| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| ఆ. |
‘అడుగ వలయుదాని నడిగితి నీవు న | న్నధిప! నామనము ప్రియంబుఁ బొందె; శివునిఁ దలఁచి మ్రొక్కి శివు దివ్యమహిమ సె | ప్పెద నితాంత విమల హృదయ కమల! |
384 |
| వ. | ఏకాగ్రచిత్తుండవై యాకర్ణింపు’ మని ధర్మజున కిట్లనియె. | 385 |
| క. |
‘శతరుద్రీయము నే నరుఁ | డతిభక్తిని శివుని మనమునందు నిలిపి యం చితముగఁ బఠించు సులభం | బతనికి సర్వంబు నిందు నందు నరేంద్రా!’ |
386 |
| వ. | అని వెండియు. | 387 |
| సీ. |
‘అమరు మహాదేవుఁడను పేరు శివునకు; | నప్పరమునకు మీఁ దరయ లేదు తత్కోపదృక్కీల ధర్మవిరుద్ధపు | జాతుల నెల్లను సమయఁ జేయు దేవతల్ మునులు నతి ప్రయత్నంబునఁ | గావించు దక్షయాగమున శివుని మఱచిన నయ్యజ్ఞ మఱవఱలై పోదె? | భగనేత్రనాశ మాదిగ ననేక |
|
| తే. |
భంగములు రావె? వారి కా ప్రభువు చేత; | శరణు వేఁడిన గావఁడే? కరుణ నట్టి వారి; నీశు పెం పేమన వచ్చు! మఱియు | వినుము తద్దివ్యలీలలు మనుజనాథ! |
388 |
| సీ. |
ప్రబలదైత్యులు పురత్రయనాయకులు జగ | త్త్రయము నప్రతిమ ప్రతాప లీల బాధింప దివిజులు ఫాలలోచనుఁ గాంచి | ‘కావుము కృప దేవదేవ! మమ్ముఁ బశువుల మగు వారిఁ బశుపతి వైన నీ’ | వనుచు మహాక్రోశ మాచరింప నప్పురంబులు మూఁటి నస్త్ర మొక్కటన భ | స్మము గాఁగఁ జేసి యమ్మార్గణంబు |
|
| తే. |
నంకమున నిడ నది బాలుఁ డైన ‘నీతఁ | డెవ్వఁ?’ డని చూచి వెఱఁగంది యెల్లసురలు వినుతిసేయ బ్రాహ్మణమూర్తి వెలుఁగు నతని | కిడియె దుర్వాసుఁ డనునామ మీశ్వరుండు. |
389 |
| తే. |
అతఁడు సూవె మాయింటికి నరుగుదెంచి | యంత సేసినాఁ’ డనవుడు నచ్చెరువును భక్తియును మదిఁ బిరిగొనఁ బాండు నగ్ర | సుతుఁడు నిభృతిమై దేవకిసుతునితోడ. |
390 |
| క. |
‘శివముఖ్యనామములు ప్ర | స్తవనకృతిన్ భోగమోక్షదము లగు నని విం దు విమలబోధ! యెఱింగిం | పవె వాని నిరుక్తి’ ననినఁ బరమప్రీతిన్. |
391 |
| వ. | అతం డిట్లనియె. | 392 |
| క. |
‘శివదేవు ముట్టఁ గొల్వఁగ | నవనీశ్వర! యతని పేళ్ళ యర్థ మెఱిఁగి సం స్తవనకృతిఁ గూర్ప నాకై | న విధాతకు నైన నరిది నామదిఁ జూడన్. |
393 |
| వ. | అయినను. | 394 |
| క. |
నీవిట్లు నన్ను నడిగితి | గావున నా యెఱిఁగి నట్టి గతిఁ జెప్పెద న ద్దేవాది దేవు వర నా | మావలి విను మచలమైన యవధానముతోన్. |
395 |
| ఆ. |
అగ్ని వాయు వాస వాదిత్య వసు మరు | దాదిదేవతా మయాత్ముఁ డైన శివుని మహిమఁ బ్రీతిఁ జెప్పుట వినుట స | ర్వార్థసాధకంబు లగు నృపాల! |
396 |