| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
‘పరమేష్ఠి చెప్పిన పరమధర్మం బల్ప | ఫణితి మహార్థంబు భవ్యమతికి శ్రోతవ్యమును బరిజ్ఞాతవ్యమును దాని | విను ప్రకృతికిఁ బర మనఁగఁ బడిన యిరువ దేనగుతత్త్వ మరయంగ జీవాత్ముఁ | డాతండ సర్వభూతాత్మకుండు నరుఁడన వెలుఁగు నప్పురుషుని వలనన | కలిగి నారములన వెలసినట్టి |
|
| తే. |
యన్యతత్త్వంబు లతనికి నయన మగుట | నతఁడు నారాయణుం డన నతిశయిల్లు విశ్వమును దనయంద యావిర్భవింప | విలయ మొంద నద్దేవుండు విభుతఁ బొల్చు. |
365 |
| క. |
పరమ బ్రహ్మం బనఁగాఁ | బరతత్త్వం బనఁగఁ బరమపద మనఁగా నీ శ్వరుఁ డన విష్ణుఁ డన జగ | ద్భరితత నారాయణుండు దా వెలుఁగొందున్. |
366 |
| ఆ. |
అతఁడు వాసుదేవుఁ డన నాత్మ యనఁగ వే | దాంతవాక్యబోధ్యుఁడై వెలుంగు నరుల కప్పదములు నామాంతరంబు ల | ర్థాంతరంబు లేని యట్టి వనఘ! |
367 |
| ఆ. |
సర్వశాస్త్రవాక్యసమితి నాలోకించి | మఱియు దృఢవిచారమహిమఁ దెలిసి నిశ్చయింపఁబడియె నిష్ఠ నారాయణు | నెపుడుఁ దలఁపవలయు నిది యొకండ. |
368 |
| వ. | కావున. | 369 |
| క. |
పరమానుష్ఠేయం బిది | నరోత్తమా! నీవు నెపుడు నారాయణుఁ ద త్పరతఁ దలఁపు చొరకు సవి | స్తర శా స్త్రార్థముల క్రందుఁ దలపోఁతలకున్. |
370 |
| క. |
విను మొక యించుక సేపై | నను నారాయణునిఁ దలఁచినను సుగతిఁ గనున్ మనుజుఁ డనిన మదినెప్పుడు | నునిచిన యాతనికి బ్రాతె? యుత్తమధిషణా! |
371 |
| క. |
ప్రణుత యగు ‘నమోనారా | యణాయ’ యను నక్షరాలి నంతప్రాప్తి క్షణమున జిహ్వకుఁ దెచ్చినఁ | బ్రణవార్థం బైన పదముఁ బడయుదురు నరుల్. |
372 |
| క. |
నారాయణ పదవాచ్యం | బారయ బ్రహ్మంబు దాని ననిశము వినియున్ సారమతిం దలఁచియు నిం | పారఁగఁ బొగడియు రమించు టతులహిత మగున్. |
373 |
| తే. |
విండు నారాయణ పరాయణుండు పాత | కముల గెలిచి వెలుంగుటె కాదు తన్ను నాశ్రయించినవారికి నతులమైన | వెలుఁగు నొసఁగంగఁ జాలుట వేధచేఁత. |
374 |
| క. |
చతురాశ్రమముల లోపల | నతులమతీ! యెందు నిలిచి నతనికి భక్తిన్ మతిఁ గేశవుఁ గూర్పక స | ద్గతి పెఱకర్మముల నేల కల్గఁగ నేర్చున్? |
375 |
| క. |
కను టరిది యొండుమెయి వి | ష్ణుని భక్తిం గనుము నీవు సువ్రత! యద్దే వుని వినుము భక్త వత్సలుఁ | డను నామము గలిమి దృశ్యుఁ డగు భక్తులకున్.’ |
376 |
| క. |
అని నారదుఁ డుపదేశిం | చిన నానైష్ఠికుఁడు నియతచిత్తుండై వి ష్ణుని నర్చించు సభక్తిక | మననవిశేషమున నెపుడు మనుజాధీశా! |
377 |
| తే. |
శంఖచక్రగదాధరు శార్‌ఙ్గిఁబుండ | రీకదళసన్నిభాక్షుఁ గిరీటకుండ లాభిరాము శ్రీవత్ససంశోభివక్షుఁ | గౌస్తుభోజ్జ్వలుఁ గలలోనఁ గను నతండు. |
378 |
| క. |
చిరకాలంబున సాక్షా | త్కరణంబును గల్గు దానఁ గానని పదముం బొరయని శుభముం గలవే? | కురువర! నీవు నతిభక్తిఁ గొలువుము విష్ణున్. |
379 |
| క. |
అనిన విని హర్షపూరం | బునఁ జిత్తము దేల ధర్మపుత్రుం డా శం తను సుతునకుఁ బ్రణమిల్లెం | దనువునఁ బులకాంకురప్రతతి జాదుకొనన్. |
380 |
| వ. | ప్రణమిల్లి యతనితో ‘దానప్రియవచనంబుల రెంటియందును నధికరంజనంబెయ్యది? చెప్పవే’ యనుటయు నద్దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లను ‘రెండును మంచి తెఱంగుల యెదిరిచందం బెఱింగి నడపునది దానంబు రంజకం బగుటం దెలుపవలవదు సామవాదంబు గుణంబు దెల్లంబగునట్టి యితిహాసంబు వినుము చెప్పెద, బుద్ధి సంపన్నుండగు నొక్కబ్రాహ్మణుండు విజనంబగు వనంబునం గార్యవశంబున మెలంగఁ దన్మాంసం బాహారంబు గొనుటకయి దారుణుం డగు దానవుం డతనిం బట్టికొనిన సాంత్వనభాషణంబులు ప్రయోగించు వాఁ డయి యవ్విప్రుండు గలంకయుఁ గొందలంబును లేని డెందంబుతో నద్దానవు నాననంబు గనుంగొనిన నాధైర్యధుర్యుం గనుంగొని తదీయంబగు నుదాత్తత్వంబునం జిత్తంబు రంజిల్లి యద్దనుజుం డద్ధరాదివిజునితో ‘మదీయంబగు ప్రశ్నంబునకు సదుత్తరం బిచ్చితేని నిన్ను విడిచెద’ నను పలుకు పలికి తన శరీరంబు డయ్యుటకు వెలుకం బాఱుటకుం గారణంబేమి? యని యడిగిన నమ్మహీసురవరుండు వేగిరపడక కొండొకసేపు విచారించి ‘మహాపురుషా! నీ యట్టి కృపాపరుం డడుగం దోఁచిన తెఱంగునం జెప్పుట మేలు కాదె? యాకర్ణింపు’ మని సౌముఖ్యంబు నొంది. | 381 |
| సీ. |
‘చుట్టాల నీదగు చెట్టతనంబునఁ | బాసి పశ్చాత్తాపపరుఁడ వగుట, లేమి గల్గిన దుర్లభామేయధనములు | గోరుట మొగమోటగూరి యొరుని చేఁ బడ్డ నిన్ను గెల్చితి నని యాతఁ డు | బ్బుట కృప, నుపకారమునకుఁ బాత్ర ముగ నీవు చేసిన పురుషుఁ డా మేల్ దన | యలఘుపౌరుషమునఁ గలిగె ననుట. |
|
| ఆ. |
కుమతిజనులు నీదు గుణములు గొనియాడ | సిగ్గుపడుచు బుధులచేతఁ బొగడు గాన మరుగుచునికి, వీనిలో నొక్కట | గార్శ్య పాండురతలు గలుగు ననఘ!’ |
382 |
| వ. | అని వెండియు. | 383 |
| సీ. |
‘ఉచితంబుగా నెఱి నుగ్గడించిన మాట | సభ యియ్యకొనమి, వల్లభకు నీదు తప్పు తెల్లంబయి తాపంబుఁ బొందంగఁ | దేర్పంగనేరక త్రిప్పికొనుట, నీ సొమ్మునకు నొరుఁ డాసించుచుండంగ | దానికిఁ దగ రక్ష దలఁచుచునికి, దులువ పిమ్మట నిన్ను దూషించు పలుకులు | కులజులు నిజముగాఁ గొనుట, నీవు |
|
| తే. |
మానుషంబుల నడపంగ మాయకానిఁ | గాఁగఁ జెలులు గాంచుట, వగ కలిమి పేర్మి దాని వెలిపుచ్చ నోపమి, వీన నొకటఁ | గార్శ్య పాండురత్వంబులు గలుగు ననఘ! |
384 |
| వ. | అని మఱియును. | 385 |
| సీ. |
‘భార్య పుత్రకుఁ డల్లు డార్యవృత్తము లేమిఁ | గ్రుమ్మరించుట, జనకుండు దల్లి సోదరుల్ నవయుట, యుర్వీసురుని గోవుఁ | దొలుమేనఁ జంపుట, దుష్టబుద్ధి భూసురదేవార్థములు పుచ్చికొనుట, య | ర్థము గోలుపోక, బాంధవుల చావు, బాలిశు మొగమోటఁ బనికొనఁగాఁ దన | యశమున కంతరాయంబు గలిమి, |
|
| తే. |
పెద్దకాలంబు యత్నసంపీడ నొంది | చెల్లఁ జేసిన పని యొక్క పొల్లపగతు చే నసిద్ధతఁ బొందుట, వీన నొకటఁ | గార్శ్యపాండురత్వంబులు గలుగు ననఘ! |
386 |
| క. |
అని యిట్లేర్పడఁ జెప్పిన | విని యద్దనుజపతి మెచ్చి విడిచెం గుంతీ తనయాగ్రజ! భూసుర సాం | త్వన మిట్టిది; యడుగు మింక వలసినదానిన్.’ |
387 |
| వ. | అనిన నజాతశత్రుండు గంగాపుత్త్రువదనంబునం జూడ్కి నిలిపి మోడ్చి కరంబులు శిరంబునం గదియించి. | 388 |
| తే. |
‘మమ్ము సంసారవార్ధి పారమ్ముఁ జేర్చు | యానపాత్రంబు నీ కరుణాతిశయమ యఖిలకల్మషములఁ బాపునట్టి దాని | వినఁగఁ గోరెద నొక పురావృత్త మనఘ! |
389 |
| క. |
మునిమనుజపతుల సన్నిధి | నిను నీ కృష్ణుండు మాననీయచరిత! వే డ్క నుపాసించుచు నున్నాఁ | డనుత్తమప్రీతి దాని నాకర్ణింపన్. |
390 |
| క. |
సమ్మోదమ్మున నేనుం | దమ్ములునుం దేల సత్కథాకథన పర త్వ మ్మాదరింపు మునివ | ర్గమ్ము నృపచయమ్ము పులకరాజి వహింపన్.’ |
391 |
| వ. | అనుటయు భీష్ముండు. | 392 |
| క. |
‘పుణ్యం బగు నితిహాస మ | గణ్యగుణా! నీకుఁ జెప్పఁ గను సుకృతముఁ గా రుణ్యనిధి సర్వలోక శ | రణ్యుఁడు గృష్ణుండు విను వరంబుఁ బడసితిన్. |
393 |
| క. |
పారాశర్యాదిమునులు | నీ రాజన్యులును వినికి యెంతకు లేదీ గారాము నాకుఁ బరమో | దారపదావాప్తి గాదె ధర్మతనూజా! |
394 |
| వ. | నీ యడిగిన యట్టిదానికి నొక యితిహాసంబు గలదది యుమామహేశ్వర సంవాదం బనం బరఁగుఁ బౌరవోత్తమా! యప్పురావృత్తంబు ప్రవర్తించుటకుం గతంబైన కథ మున్ను సెప్పి, మఱి దానిం జెప్పిన నొప్పియుండుం గావున నప్పరిపాటిం జెప్పెద నవధానపరుండవయి యాకర్ణింపు’మని పలికి, హరికిం బరమభక్తిం బ్రణమిల్లి, యప్పాండవముఖ్యు ముఖచంద్రికం దనవిలోచనచకోరంబు లాన నమ్మానవపతికి నమ్మాననీయమతి యిట్లనియె. | 395 |