| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
‘క్షమయు సత్యంబుఁ గృపయు శౌచమును గురుల | వలని భక్తియు నాయువు పొలుపు నిచ్చు; నలుక బొంకు క్రూరత శుచితాపగమము | గురువిరోధ మాయువుఁ గడుఁ గుందఁ జేయు. |
130 |
| తే. |
తపమునను బ్రహ్మచర్యవ్రతమున హిత మి | తాశనమున రసాయనాభ్యాసమునను బెరుఁగు నాయు; వాక్రియలపై నరుఁడు ప్రీతి | గలుగుటయుఁ బూర్వభవకృత కర్మ ఫలము. |
131 |
| క. |
తన లావున కధిక మయిన | పనిసేయు టయుక్తమును నపథ్యము నగు భో జనములు హరించు నాయువు; | వనిత! యవియుఁ బూర్వకర్మ వశతన కలుగున్. |
132 |
| వ. | మఱియు నొక్క విశేషంబు సెప్పెద. | 133 |
| ఆ. |
సుకృతు లమరలోక సుచిరవాసులు నిట | దిగి చిరాయువులును నగుదు; రితరు లతిచిరముగ నరకగతు లయి తుది నాయు | వల్ప మగు మనుష్యు లగుట గలుగు.’ |
134 |
| క. |
నా విని భవాని ‘పురుష | స్త్రీ విధములు రెండు గలవు త్రినయన! వానన్ జీవుఁడు వర్తించు తెఱఁగు | నీ వేర్పడఁ జెప్పవే!’ యనియెఁ గంసారీ! |
135 |
| వ. | అనిన విని మహాదేవుండు మహీధరతనయ కిట్లనియె. | 136 |
| క. |
‘తాత్త్వికములైన పురుష | స్త్రీత్వంబులు లేవు పార్వతీ! జీవున; కా తత్త్వమున కహంకృతిఁ గ | ర్మిత్వ మొలసి భావ్యవిధమ మెయికొను చుండున్.’ |
137 |
| వ. | అని మఱియును. | 138 |
| ఆ. |
‘కర్మములకుఁ గర్తగాఁ డాత్ముఁ; డతని స | త్త్వము రజస్సుఁ దమము వాత పిత్త కఫము లెట్లు మర్త్యకాయ గతము లగు | నట్ల పొందుఁ గర్త లవియ చూవె. |
139 |
| తే. |
సత్య శౌచ దయాదులు సాత్త్వికములు, | రమణి! లోభ సంగాదులు రాజసంబు, లనృత హింసాపరత్వ భయాలసత్వ | ధైర్యహాని నిద్రాదులు తామసములు. |
140 |
| క. |
ఇవి నానాముఖములఁ బురు | షు వికారముఁ బొందఁ జేయుచుం బరఁగును హై మవతీ! కావున సర్వం | బు వినుము గుణకృత్య మిట్టి బోధం బొప్పన్. |
141 |
| తే. |
తన్వి! సాత్త్విక రాజస తామసాత్ము | లైనవారలఁ బుణ్యలోకానుభవము మనుజభావంబు నిరయపీడనముఁ బొందు | మోక్షలక్ష్మి నిర్గుణునకు మునుఁగ ముసరు. |
142 |
| వ. | అని వెండియు. | 143 |
| సీ. |
‘ఎట్టివి కర్మంబు లట్టివ నరుల శు | భాశుభసంప్రాప్తు; లట్లు గాక పర విప్రియమున మేల్ వడయుటయును గల్గుఁ | బతిభృత్యతతిఁ బటు భర్త్సనముల నొజ్జ శిష్యులఁ దర్జనోక్తుల వెజ్జు రో | గార్తుల నానా విధౌషధముల నలమటఁ బొందింతు రవ్విధంబుల చేఁత | లన్నియు సుకృతంబులై ఫలించు’ |
|
| ఆ. |
నని మఱియును జెప్పు ‘నఖిలేంద్రియో పేత | మగు జరాయుజంబు నండజంబు నువిద! చోఁకు నెఱుఁగు నుద్భిజ్జములు స్వేద | జముల కదియుఁ జూపు సంభవించు. |
144 |
| క. |
నరుఁడు జరాయుజములలో | తరుణీ! విను ముత్తముఁడు; శ్రుతము లేకున్నన్ సరి నతఁడు పశువుఁ; గావున | వరిష మ్ఠగునట్టి వినికి వలయు నరునకున్. |
145 |
| క. |
ఇరుదెఱఁగు విను తమము శా | ర్వరమును దేహజము శార్వరము దేజస్సం స్ఫురణమునఁ బాయు శ్రుతమునఁ | బరిహృతమగు దేహజంబు పర్వతపుత్రీ! |
146 |
| ఆ. |
బ్రహ్మ యా తమంబుఁ బాపుటకై తపో | వ్యాప్తిఁ బడసె శ్రుతులు నంగములును గానఁ గార్యములు నకార్యంబులును వానఁ | దెలిసి కొనఁగ బుద్ధి కలఁక దీఱు. |
147 |
| తే. |
క్రోధకామాదులైన దుర్గుణము లెల్ల | వాయుహతి మేఘపటలంబు వాయు పగిది శ్రుతముచేఁ బాయు; నరులలో సురల కరణి | శ్రుతయుతులు దేజరిల్లుదు రతిశయిల్లి. |
148 |
| తే. |
శ్రుతము నరునిఁ బరిజ్ఞానయుతునిఁ జేయు | వాని సుకృత మల్పమును ననూన ఫలము నిచ్చు; నజ్ఞాని సత్కర్మ మెంతయైన | నఫల మగుఁగాన శ్రుతవంతుఁ డగుట వలయు.’ |
149 |
| వ. | అని నిర్దేశించి సర్వేశ్వరితో సర్వజ్ఞుం డిట్లనియె. | 150 |
| సీ. |
‘మృతిఁ బొంది వేగ జన్మించినఁ బూర్వదై | హికము లన్నియు బుద్ధి నెలయువాఁడు జాతిస్మరుం డనఁ జను; నయ్యెఱుక పెద్ద | వాఁడు గాఁగాఁ జెడు; వనిత! వినుము పుట్టెఱుంగుట కల్మి బోధించుటకు నాస్తి | కులమును జన్మంబు గలుగు తెఱఁగుఁ; జచ్చిపోయిన వారు వచ్చి యత్తను వొంది | మెలఁగు టొక్కొక చోటఁ గలిగియుండు; |
|
| తే. |
నట్టి తెఱఁగు వెంగలు లైన యమునిదూత | లొరులఁ జని కొనిపోయినఁ గరుణతోడ న మ్మహాత్ముండు మగిడి పొమ్మన్న నరుగు | దెంచుటని నీ వెఱుంగు; సందియము లేదు.’ |
151 |