| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనుటయు నవ్విభుండు ‘బ్రాహ్మణ మహానుభావం బింకను విన వలతుం జెప్పవే’ యనుటయు నప్పుడమిఱేనికి భీష్ముండు తనకు నింద్రియంబులును వాఙ్మనసంబులు నపుడు దుర్బలంబు లగుట యెఱింగించి ‘యినుండు దక్షిణాయనంబు తుది చేరుచు వచ్చె; దేహన్యాసంబు తడవులేమి దోఁచుచున్నది కృష్ణుండు నీకు విప్రజన విశేషంబు వివరించువాఁ’ డని పలికి యిట్లనియె. | 356 |
| తే. |
‘ఏను గృష్ణు నెఱుంగుదు మానవేంద్ర! | యెత్తెఁ గ్రీడావరాహమై యిద్ధరిత్రి; నిది యొకండును జెప్పఁగా నేల? కృష్ణు | లీలఁ గాదె భూమ్యాది భూతాలి గలిగె. |
357 |
| వ. | కృష్ణుండు. | 358 |
| తే. |
బొడ్డుతామరయం దొక్క పురుషుఁ డుద్భ | వించునట్లుగఁ జేసి తద్విరచనా ని భమున నఖిలచరాచర ప్రభవ మయ్యె; | నరయ సామాన్యమే కృష్ణు పరమలీల? |
359 |
| క. |
విను మెత్తఱి ధర్మంబులు | దనుజులచే బాధఁ బొందుఁ దత్సమయమునన్ జనియించి య ద్దురాత్ములఁ | దునుముం గృష్ణుండు ధర్మధుర్యులఁ గాచున్. |
360 |
| క. |
శూలియునుం దాన దిశా | పాలురునుం దాన విశ్వపతియును గురుభూ పాలవర! తాన కృష్ణుఁడు | కాలము దిక్కులును దాన కలఁ డఖిలములన్. |
361 |
| ఆ. |
అరయఁ గృష్ణుఁ డధ్వరాత్మకుఁ; డఖిలాగ | మోక్తమంత్రతంత్ర యుక్తి నతనిఁ బ్రస్తుతించి మేలు వడయుదు రధ్వర | కర్తలైన జనులు కౌరవేంద్ర! |
362 |
| క. |
చయనంబుల ఋగ్వేదం | బయ మహిత సువర్ణనాముఁ డగు కృష్ణు గుణో దయము వినుతించు యజ్ఞ | క్రియా నిరతులైన సురలు ప్రీతిం బొందన్. |
363 |
| క. |
విను ఋగ్వేదము కృష్ణుని | వినుతించుట యరుదె? యఖిలవేదంబులుఁ ద జ్జనిత విలాసంబులు వే | దనిరూపిత వస్తువుననఁ దాన కుమారా! |
364 |
| తే. |
అగ్నులును యజమానుఁడు నాహుతులును | యాగఫలరూపమును గృష్ణుఁ డని యెఱుంగు; మిన శశాంకతారకముల నెసఁగు తేజ | ములును గృష్ణమయంబుల భూపవర్య! |
365 |
| క. |
పరమజ్యోతి యనఁగ ని | ర్జరామర పదం బనంగ సత్యం బన భూ వర! యమృత మనఁగ దేవకి | వరసుతుఁడు వెలుంగు వేదవర్గము తుదలన్.’ |
366 |
| క. |
అని యి ట్లుపదేశించిన | విని మోదము నొంది పాండువిభునగ్రసుతుం డనిమిషతటినీ సుతునకు | వినతుండై నెమ్మనమున వేడ్క దలిర్పన్. |
367 |