| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనినం గౌంతేయాగ్రజుం ‘డెట్టివారు దురితంబులు నిస్తరింపనేర్తు?’రని యడిగిన సురనదీసూనుం డిట్లనియె. | 46 |
| సీ. |
‘వర్ణాశ్రమాచారవంతులు నవిషయా | సక్తులుఁ బ్రతికారశక్తు లయ్యుఁ దిట్టాటవడి సైఁచు ధీరు లుదారులు | నతిథి పూజకులు నధ్యయనరతులు నగ్నిహోత్రపరులు నాజిఁ బిఱిందికి | నడుగు వెట్టక తెగి నడచువారు సత్యవాదులు సాధుజన పోషకులు సర్వ | దేవతా సములు నై భావ మెందు |
|
| తే. |
నిలిచె నమ్మూర్తి భక్తిమైఁ గొలుచువారు | దురిత దుర్గముల్ నిస్తరింతురు పురాణ పురుషుఁ డవిచింత్యుఁ డచలుండు పుండరీక | లోచనుండు సద్భక్తులఁ గాచు నధిప! |
47 |
| క. |
విను మగ్గోవిందుఁడు సఖుఁ | డును బంధుఁడుఁ గార్యకర్మఠుఁడు నై నిన్నుం గొనియాడుచుండ దురితం | బను పేరును గలదె నీకు ననఘచరిత్రా!. |
48 |
| ఆ. |
ఇంద్రుఁ డజుఁడు విష్ణుఁ డెవ్వాని వైదిక | స్తోత్రములఁ బ్రసాదితునిగఁ జేసి యెలమిఁ గొలుతు రమ్మహేశ్వరుఁ గొలుచు వా | రెందు నెపుడుఁ గీడు నొంద రధిప! |
49 |
| క. |
విను మివ్వాక్యము లెవ్వఁడు | గొనియాడుఁ బఠించు విప్రకోటికిఁ జెప్పున్ జననాథ! వాఁడు దురితం | బను దుర్గము నిస్తరించు నక్లేశమునన్.’ |
50 |
| వ. | అనిన విని ధర్మనందనుఁడు. | 51 |