| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
అపగత కామరోష హృదయాంతర ఖేలన కల్య! నిర్జపా జప మహిత ప్రతైక పర సంగధురాధిక లౌల్య! చంద్రమ స్తపనమయాక్ష! కౌస్తుభనితాంతరుచి స్ఫురితాస్థిదామ దీ ప్తి పటల చారువక్ష! మునిధీస్ఫుట భావిత! దేవ సేవితా! |
345 |
| క. |
సత్త్వాధిష్ఠాన కృత శు | భత్త్వ ప్రకటాభిధాన! భక్తాధీనా! తత్త్వం పదార్థరూపా! తత్త్వ సదనదీప! ధూత దైత్యాటోపా! |
346 |
| మాలిని |
జగదవన వినోదా! సత్యజాత ప్రమోదా! సగుణ విగుణ భంగీ! సంయమారామ సంగీ! విగత వికృత మూర్తీ! విశ్వభూత ప్రవర్తీ! సుగమగహన భూమా! సోమపింఛాభిరామా! |
347 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు దృతీయాశ్వాసము. | 348 |
| ఆనుశాసనిక పర్వంలోని మూడవ ఆశ్వాసం సమాప్తం. | ||