| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
లోక హితార్థంబుగ ముని | లోకోత్తముఁ డాత్మ శిష్యలోకమునకు సు శ్లోకుఁడు పరాశరుఁడు ధ | ర్మాకారము లెఱుఁగ జెప్పె నంచితచరితా! |
270 |
| వ. | అవ్వాక్యంబులు సెప్పెద నందు భవత్ప్రశ్నవిషయంబయిన యర్థంబు నవగతంబగు నాకర్ణింపుము. | 271 |
| సీ. |
కరుణాఢ్యుఁడగు పరాశరమునివరుఁడు శి | ష్యులకు నిట్లను నింద్రియోత్కరంబు గెలిచి యంతశ్శత్రుకులమైన కామాది | వర్గంబు నోర్చి గర్వంబు వదలి త్రైవర్ణికులయెడ భావంబు భక్తిమ | యంబుగా శుశ్రూష యాచరించి శూద్రుఁ డైహిక సుఖసుగతులఁ బడయు వే | దాధీతితపముల నాచరించె |
|
| ఆ. |
నేని నుభయలోక హీనాత్ముఁడగు భూమి | సురనృపాల వైశ్య శూద్రులకును నధ్యయనము, బలసమగ్రత, వాణిజ్య | మనుచరత్వ మధిక ధనము లరయ. |
272 |
| క. |
ఇవి శాస్త్రదృష్టమార్గము | లవనిసురప్రభృతు లీ సదాచారంబుల్ సువిహతములుగా నడపిన | భువనద్వయమునను బడయఁ బోలుం బెంపుల్. |
273 |
| తే. |
ఇట్లు గా కాత్మధర్మంబు లెడల విడిచి | వర్ణములు నాలుగింట నెవ్వారలైన దొలఁగ ద్రొక్కినఁ బాటిల్లు దుష్టగతులు | మన్నకాలంబు పదపడి చన్నయపుడు. |
274 |
| వ. | అని పలికి శౌచవిధి యెఱిఁగింపం దలంచి యిట్లనియె. | 275 |
| క. |
మూత్ర పురీషోత్సృష్టికి | రాత్రి పగలు దక్షిణోత్తర దిశాముఖతా సూత్రణము వలయునది సం | ధ్యా త్రయమును నుత్తరంబ యగు నప్పనికిన్. |
276 |
| క. |
పలుకవలదు శౌచక్రియ | సలుపక మును, సలుపునపుడు జలములు దొడలం జిలుకుట యొప్పదు మృత్తిక | వలయు నపానంబునం ద్రివారంబు లిడన్. |
277 |
| క. |
గుదతలము నొవ్వఁ దోమినఁ | గదురును రోగంబు లేపగంధాపగమ ప్రదమగు కొలఁదిన శౌచము | సదురుగ నా చెప్పినట్ల సలుపఁగ వలయున్. |
278 |
| తే. |
అంబరంబున శౌచజలంబు వడుట | చెట్ట; శౌచ మల్లల్లన చేఁత మేలు; వామకరశుద్ధి దొల్తఁ ద్రివార మృత్తి | కా కలనమునఁ దద్ద సేయంగ వలయు. |
279 |
| క. |
కుడిచేతఁ బిదప డా చేఁ | గడిగి పొరిన్ సప్తమృత్తికా కలనమునం గడుగునది కరయుగము; మఱి | కడుగవలయు గుహ్య మల్పక మృదాకలనమునన్. |
280 |
| క. |
ఇమ్మెయి గుహ్యతలము శు | ద్ధమ్ముగ నొనరించి కేల్ పదంపడి జలధౌ తమ్ముగఁ జేసి సముత్థా | నమ్ము పిదపఁ బాదశోధనము సేయఁదగున్. |
281 |
| క. |
జనములు సూచుచునుండఁగ | జనదు మలము మూత్రమును విసర్జింపఁగ, న ప్పనులకు శౌచాచరణం | బునకు నవశ్యంబు నోలములు గావలయున్. |
282 |
| క. |
ఆపత్సమయంబున శౌ | చాపాదన మిట్టి భంగి నబ్బమి మలసం లేపన గంధము వోపఁ గ్రి | యాపరుఁడై చేయునది మృదాకలనంబున్. |
283 |
| సీ. |
బుద్బుద విరహితంబుగ వారిఁ గరమున | గొనకొని పొరి డెందమునకుఁ జేరు నట్లుగ నిశ్శబ్దమై యుండ ముమ్మాఱు | ద్రావి యిన్మాఱు తిర్యగ్విధమున నాస్యంబు దొడసి నీ రంఘ్రుల శిరమునఁ | బ్రోక్షించి యోష్ఠ సంపుటము ముట్టి నాసికాపుటములు నయనముల్ సెవులు మూఁ | పులు హృదయము నాభితలము మౌళి |
|
| ఆ. |
ముట్టవలయు హస్తములు పాదయుగమధ్య | గతములుగ నుద ఙ్ముఖత్వ మొండెఁ బ్రాఙ్ముఖత్వ మొండెఁ బ్రాపించి యిమ్మెయి | నాచమనము సేయు టార్యమతము. |
284 |
| సీ. |
ముమ్మాటి జలపానమున నోలి ఋగ్యజు | స్సామవేదంబులు సంతసిల్లుఁ దొలితొలి వక్త్రంబు దొడయ నధర్వ హ | ర్షంబును రెండవసారె ధర్మ శాస్త్ర తోషేతిహాస ప్రమోద పురాణ | సంప్రీతులును గల్గుఁ జరణయుగముఁ బ్రోక్షింపఁ బుండరీకాక్షుండు ప్రియమందు | నయనంబు లంటిన నలినహితుఁడు |
|
| తే. |
సమ్మదంబునఁ దేలు నాచమన సంప్ర | యోగ మిట్టిది వస్త్రయజ్ఞోపవీత ధరణముల నన్నపానతంత్రముల మున్ను | సేసి పిదపను నిది యనుష్ఠింపవలయు. |
285 |
| తే. |
ఆస్యశుద్ధి యొనర్చిన యపుడు వోక | భక్ష్యభోజ్య లవంబులు పండ్ల నడుమ నిలిచి పదపడి పోవుట గలిగెనేని | నాచమన మాక్షణంబ చేయంగవలయు. |
286 |
| వ. | శౌచవిధి సమస్త వర్ణసామాన్య ధర్మంబు, శూద్రునకు నాచమనం బోష్ఠపుటం బొకమరి ప్రోక్షించుకొనుటయు, దానిం గరంబున నడ్డం బొకమరి దొడయుటయు నింతియ. | 287 |
| క. |
తాను శుచిత్వం బేమిట | నైనను నేమఱక నియతి నతులితశుశ్రూ షానిరతుండై శూద్రుఁడు | మానిత విప్రులకు నోడి మనఁగా వలయున్. |
288 |
| సీ. |
అవనీసురుఁడు జపయజ్ఞుఁ డధ్యయనోప | జీవి తపశ్శోభి; భూవరుండు ప్రారంభయజ్ఞుండు పరమదండోప జీ | వకుఁడు పాలనశోభి; వైశ్యుఁడమల హవ్యయజ్ఞుఁడు విక్రయాజీవి యాతిథ్య | పరిశోభి, శూద్రుండు పరిచరత్వ యజ్ఞుండు శుశ్రూషణాజీవి దక్షత్వ | శోభి; యట్టులు గాని చొప్పు లఖిల |
|
| ఆ. |
వర్ణజాతులకు నవశ్యంబు; నాలవ | వాని కెమ్మెయిం ద్రివర్ణభక్తి వలయు నడప యతులవలన విశేషించి | నిత్యభజనపరత కృత్య మరయ. |
289 |
| క. |
యతి సర్వాశ్రమ చరణ | స్థితులకు నుత్కృష్టుఁ డతని తెరవూఁదిన శ క్తత కలిగినవారు శ్రుతి | స్మృతి విహితాచారులగుట మే లరయంగన్. |
290 |
| సీ. |
ప్రియవాదితయును శాంతియును దాంతియు ననా | లస్యంబు నతుల శీలంబు గలిగి నా కిది వలయు దీన సుదుస్తరంబును | ఘోరంబు నైన సంసారజలధిఁ గడతు నేనని భిక్షుకజనంబులకు నెవ్వి | హితము లప్పనులు సంతతముఁ జేయు చడుగులొత్తుచు నిష్ఠ మడుగుచు నీచత | ననుచరించుచు ధర్మమున నుపార్జి |
|
| ఆ. |
తంబులైన యట్టి ద్రవ్యసంచయములఁ | దృప్తి సేసి దేహగుప్తి నడపి పగలు రేయు నాక పరిచర్య నొనరించి | శూద్రుఁడిహపరముల సుఖము వడయు. |
291 |
| క. |
దానోపవాసముల స | న్మానితగతి లేదు శూద్రునకు యతి దెస స మ్మాననమునఁ దత్పూజా | ధీనరతిం గాని యెన్ని తెరువులఁ జూడన్. |
292 |
| తే. |
తెరువుఁ దప్పి తూఁగాడుచు నరుగుదెంచు | యతిఁ గనుంగొని మనమున నడరు పొడమ నెదురుకొని డప్పి తీర్చి సమ్మదముసేఁత | శూద్రునకు ధర్మవిధి యని శ్రుతులు చెప్పు. |
293 |
| చ. |
యతి రుజఁ బొందినం దొఱఁగ | నౌషధ కృత్యముఁ బథ్యమై సమం చితమగు నట్టి భోజనము సేర్చుటయున్ మలమూత్రముల్ జుగు ప్సితములు గాని భంగిగల చిత్తముతో జలకార్య మోపి వ ర్ణితముగఁ జేఁతయుం గల చరిత్రము శూద్రున కిచ్చు సద్గతిన్. |
294 |
| క. |
ఏ విధమున నోపిన యతి | భావము దుఃఖంబు వాపుపని సాదర చే తోవృత్తిఁ బూని చేయం | గావలయును శూద్రుఁడది సుగతి నొందించున్. |
295 |