| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. | 002 |
| తే. |
అట్లు గృహమేధి ధర్మతత్త్వావగమము | దనకుఁ గలుగంగఁ జేసిన తాత కెఱఁగి మనుమఁ డూర్జితభక్తియు వినయగౌర | వంబు సమధికతావైభవంబుఁ బొంద. |
003 |
| వ. | ‘మహాత్మా! సుమనోధూపదీప నైవేద్యంబు లుత్తమం బులగు పూజాసాధనంబు లని వానింగొని దేవతలం బూజింతురు; తద్విశేషం బెఱింగింపవే’ యని యడుగుటయు నం డాదరభరితుం డయి ‘దీని శుక్రుండు బలి దానవేంద్రునకు బలి మనువునకు, మనువు సువర్ణుండను తపోధనునకు సువర్ణుండు నారదునకుం జెప్పి, రప్పరమముని నాకుం జెప్పె నత్తెఱంగు సెప్పెద నాకర్ణింపు’ మని పలికి యప్పుడమిఱేని కిట్లనియె. | 004 |
| సీ. |
‘ఓషధు లమృత మయ్యుత్తమ వస్తు సం | తతిలోనఁ బుష్పవంతములు మేలు; పుష్పముల్ గొని సురపూజ లొనర్చిన | మానవులకు మంచి మనసు గలుగు; నట్లు గావున సుమనో-భిధానము పుష్ప | ములకయ్యెఁ ద ద్ద్రవ్యపూజ లిచ్చు నరుల కోర్కులు సుమనస్కతఁ దీర్చుట | నమరులు సుమనస్కు లనఁగఁ జనిరి; |
|
| ఆ. |
కంపు రూపుఁ దెలుపుఁ గలిగి యకంటక | భూరుహాదులందుఁ బుట్టినట్టి పుష్పములఁ బ్రియంబుఁ బొంది కైకొండ్రు, ని | ర్జరులు పూజనములఁ గురువరేణ్య! |
005 |
| క. |
నలినంబులు జాజులునుం | దులసీదళములుఁ బ్రభూతతోషము గీర్వా ణులకుం జేయును, యక్షా | దులకు జలోద్భవము లెల్లఁ దుష్టి యొనర్చున్. |
006 |
| క. |
అరుణంబులును సకంటక | తరుభవములుఁ గటుకగంధధామములు నొన ర్తురు శాత్రవాభిచారిక | కరణమున నధర్వమాంత్రికతఁ గుసుమంబుల్. |
007 |
| తే. |
భూతరక్షోగణములకు భూపవర్య! తీక్ష్‌ణగంధపుష్పంబులు తృప్తిఁజేయు నలుపుఁదెలుపుఁ గలిగి పరిమళసుకాంతి | భరితములు నగు పువ్వులు నరుల మెచ్చు. |
008 |
| క. |
విను దేవాలయమునఁ బితృ | వనమునఁ బుట్టు కుసుమములు వలదు వివాహం బునకు శాంతికపౌష్టిక | వనితాజనరంజనాది వర్తనములకున్. |
009 |
| తే. |
కుసుమముల గంధమున దేవకోటి, వాని | దర్శనంబున యక్షులు; దదుపభోగ మున భుజంగప్రతాన మీమూఁడు దెఱఁగు | లను మనుష్యులు ప్రియమందు టనఘ! కలుగు. |
010 |
| క. |
దేవత లర్హ కుసుమ పూ | జావిధిఁ బ్రియ మంది యపుడ జనులయెడల సం భావించి వారి కోర్కులు | గావింతురు సఫలములుగఁ గౌరవనాథా! |
011 |
| తే. |
సల్లకీజాత నిర్యాస మెల్ల దేవ | తలకు మే లంతకంటె గుగ్గిలము లెస్స యగరు గంధర్వ యక్షోరగాదులకుఁ బ్రి | యంబు ధూపదానము నెడ నధిపవర్య! |
012 |
| వ. | ధూపదానంబులయందు నధికతరంబు కర్పూరధూపం’ బని చెప్పి మఱియును. | 013 |
| క. |
సమధురమును గటువును దీ | క్ష్‌ణమునగు గంధముల ధూపకలన వరుస హృ ద్యములు సురయక్ష రక్ష | స్సమితులకును దత్ప్రకారజాతులకు నృపా! |
014 |
| తే. |
తగినయట్టి ధూపము దేవతలకు నిచ్చి | పరమపుష్టియు నాయువుఁ బడయుఁ గర్త యక్ష గంధర్వపన్నగ రాక్షసులును | ధూపమున మెచ్చి కోర్కు లిత్తురు కుమార! |
015 |
| క. |
మలయజము నగరు మఱియుం | గలుగు సురభివస్తువులు నికామప్రియదం బులు వైహారికధూపం | బులయెడ మానవులచిత్తములకు నరేంద్రా! |
016 |
| ఆ. |
దైవతార్చ లపుడు తామసభూత ర | క్షోముఖంబు లైన కుత్సితంపు జాతులెల్ల దీపసన్నిధి నడఁగు న | ట్లగుట దీపదాన మధికఫలము. |
017 |
| క. |
ఆలోకదాన మున భూ | పాల! పరఁగు దీప మీగి భావము సద్ధ ర్మాలోకనశీలంబగు | నా లెస్స యొనర్చినట్టి యతనికి నధిఫా! |
018 |
| తే. |
ఘృతము సాలమి వర్తి నికృష్ట యగుట | దగ సమర్పించి పెంచుట ధరణినాథ! కాని యవి దీపదాన విధానమునఁ బ్ర | కాశవస్తువు దృఢదీప్తికముగ వలయు.’ |
019 |
| వ. | అని వెండియు. | 020 |
| క. |
‘ఒరు లిచ్చినదీపం బప | హరించి తత్పాతకమున నంధుండగు భూ వర! రథ్యాసభ గుడిపై | గిరి దీపంబిడి విభూతికిం బాత్రమగున్. |
021 |
| తే. |
ఆలనేయి ముఖ్యము; మహిషాదిమేష | జనిత ఘృతములుఁ దైలంబు మనుజనాథ! మధ్యమము లగు; మేదో-స్థి మాంసరసము | లరయ నింద్యముల్ దీపసమర్పణమున. |
022 |
| క. |
జ్యోతి స్సాలోక్య కులో | ద్ద్యోతన మహిత ప్రకాశయోగంబులు, పు త్రా! తెచ్చు దీపదానము | దాత కొసఁగు నమరపూజిత సుఖత్వంబున్. |
023 |
| క. |
దేవతలకు నగ్రపుసం | భావన నుపహార మిచ్చి పదపడి కుడువం గా వలయు నట్టు సేయని | ధీవిరహితుఁ డసుర యగుట దెల్లం బధిపా! |
024 |
| వ. | కావున. | 025 |
| క. |
తనయింటఁ గలుగు నన్నము | మును దేవతలకు నివేద్యముగఁ జేసి ప్రణా మనియమసహిత సమర్పణ | మునఁ గృతకృత్యుఁడుగ వలయుఁ బురుషుం డనఘా! |
026 |
| వ. | పూజకుండు శక్తి సంపన్నుం డయి యొనర్చిన. | 027 |
| క. |
తిలపిష్టము దధిదుగ్ధం | బులు మఱియును ధూపములును బుణ్యపరిమళం బులునగు పదార్థములు విబు | ధులకుం బ్రియ మొసఁగు బలివిధులఁ గురుముఖ్యా! |
028 |
| క. |
ఉపహారసమర్చకుఁడగు | సుపురుషు గృహదైవతములు శుభములఁ గూర్చున్ నృపవర! తత్కర్మరహితుఁ | గృపలేక నితాంతవిఫలకృత్యుం జేయున్. |
029 |
| ఆ. |
రక్తమాంస సహిత భక్త పిండముల ను | ల్లసితలోహితాక్త లాజములను సురను బలియొనర్ప నురగయక్షాసుర | ప్రముఖ భూతములు శుభంబు లొసఁగు. |
030 |
| క. |
సౌమ్యాసౌమ్యబలులు విను | సౌమ్యాసౌమ్య ప్రకార జనకృత్యంబుల్ సౌమ్యనృపోత్తమ | యయ్యై | కామ్యముఁ దత్తత్ప్రపూజ్య కరణిం జేయున్. |
031 |
| క. |
అగ్రప్రదాయి వర్ణస | మగ్రుఁడు బలయుతుఁడు బుద్ధిమంతుఁడు లోకా నుగ్రహ పాత్రము శాత్రవ | నిగ్రహశక్తుండుఁ దత్త్వనిష్ఠుండు నగున్.’ |
032 |
| వ. | అనిన విని యజాతశత్రుండు గంగాపుత్రుతో ‘సుమనోధూపదీపబలిప్రదానంబుల ఫలవిశేషంబు లింకను వినవలతుం జెప్పవే’ యనుటయు నప్పురుషవరుండా కురువంశవరున కిట్లను ‘నహుషువృత్తాంతంబున నది విస్పష్టంబగు వినుము చెప్పెద. | 033 |