| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘పూజానమస్కారములకుఁ బాత్రములు బ్రా | హ్మణులు; వారలకుఁ గీ డాచరించి వాసవుండును జెడు; వారి సంతసమున | నఖిల శుభంబులు నావహిల్లు; ధర్మసేతువు లోకధారకం బఖిలశా | స్త్ర ప్రవర్తకము విప్రవ్రజంబు; తపమును వాక్కును ధనము విప్రుల కొక్క | కుడుపు మాత్రన పాపకోటిఁ బాతు; |
|
| తే. |
రమ్మహాత్ములు చొప్పరు లఖిలమార్గ | ములకు; విను దేవతలు దేవతలకు బాలుఁ డజ్ఞుఁ డన లేదు పూజకు నర్హు లనిన | నధిప! వృద్ధులఁ బ్రాజ్ఞుల నడుగనేల?’ |
336 |
| వ. | అనిన విని యజాతశత్రుండు ‘బ్రాహ్మణులఁ బూజించుటవలన విశిష్టంబయిన శుభం బెయ్యది దృష్టం బయ్యు వారలయందు వర్ణనీయం బగు వర్తనం బేమి గానంబడియె నీవిట్లు వారలం గొనియాడె? దెఱింగింపవే’ యనుటయు నాపగాపుత్రుండు ‘పవనార్జున సంవాదం బను నితిహాసంబు విను; మది భవత్ప్రశ్నంబునకు సదుత్తరంబై యుండు’ నని పల్కి య జ్జనపతి కిట్లనియె. | 337 |