| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
స్మయభయ దర్పిత క్షుభిత సామజమర్దన రక్షణ క్రియా శ్రయణ విలాస భాసుర భుజా! చరణ ప్రణతామర వ్రజా! జయ విభవ ప్రభుత్వ ధనసంప దుదాత్త చరిత్ర కీర్త్యు పా నయన కృతార్థ సేవక జనా! మునిసంభృత యోగపూజనా! |
529 |
| క. |
తరణి శశినేత్ర! జగదుప | కరణీయ చరిత్ర! బోధగాత్ర! తపస్సం భరితశమ ముని మనోజ్ఞా! | భరణీయ ప్రాజ్ఞ! విశ్వభార విధిజ్ఞా! |
530 |
| మాలిని |
వరద చరణ లీలా! వైకృతాగమ్య శీలా! విరతి నిరతి సేవ్యా! వేదవిద్యా విభావ్యా! నిరవధిక విభూతీ! నిశ్చయాతీతరీతీ! భరిత కరుణ దృష్టీ! భక్తమాధ్వీక వృష్టీ! |
531 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బైన శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందు తృతీయాశ్వాసము. | 532 |
| శాంతిపర్వంలోని మూడవ ఆశ్వాసం సమాప్తం. | ||