు నాననంబు సవిశేషాదరంబున నాలోకించి. 410
క. ‘విను పృథివియును సరస్వతి | యును గోవును దాన విధికి నొక్కంతలుగా
విని యుండుదు వీనిం బో | లిన దాతవ్యములు నొండు లేవని విందున్‌.
411
ఆ. రాజముఖ్య! తగు సరస్వతి శిష్యున | కొసఁగ, భూమి దాన మూర్జితముగఁ
జేసినట్టి ఫలము సిద్ధించు, ధేనువు | నిచ్చుటయును భూమి నిచ్చినట్ల.
412
క. అనయముఁ గొంచెపు వెలకుం | గొనవచ్చును సారభూత గోవును దానం
బున ఫల మధికము దానము | గొని నాతఁడు సుఖము దానఁ గొనుఁ జేసేతన్‌.
413
ఆ. దేవ పితృ సమర్చనావాసములు గోశ | కృత్ప్రలేపనమునఁ గీర్తనీయ
శుచితఁ బడయు ననిన సువ్రత! గోవుల | భూరి మహిమ వేఱ పొగడ నేల?
414
తే. కుడుపునకు ముందు రొడ్డుల గోవునకు స | మంచిత గ్రాసముష్టి నిత్యంబు నేఁడు
గాల మిచ్చిన నతఁ డెల్ల కామ్యములును | బ్రాహ్మణుల కర్థి నొసఁగిన ఫలము వడయు.
415
క. గోదాన విధము సుపథగ | మై దాతకు నెల్ల మేలు నాపాదించున్‌
వేదప్రియ! యది దురితో | త్పాదక మగు నాతనికి విపథగతమైనన్‌.
416
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )