| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | ఏను బోయిన కొండొక కాలంబునకు నాఖండలుం డక్కుమారుండు దన్ను మిగులునని శంకించి చంపింపం దలంచి నన్నుం బర్వతునిం దలంచి పుయిలోడి బృహస్పతితో విచారించిన, నతం డతని భయం బుడిపె; నతండును దివ్యంబగుట సబుద్ధికంబైన వజ్రంబు నాలోకించి ‘నీవు శార్దూల రూపంబున సృంజయ సుతుండగు సువర్ణష్ఠీవిం జంపు’ మనుటయు నప్పని పూని యది సను సమయంబున. | 268 |
| సీ. |
సృంజయుం డుజ్జ్వల శ్రీసముల్లాస ప్ర | హర్ష మొప్పంగఁ బ్రియాంగనలును దానుఁ గుమార యుక్తముగ భాగీరథీ | తీరకాంతార ప్రదేశనిత్య వసనేచ్ఛమెయి నుండి కుసుమాపచయముఖ | బహువిధ కేలితత్పరత నొంది యొండుదలంపు లేకుండ నద్దంభోళి | వంచన నయ్యెడఁ బొంచి నిలిచి |
|
| తే. |
తెఱపి గాంచి శార్దూలమై యుఱికి వార | ణేంద్రసమయాను నమ్మానవేంద్ర తనయు వ్రచ్చి యంతర్హితం బయ్యెఁ; జచ్చె వాఁడు; | దాది యాక్రోశమున నార్తనాద మెసఁగ. |
269 |
| క. |
విని సృంజయుండును బ్రియా | జనములు వే పాఱుదెంచి చచ్చిన బాలుం గని బహులశోకపూరం | బున మునిఁగిరి విప్రలాపములు పెల్లెసఁగన్. |
270 |
| ఆ. |
అట్టి యవసరమున నమ్మహీపతి నన్నుఁ | దలఁచె; నప్పు డేను బలవిరోధి మది విరోధ ముడిపి మసలక వచ్చి య | బ్బాలు ప్రాణ మెత్తి ప్రమద మెసఁగ. |
271 |
| వ. | ఉచిత సల్లాపంబుల నించుకసేపు నిలిచి, యన్నరపతి యనుమతి సేయ నరిగితి; సువర్ణష్ఠీవియుం దండ్రికి సంతసం బెసంగు తెఱంగునం బ్రవర్తిల్లి యతని పిమ్మటం బృథ్వీభారంబు పూని శిష్టానుగ్రహ దుష్ట నిగ్రహంబులు నడపుచు, జన్నంబులు సేయుచు, శతాధిక సహస్రవర్షంబులు రాజ్యంబు సేసె’నని చెప్పి నారదుండు వెండియు. | 272 |
| చ. |
‘హరియుఁ బరాశరాత్మజుఁడు నాదరణాతిశయంబునన్ సవి స్తరత నుపన్యసించిన వచః ప్రకరంబు మహార్థ గాఢమి ప్పరమహితోపదేశములు పాటిగఁ బట్టి వసుంధరాధురా ధరణ మొనర్పు మయ్యెడు నుదాత్తయశంబును ధర్మవృద్ధియున్.’ |
273 |
| వ. | అనిన నజాతశత్రుం డూరకున్నఁ బరాశరపుత్రుండు పరమకరుణావిధేయచిత్తుండై యతని నుద్దేశించి యిట్లనియె. | 274 |
| సీ. |
‘క్షత్రియులకుఁ బ్రజాసంరక్షఁ గడచిన | ధర్మంబు గలుగునే? దాని వలన వేద సంచోదిత విప్రకర్మంబులు | లెస్సలయ్యెడు; నదిలేక యున్నఁ జెడియెడు; లెస్సైనఁ జెడినను రాజున | కగుఁ బుణ్యపాపంబు లగ్గలములు; గాన జనాభిరక్షణ మొనరింపుము’ | నావుడు నన్నరనాథుఁ ‘డిట్లు |
|
| తే. |
మీరు సెప్పంగ నురియాట మేలె రాజ్య | కాంక్ష మిగిలి, యేఁ జంపంగఁ గాని యట్టి వారిఁ బలువురఁ జంపిన క్రూరతా వి | శేష మాత్మదహించుటఁ జేసి గాక!’ |
275 |
| వ. | అనిన విని యమ్మునిపతి యమ్మహీపతి కిట్లనియె. | 276 |
| చ. |
‘మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరునాజ్ఞఁ జెల్లెడు న్వినుము కుఠారపాణి ధరణీరుహముల్ నఱకంగఁ బాప మొం దునొకొ! కుఠారమున్ జనులు దోసముఁ బొందరు కర్త యీశ్వరుం డనియెడి నిశ్చయంబు దృఢమై మది నిల్చినఁ జాలు భూవరా! |
277 |
| వ. | కర్మఫలం బీశ్వరుని యదియ; తదర్పణ బుద్ధి సహితంబుగాఁ బ్రబుద్ధులు వేదచోదిత కర్మంబు లనుష్ఠింతురు. | 278 |
| తే. |
ఒప్పకున్నను నాత్మకులోక్తకర్మ | మూర్ధ్వగతిఁ జేర్చుఁ; బరకర్మ మొప్పెనేని నార్యజనములు గిల్బిషమండ్రు దానిఁ; | గాన నడపుము నిజవంశకర్మ మధిప! |
279 |
| క. |
అరివధము పాప మని మది | మెరమెర గలిగినను, దగిన మెయిఁ జేయుము భూ వర! ప్రాయశ్చిత్తము గృహ | ధుర యుడుగుట మేలె కీడుతోఁ జన నగునే!’ |
280 |
| వ. | అనుటయుఁ గౌంతేయాగ్రజుండు సాత్యవతేయు నాననం బాలోకించి పుత్రులుం బౌత్రులు నన్నలుం దమ్ములు జనకులుం దాతలు మామలు గురువులు సంబంధులు సఖులు నల్లురు బావలు మఱందులు మఱియుఁ బవిత్రులగు ధాత్రీపతులు నాచేత మడిసిరి; తదీయ స్త్రీజనంబులు పతిసుత సోదర పితృ మరణశోక సంతాపాతిశయంబునం బలవించి పలవించి ప్రాణంబులు విడుతురు గావున దాని సూక్ష్మంబుగా విచారించిన వనితావధ పాతకంబునుం బాటిల్లె నెయ్యది కడగా నిష్కల్మషుండ నగుదు? నను వెగడున మునింగిన మనంబు మహీభరణంబున కెట్లు సొచ్చు? నుగ్రంబైన తపంబునం దనువు దొఱంగుట దక్క నొండు విధంబు నాకుం జూడ లేకున్న యది’ యనిన విని యమ్మునీశ్వరుండు నిజబుద్ధి నిపుణంబుగా నిరూపించి యన్నరపతి కిట్లనియె. | 281 |
| సీ. |
‘విడువు ముమ్మలికంబు వినుము నీ చెప్పిన | యందఱు భూముల కాసపడియుఁ బెంపును దేజంబుఁ బేరును గోరియు | నీసున సమరంబు సేసి చచ్చి రాపని కిల్బిషం బగునె నీ కట్లును | గాక వారల నెట్టి కర్మగతులు మృతులఁ గావించెనో మతి నెఱుంగుదె వాని | నెఱుఁగుఁ గాలుఁడు చావనేరి కెద్ది |
|
| తే. |
తఱి యతం డప్డు దెగటార్చు దాని నీవు | సేసినాఁడవుగా మదిఁ జింత సొనిపి యుడుకు టొక వెఱ్ఱి దీనిపై నొల్లగృహము | విడుతుఁ గా కనుటిది పెద్ద వెఱ్ఱి యధిప! |
282 |
| క. |
నేర్పరి పెక్కువిధంబుల | నార్పఁగ బొమ్మలు గడంగి యాడెడు చందం బేర్పడఁ గాన్పుము కాల స | మర్పిత కార్యకరు లైన మానవుల దెసన్. |
283 |
| వ. | నీకుం బాపంబునకుం బనిలేదు పనిగా కుండుంగాక! | 284 |
| క. |
ఇచ్చు కృప కల్మి యొప్పదె? | చచ్చిన నరపతుల యేలు జనపదములు నీ విచ్చెదవు గాక మనమునఁ | బొచ్చెము లేక తగ వారిపుత్రుల కధిపా! |
285 |
| ఆ. |
కొడుకు లేనిచోటఁ గూఁతుఁ బ్రతిష్ఠింపు; | దానఁ జేసి వారి తల్లు లధిక హర్ష మొందుదురు; ప్రియంబును నీ కగుఁ; | బుణ్యమును యశంబుఁ బొందు నిన్ను. |
286 |
| మ. |
అనుమానింపకు తోడఁబుట్టువులు గారా తున్మితూఁటాడె నెం దును గ్రొన్నెత్తురు లేఱులై పఱవ నింద్రుం డుగ్రతన్ దైత్యులన్? మును లవ్వీరు భజింపరే? క్రతువు లామోదంబుతో నమ్మహా త్మునిఁ జేయింపరె? యూర్ధ్వలోక మదిగాదో? యేలఁడో నాకమున్? |
287 |
| శా. |
నీవున్ ధర్మవిరోధులైన జనతా నింద్యాత్ములం బుణ్యమా ర్గావష్టంభము దేజరిల్ల నృపవంశాచార మొప్పారఁ దో డై వీరానుజు లుల్లసిల్లఁగ మహోగ్రాజిం దెగం జూచి తా దేవాధీశుఁడ పోలె శిష్టపరిషత్సేవ్యుండ వై తా పనిన్. |
288 |
| ఆ. |
వలయునేని యధిప! వాసవుచాడ్పునఁ | గ్రతుపరుండ వగుము; రాజధర్మ కలితమైన పుడమిఁ గైకొమ్ము; తొలిదొలి | యశ్వమేధయాగ మాచరింపు.’ |
289 |
| వ. | అనిన విని యంకిలి దేఱిన డెందంబుతో ధర్మనందనుం డెట్టి కర్మంబులు పాపంబు; లేపాపంబున కెద్ది ప్రాయశ్చిత్తంబు? మునీంద్రా! యెఱింగింపవే’ యనుటయు, నతనికి నమ్మహాత్ముం డి ట్లనియె. | 290 |