| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనుటయు గాంగేయుండు ‘గో శ్రీ సంవాదం బను నితిహాసంబు విను; మయ్యర్థంబు దేటపడు’ నని పలికి యిట్లనియె. | 113 |
| సీ. |
‘సిరి ధేనువులలోని కరిగిన ‘నెవ్వత?’ | వని యవి యడిగిన నమ్మహాత్మ ‘శ్రీ నేను మీలో వసింపఁగా వచ్చితి’ | ననవుడుఁ ‘జంచల వైన నిన్ను నొల్లము మాలోన నునుపఁగా ననియె న | గ్గోవులు’ దాని కద్దేవి వగచి ‘యేను బాసిన సర్వదానవకులముఁ గీ | డ్పడియెఁ’ బొందిన సురల్ ప్రభుత నొంది; |
|
| తే. |
రేను వచ్చుట గోరి కాదే తపంబు | లాచరింతురు; నన్నిట్టు లభిభవించు టుఱవె మీ?’ కన్న ‘నధ్రువ మొల్ల మనుట | యభిభవమె? నీకుఁ బోలిన యచటి కరుగు.’ |
114 |
| క. |
అని గోవులు పలికిన సిరి | విని ‘మీచే నిట్లు పరిభవింపఁగఁబడి యేఁ జనిన నను నెవ్వరును గై | కొనరు; శరణ మగుఁడు వేఁడికొనియెద మిమ్మున్. |
115 |
| తే. |
మీ సమీపంబునం దున్కి మేలు; దాని | నిండు నా ‘కని యడిగిన నెంత యేని నాదరంబున నగ్గోవు లంతవట్టుఁ గూడి యిట్లను లక్ష్మికిఁ గురువరేణ్య! |
116 |
| క. |
‘మా మూత్ర పురీషంబులు | భామా! వేదంబు లెఱుఁగుఁ బావనములు నీ వీ మేలి వస్తువులఁ బ్రియ | ధామమ వై యుండు మింపు దలకొన మాకున్. |
117 |
| తే. |
అనుటయును సిరి ‘నాదు పుణ్యమునఁ జేసి | కంటిఁ బడయంగ మీ యనుగ్రహము’ ననుచు నట్లు వసియించె నిది గోమయ ప్రభావ | మూల మిట్టిది గోవు నమోఘ మహిమ. |
118 |
| వ. | మఱియు నొక్క విశేషంబు సెప్పెద నాకర్ణింపుము. | 119 |
| ఆ. |
సురభి తపము సేయ సరసిజాసనుఁడు ప్ర | త్యక్షమై ‘మనోరథంబు సెప్పు మిచ్చు కౌతుకమున వచ్చితి’ ననవుడు | నిట్టు లనియె నది మహీశవర్య! |
120 |
| క. |
‘మీ రిట్లు ప్రసన్నమతిన్ | గారవమున వచ్చినంతకంటెను మే లేఁ గోరంగ వలయునట్టిది | కారుణిక ప్రథమగణ్య! కలదే నాకున్?’ |
121 |
| వ. | అనిన నత్యంత సంతుష్ట స్వాంతుండై సురజ్యేష్ఠుండు సురభిం జూచి ‘సురలోకాది దివ్య లోకంబుల కెల్లను గోలోకంబు మీఁదుగా వరం బిత్తుంగాక’ యని తలంచి యవ్విశేషంబు మున్న తనవలన సిద్ధంబగుట సంస్మృతి గోచరం బగుటయు. | 122 |
| తే. |
గోవులకు మేలు సేయంగ గోరు నాదు | చిత్తమున మద్వరంబున సిద్ధమైన తెఱఁగ యొలసె దైవికమయి దీనిపెంప | యావహించెద నని యిచ్చె నవ్వరంబు. |
123 |
| క. |
వనరుహ సంభవుఁ డత్తెఱఁ | గునఁ దనలోకంబు కంటె గోలోకము స జ్జన వినుతచరిత! మీఁదై | యునికి వెలుఁగఁజేసి; నది మహోజ్జ్వల మయ్యెన్.’ |
124 |
| వ. | అని చెప్పి. | 125 |
| క. |
గోవిషయ వాక్యపఠన | శ్రావణ సంశ్రవణములు ధరావర యాయు శ్రీవ్శిభవకీర్తి సుగతి స | మావహములు దత్పరుండ వగు మిక్కథలన్. |
126 |
| వ. | అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవుతో ‘మహాత్మా! గోవుల మాహాత్మ్యంబు దేటపడం బెక్కు భంగులం జెప్పి నన్నుం గృతార్థుం జేసితి; సర్వయజ్ఞంబులందును దాతవ్యం బత్యంతంబు సువర్ణంబని విందు; వేదంబులు ‘సువర్ణ దక్షిణేతి వై’ యని చెప్పెడు; భూమియు గోవులుఁ గాంచనంబును నీ విషయంబులైన దానంబులు నుత్తమంబు అని వేదవ్యాసు వచనంబు కలిమి నీవ చెప్పితి; సువర్ణ విశేషంబు వినవలతుం జెప్పవే’ యనుటయు నతం డతని కిట్లనియె. | 127 |