| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనిన విని యత్యంత సంతోషంబు నొంది కుంతీతనయాగ్రజుండు శాంతనవుతో ‘ధర్మంబులు బహుప్రకారంబులు గలవు; పరమానుష్ఠేయంబగు ప్రకారం బెయ్యది? దాని నెఱింగింపవే’ యనుటయు నజ్జనపతికి జాహ్నవీనందనుం డిట్లనియె. | 406 |
| ఆ. |
ధర్మములకు సంజ్ఞ తద్వేదులగు మహా | త్ములు తగంగఁ జెప్పుదురు నరేంద్ర! వినుము కాలపాకమున నది యన్యథా | త్వంబు గలిగి యవిశదత్వ మొందు. |
407 |
| వ. | ఎ ట్లంటేని. | 408 |
| క. |
అనఘ! యధర్మము ధర్మం | బను మతిఁ బుట్టించుఁ దృణ సమావృతమై ప్ర న్నని తలము చందమునఁ దోఁ | చిన నూయింబోలె సూక్ష్మచిత్తత లేమిన్. |
409 |
| క. |
తప్పక కాన్పఁగ లేమిం | జెప్పెడు వారలును దద్విశేషము దప్పం జెప్పఁగ ధర్మంబు తెరువు | దప్పు నది క్రియాపరులకు దైన్యము దెచ్చున్. |
410 |
| వ. | కావున ధర్మంబు సూక్ష్మ ప్రకారంబు. | 411 |
| క. |
శ్రుతముఁ బరిత్యాగముఁ గల | మతిమంతుల నడుగు లోభమదమోహసమా వృత బుద్ధులు గాని సమం | చిత చరితులవలనఁ దెలియు శీలనిరూఢా! |
412 |
| క. |
కామార్థంబులు మోహో | ద్దామత కృత్యంబు లని యెదం గని ధర్మ స్తోమమునఁ దగులు జనముల | చే మేలుగ నెఱిఁగి కొనుము సిద్ధవివేకా! |
413 |
| తే. |
అనఘ! యంచిత స్వాధ్యాయమునను యజ్ఞ | మున సమాచారమున నిష్ఠ పొనుఁగుపడక యుండు నెవ్వారలకు వార లోపి నడపు | నదియ కనుము ధర్మము సూక్ష్మపదము గాఁగ.’ |
414 |
| క. |
అన విని యుధిష్ఠిరుఁడు ‘నా | మన మిప్పుడు మీరు సెప్పుమాటల సందే హ నిరూఢ మయ్యె ధర్మము | గనుఁ గొన వలయుటకు బహుముఖత్వము కల్మిన్. |
415 |
| క. |
పారంబు లేని ధర్మా | చారంబున మునుఁగు మాదృశ క్షుద్రులకుం దీరం బిట్టిది యని తెలి | వార భవాదృశుల తగుదు రర్మిలిఁ జెప్పన్. |
416 |
| తే. |
ఆగమోక్త విధంబుఁ బ్రత్యక్షమును స | మాచరణముఁ బృథగ్విధ వ్యాకులములు ధర్మసూక్ష్మత యి మ్మూటఁ దథ్య మిట్టి | దనఁగ రాని యట్లున్నది యనఘచరిత! |
417 |
| వ. | అనిన నాపగేయుండు కౌంతేయాగ్రజుతో ని ట్లనియె. | 418 |
| క. |
‘ఇవి మూఁడు దెఱంగులు ధ | ర్మువు సూక్ష్మత నిశ్చయింప ముఖ్యపదంబుల్ దివిరికొని యివియ చూచుట | యవనీశ్వర! పూర్వమునులయందుఁ గలుగుటన్. |
419 |
| క. |
అనుమానింపకు మంధుం | డును నిశ్శంకాత్ముఁడును జడుండును బోలన్ జననాథ! యేను బల్కెద | విని దృఢముగ నూఁదు మింక వేయును నేలా? |
420 |
| క. |
విమలాత్మ! యహింసయు దా | నము సత్యముఁ గ్రోధవర్జనంబును విను ము త్తమ ధర్మరాశి యిది ధ | ర్మమునకుఁ బరసీమ దీని మరుపుము మదికిన్. |
421 |
| తే. |
బ్రాహ్మణారాధనమునఁ దత్పరుఁడ వగుము; | దక్కు మొండు విచారముల్ ధర్మపుత్త్ర!’ యనిన మానస మానంద మంద నాతఁ | డతని కతిభక్తి వందనం బాచరించి. |
422 |
| వ. | ‘ఎవ్వరు ధర్మంబునెడ నసూయ సేయుదు? రెవ్వరు దాని నుపాసింతు? రెఱింగింపుము. వారి వారి పొందుగతులును విన వలతుం జెప్పు’ మనిన నప్పౌరవోత్తమునకు న ప్పురుషసత్తముం డిట్లనియె. | 423 |
| సీ. |
‘వినుము రజస్తమో వికృతులఁ దగిలిన | మానసంబులు గల మానవులకుఁ గలుగు ధర్మద్వేషకలనంబు; వారలు | నరకవాసార్హులు ధరణినాథ! సత్య పరాత్ములు సతతంబు ధర్మ ము | పాసింతు; రూర్ధ్వ లోకాధివాస మునకు వా రుక్తులు; మునుమును పుట్టిన | సుతుఁడు ధర్మము పద్మజునకు దాని |
|
| తే. |
పాక సంపద సుమతు లుపార్జితగ ను | పాసనము సేయుదురు తియ్యపంటి పరువ మాదరించి తదుపచార మాచరించు | వెరవుగల యట్టి జనముల విధము దోఁప.’ |
424 |
| వ. | అనినం గౌంతేయాగ్రజుండు శాంతనవుతోడ ‘సాధులు నసాధులు నన నెట్టివారు? చెప్పు’ మనుటయు నమ్మహాత్ముం డి ట్లనియె. | 425 |