| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘అధికపుఁదపమున నైనది రాజత్వ; | మట్లు గావునఁ బేర్మి నతిశయిల్లు; జనములచే మ్రొక్కుగొనుటకు నిగ్రహం | బునకు ననుగ్రహంబునకు శక్తుఁ డై యుండు నతఁడు; తదీయ సునీతియ | విను ముదమున రాజు వినయపరునిఁ జేసి యెల్లజనంబు శిక్షించు, నింద్రియ | జయమును నరివర్గజయముఁ బడయు, |
|
| తే. |
నెఱిఁగి యుపధా విశుద్ధుల నిడు నమాత్య | పదవి, కనురక్త సారవద్బలముఁ బ్రోచు; హితవరుల మిత్త్రులుగఁ గొను నిలకు మేలొ | నర్చు, దుర్గంబు రక్షించుఁ, గూర్చు ధనము. |
045 |
| వ. | ఇవ్విధంబున సప్తాంగ సంపన్నత్వంబు నొంది. | 046 |
| ఇవ్విధంబునన్= పై పద్యంలో నిరూపించిన విధంగా. | ||
| క. |
చేయఁ డపాత్రవ్యయములు | సేయుం బాత్రవ్యయంబు సేయున్ నిజ ర క్షాయత్న మెల్లతెఱఁగులఁ | బాయక ధర్మంబు సేయుఁ బాపము దొఱఁగున్. |
047 |
| ఆ. |
ఆచరించు దండ మక్రోధకాముఁడై | చారదృష్టిఁ జూచు శత్రు కృత్య ములను, నాత్మదేశ పుర పరివారవి | ధముల సత్యభాషణముల నెగడు. |
048 |
| క. |
ఉద్యోగము ప్రియవాదిత |విద్యాపరినిష్ఠ సంధి విగ్రహ విహతా వద్యత దీనానాథ వి | పద్యాపన మాజ్ఞవెరవు వాటించుఁ దగన్. |
049 |
| ఆ. |
కయ్యమునకు నెపుడుఁ గాలు ద్రవ్వఁడు, తగ | వైన రణము శూరుఁడై యొనర్చు; యజ్ఞ దాన విధి పరాయణుఁడై యుండు | ని త్తెఱంగు వృత్త ముత్తమంబు. |
050 |
| క. |
ఈ నీతులకు విరుద్ధము | లైన పనుల నరకములకు నరుగు నృపతి పా పానీత దుఃఖ మొకతఱి | మాను నొరుల కతని కెపుడు మానక యుండున్. |
051 |
| ఆ. |
భావశుద్ధి గలిగి యీ వినీతులఁ బూని | ప్రజల కెవ్వఁ డతుల రక్షణంబు సేయు నట్టి విభుఁడు సిరియును గీర్తియుఁ | గాంచుఁ బుణ్యలోక గతియుఁ బడయు.’ |
052 |
| క. |
అనుటయు ‘ధర్మ రహస్యము | వినఁ గోరెద’ ననిన శాంభవికి శంభుం డి ట్లనియె ‘నహింస రహస్యం | బనఁ బరఁగును ధర్మజాత మఖిలమునందున్.’ |
053 |
| వ. | అనిన విని యా జగన్మాత యవ్విశ్వధాతతో ‘హింసావర్జనం బే జనులకుం జెల్లదని చూచెద; నహింస తెఱం గెఱింగింపవే’ యనిన నద్దేవుం ‘డది నీ తలంచినట్ల; నేలం బిపీలికా ప్రముఖంబుల నాకసంబున మశకాదుల మఱియుం బేను నల్లి సీరపేను లోనైన జంతువులం జంపక యెవ్వరికి మానరా; దట్లు గావున. | 054 |
| చ. |
ఫలము దళంబునుం దొడిమఁ బాయుట, రాలిన వానిఁ గొంచు నా కలి కెరవేసి గోరసము కార్యమునట్టుల నిర్వహించి బు ద్ధులు వెలిలేక నిశ్చలతఁ దోయజపత్రనిభాక్షి! చిత్రరూ పులొకొ యనంగ నుండు శమ పుణ్యులు సూవె యహింసనాత్మకుల్. |
055 |
| తే. |
అదియ శ్రుతిచేత ధర్మ రహస్య మనఁగఁ | బడియె’ నని చెప్పి మఱియును భవుఁడు దేవి కిట్టులను ‘నట్లుగాక యహింస తెఱఁగు | గలదు వినుము విశేషించి కమలనయన! |
056 |
| తే. |
విధి వశంబున మృతిఁ బొందు వివిధ జంతు | నిచయమం దనహంకార నిష్ఠుఁడైనఁ బురుషుఁ గల్మష మేమియుఁ బొందనేర; | దెట్టు లంటేని విను మది యేర్పరింతు. |
057 |
| సీ. |
దివియలోఁ బడుఁ బ్రువ్వు, దివియ యెత్తినవారిఁ | బాపంబు వొందునే, యోపి దున్న నాఁగేటిమొనఁ జచ్చు నానావిధ ప్రాణు | లన్నరుఁ బొందునే యఘము? వారు తమపనుల్ సేయ విధాతృవశమున నా | యువు దెగినట్టి జంతువులు సచ్చు; నేము సంపితి మని యించుకేనియు నహం | కారంబు వారికిఁ గలుగ; దట్లు |
|
| తే. |
గానఁ జూవె వారిఁ గల్మష మొందదు; | పుణ్యపాపములకు బుద్ధి మూల’ మని శివుండు మఱియు నను ‘హింసవోలెనై | యధిక ధర్మమైన విధము వినుము. |
058 |
| క. |
దైవగతిఁ జేసి తమకుం | జావవలసి గోవు లొండు చా వొల్లక స ద్భావమున రంతిదేవుని | కావించు మఖమునఁ బశుతఁ గైకొని నెమ్మిన్. |
059 |
| వ. | అనేక సహస్రంబు లరుదెంచి. | 060 |
| క. |
తము విశసించుట కా భూ | రమణుని వేడంగ నతఁడు రాజీవాక్షీ! క్రమమున విశసింపఁగఁ జ | ర్మములు దరులు గాఁగఁ బాఱె రక్తము నదియై. |
061 |
| క. |
ఆచర్మణ్వతి యను నది | గోచరమే వర్ణనమునకుం బ్రియ మగు కం పై చవిచేయం బొలిచి య | నీచమహిత సలిల మయ్యె నెత్తురు సుదతీ! |
062 |
| క. |
స్నానమునఁ బానమున నా | కానందము సేయు నమ్మహానది; గోసం తానము దివికి నరిగె; న | మ్మానవపతిఁ జెప్పనేల? మధురాలాపా! |
063 |
| క. |
పరబలముపై నడరి నె | త్తురు వఱ్ఱులు వాఱఁ జంపుదురు దురమున న ప్పరుసదనంబును బుణ్యో | త్తర మని వేదములు సెప్పుఁ దనుతరమధ్యా! |
064 |
| క. |
పోరుల యందలి మరణము | మారణముం బుణ్యలోక మహిత మహిమకుం గారణ; మెఱుఁగు మహింసా | కారం బిట్టి దని నీవ కమలదళాక్షీ!’ |
065 |
| సీ. |
అని చెప్పి వెండియు హరుఁడు పార్వతితోడ | నిట్లను ‘వేఁటకు నెలయు టఘము కాదు; సస్యములు మృగములచేత నశించు; | జగమెల్ల నిర్మనుష్యంబు గాఁగఁ గోరు మృగము; లది కారణంబుగ మృగ | హతి రాజులకు ధర్మమయ్యె; నట్లు గాక మృగములకుఁ గలుగు సద్గతి రాజు | చే మృతిఁ బొందినఁ జెలువ! వినుము |
|
| తే. |
దండ్యు దండింపకుండు, ట దండ్యు దండ | నంబు గూర్చుట, విప్రుమనంబు నొచ్చు నట్టి పనిసేఁతయును విను మనపరాధి | తనువు నొంచుట సూ హింస ధరణిపతికి’. |
066 |
| వ. | అని బోధించి. | 067 |
| క. |
‘భూసురుల కలుక వుట్టం | జేసి నహుష ముఖ్య నృపులు చెడుట ప్రసిద్ధం బాసురపతి విప్రునలుకఁ | గాసిఁ బడఁడె? తెలచి పడసెఁ గాదె నయనముల్? |
068 |
| క. |
కావున విప్రారాధకుఁ | డై వెలయు విభుండు రాష్ట్ర మతనిధనము సై న్యావలి బంధుల విప్రుల | దీవనలం బొదలు నింత తెల్లము దేవీ!’ |
069 |
| వ. | అని నిర్దేశించి కపర్ది గౌరితో వెండియు. | 070 |
| ఆ. |
‘పరమ మంత్రవిధులఁ బశువులు యూపంబు | లందుఁ గట్టఁబడి మహాశుచిత్వ విభవ మొందు విహిత విశసన క్రియ మేను | విడిచి దివ్యసుఖము వడయుఁ బొలఁతి! |
071 |
| క. |
హోమ విధులఁ దన్మాంసము | లామిషములు గాఁగ నొసఁగి యమరుల నగ్ని ష్టోమాదులఁ బ్రోవఁగఁ బర | మామిత సౌఖ్యములు గల్గు యజమానులకున్. |
072 |
| క. |
శ్రుతి విహితహింస హింసగ | మతిఁ దలఁపఁగ రాదు ముని సమాజం బిది దు ష్కృత తతిఁ బాపెడు పరమ సు | కృతమని కొనియాడుఁ గాన గీర్వాణనుతా! |
073 |
| ఆ. |
అని యహింస తెఱఁగు లన్నియు నెఱిఁగించి | ‘యింక నేమి వినఁగ నిచ్చసేసె?’ దనిన రుద్రు నడిగె నద్రిజ ‘జనుల జీ | వనము తెఱఁగు లెల్ల వనజనాభ!’ |
074 |
| సీ. |
అడిగిన నద్దేవి కద్దేవుఁ డిట్లనుఁ | ‘ గాంత! మానుష్యంబు కర్మభూమి; సుఖదుఖమూలముల్ సురతిర్యగాత్మక | త్వంబు; లట్లగుట విత్తంబు వలయు మనుజుల; కెట్లన్న విను ధర్మకామముల్ | విత్తసాధ్యంబులు; విద్య వార్త సేవ కార్షత యర్థసిద్ధికి మూలముల్; | విద్యవానికి ననవద్యతయును’ |
|
| ఆ. |
గర్షకునకు నేల కాల మెఱుంగుట, | జట్టికాని కేది సంభవించె నందు విలువ మొదలునగు లాభమును నెడ | వ్యయము గల్గుటయు శివ ప్రదములు. |
075 |
| క. |
పసులం బాలించునతఁడు | విసువక యేమఱక వాని విధము లెఱిఁగి ప్రో చి సమర్థుం డగు; వెరవునఁ | బసిఁ గను సేవకుఁడు ధనముఁ బడయుఁ బొగడుతోన్. |
076 |
| క. |
వంచనయును జాడ్యంబును | నించుకయును లేక ప్రభువు నిష్ట మెఱిఁగి తాఁ బంచిన పని వెరవునఁ గా | వించిన కర్మకరుఁ డొందు విపుల ధనంబుల్.’ |
077 |
| వ. | అని వెండియు. | 078 |
| క. |
‘పరధన పరదారల నప | హరింపమియు, దేవపితృ సమారాధనముం గరుణయు నతిథి సపర్యయు | గిరితనయా! యెల్లవారికిం గృత్యంబుల్.’ |
079 |