| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
‘అసితోత్పల చ్ఛాయమై దంష్ట్రికాచతు | ష్టయమును, భుజ చతుష్టయము, జిహ్వి కలు రెండుఁ, బాదాష్టకంబును, శంకు క | ర్ణములును, బహునయనములుఁ గల్గి యూర్ధ్వ రోమంబులు నుగ్రారుణాస్యంబుఁ | గపిల జటాజాలకంబు నొప్ప నసి గదా శక్తి శరాసన ముసల చ | క్ర ప్రాస శర తోమర త్రిశూల |
|
| తే. |
పరశు ముఖ సాధనంబులఁ బాపజనులుఁ | దరతరంబ సంఛేదన తాడనాదు లైన వివిధ ప్రహతుల నే పడఁచుచును జ | రించు దండంబు సుజనులు ప్రియము నొంద. |
109 |
| సీ. |
పరుఁ డసంగుఁడు ధర్మపాలుండు ధర్ముండు | విజయుండు శాస్త్రంబు విశసనుండు గ్రహమక్షరుఁడు ప్రజాగరము దురాసదుఁ | డతి సత్యగుండు నిత్యగుఁడు శాస్త ప్రాగ్వచనుండు శస్త్రంబు బ్రహ్మము తీక్షణ | వర్ముండు మనువు శివంకరుండు కౌమారి సుతుఁడు శ్రీగర్భుండు వ్యవహార | తంత్రంబు సంగుప్త మంత్ర మనఁగఁ |
|
| తే. |
బరఁగు పేళుల నొప్పి యధ్వరమయాత్ముఁ | డైన విష్ణుండ దండమై యావహిల్లు శ్రీసరస్వతి యనునివి శిష్ట దండ | నీతి నామాంతరంబులు నృపవరేణ్య! |
110 |
| వ. | ధర్మాధర్మంబులు సుఖదుఃఖంబులు నయానయంబులు నర్థానర్థంబులు బలాబలంబులుఁ బ్రమాదా ప్రమాదంబులు మొదలైన సకలావస్థలును దండంబున సమ్య గసమ్యక్ప్రకారంబులం గలుగుం గావున సమ్యక్ప్రకారంబుచేత దండంబున రక్షింపంబడిన ప్రజ రాజు నభివృద్ధి నొందించు; నట్లగుట దండంబు రాజునకుం బరాయణంబు. | 111 |
| క. |
సత్యప్రకార ధర్మము | నిత్యానుష్ఠేయ; మది సునీత మగుచు నా దిత్యపతిఁ బ్రీతుఁ జేయఁగ | నత్యున్నతి నెసఁగు నాతఁ డన్నప్రదుఁడై. |
112 |
| వ. | దానంజేసి దండంబు ప్రసన్నంబై వెలుంగుఁ; దదీయాభిధానంబులు మఱియునుం గల; వాకర్ణింపుము. | 113 |
| ఆ. |
పురుషుఁ డీశ్వరుండు భూతాత్మకుండు జీ | వుండు ప్రాణుఁ డక్షయుండు సత్త్వ మనఁగ నేడు పేరు లష్టమంబు ప్రజాప | తి యనఁ బరఁగు దండదేవు పేరు. |
114 |