| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
‘వేదవిదుం డగు విప్రనందనుఁడు మే | ధావి నామకుఁడు మేధావివరుఁడు సత్సమయంబున జనకుతో ‘నాయువు | జనులకు వేగంబ చనుచునుండు; దీనిపైఁ గనువెట్టి ధీరత దలకొల్పి | మేలు వాటిల్ల నెమ్మెయిఁ జరించు వా రొకో?’ యనవుడు వానికి ని ట్లనుఁ | దండ్రి ‘యాలును నపత్యంబు గలుగు |
|
| ఆ. |
తెఱఁగు నడపి యజ్ఞతృప్తనిర్జరుఁ డయి | శమము నొంది కాననమున కేఁగి సౌమ్యవృత్తి ముక్తి సాధించి మృత్యువు | నలఘునియతి గెలువవలయు ననఘ! |
21 |
| వ. | అనిన విని మేధావి తండ్రి కి ట్లనియె. | 22 |
| సీ. |
‘నిక్కమ కాలంబు నీకుఁ గొంత గలట్లు | వలికెదు; నీవు గర్భంబు సొచ్చి నప్పటి నుండియు నన్వేషణము సేయుఁ | గొనిపోవుటకు మృత్యు వని యెఱుంగు; మివిరెడు నీటి మీనవు గావె? దారపు | త్రాదిసక్తుండగు నతనిఁ గాన నమున సుప్తుండైన నరుఁ బులి గొనిపోవు | నట్టులు సూ మృత్యు వపహరించుఁ ; |
|
| తే. |
జేసినది సేయుచున్నది సేయవలయు | నది యనంగల కార్యంబులందుఁ దగులు వాని మృత్యు వేపునఁ దన వశముఁ జేయుఁ | గాన కాలంబు నేమనఁ గాదు తండ్రి! |
23 |
| క. |
భీరుఁడు శూరుఁడు జడుఁడు వి | శారదుఁ డబలాత్మకుండు సబలుండన లే దేరినయిన మృత్యువు దు | ర్వారంబై యపహరించు వైదికవర్యా! |
24 |
| క. |
విను సంసృతి మృత్యువు ప | ట్టనఘా! నిస్సంగవృత్తి యమరగృహము నె ట్టన ని ట్లగుటం గనికొని | తునుముము సంసారరజ్జు దురితవిదూరా! |
25 |
| క. |
అమృతము మృత్యువు నన స | త్యము మోహము గాన విను మహాత్మా! యే స త్యమునన మృత్యువు గెల్చెద | సమసుఖదుఃఖుండ నగుచు శాంతిపరుఁడనై. |
26 |
| తే. |
నాకుఁ బ్రజ గతి నిచ్చు ననంగవల వ; | దేన ప్రజనయి పొడమెదఁ గాన యేను నన్నుఁ గనుచున్న నది మోక్షణంబు సేయు | నాశపడ; నట్టులగుటఁ బ్రజాభియుక్తి. |
27 |
| క. |
విను పశుయజ్ఞము హింసన | మనంతఫలదంబు గా; దహంకృతిసహితం బనఘా! వాఙ్మనసనియమ | మను యాగం బిచ్చు నవ్యయానందంబున్. |
28 |
| వ. | కావున నీవును. | 29 |
| క. |
కామ క్రోధాద్యములగు | నీ మానస వికృతు లుడిపి యేకాంత గుహా రాముఁడవై నిను వెదకుట | సూ మే; లొండెల్ల నుడుగు సులభవివేకా!’ |
30 |
| క. |
అని పుత్రుం డుపదేశిం | చిన జనకుం డట్ల చేసి చెందె సుఖంబున్ మనుజేంద్ర! యవ్విధము గని | కొని యూఁదుము సత్యధర్మ కుశలత్వంబున్.’ |
31 |
| వ. | అని చెప్పిన విని యజాతశత్రుండు శంతనుపుత్రునితో ‘జగంబున ధనవంతులు నధనులుం గలిగి యుండుదురు. వారలలోన సుఖు లెవ్వరు? దుఃఖు లెవ్వ?’రని యడిగిన నక్కురుపితామహుండు ‘శమ్యాకుం డను నొక్క శాంతిపరాయణ బ్రాహ్మణుండు సంసారంబు వదలవిడిచి కూడు సీరకు నవసియుండునట్టివాఁడు; దొల్లి నాకడకు వచ్చి గోష్ఠీప్రసంగంబున నుపదేశించిన వచనంబులు గలవు. వాని వినుమవి భవత్ప్రశ్నంబునకు నుత్తరంబులై యుండు’ నని పలికి యిట్లనియె. | 32 |
| తే. |
‘ధనము కలిమియు లేమియుఁ ద్రాసునందు | నిలిపి యెత్తంగ ములు సూపె నిర్ధనత్వ మెక్కుడై; దాని దిక్కున నెట్టులన్న | వినుము గుణదోషముల భంగి విస్తరింతు. |
33 |
| క. |
ధనము గలవాఁడు మృత్యు వ | దనమున నున్నట్లు భయము దన చిత్తమునం దనుకగ నుల్లల నుడుకును | విను శిఖి చోరాదిముఖ్య విషయాపదకున్. |
34 |
| క. |
కోపంబును లోభంబును | నేపారి మనంబు గలఁప నెప్పుడుఁ జింతా తాపంబు నొందు సధనుం | డాపదగా కవ్విధము సుఖావహమగునే? |
35 |
| క. |
ఎచ్చోటనైన నధనుఁడు | విచ్చలవిడి నుండు; లేదు వెఱ పించుకయుం; బొచ్చెపుఁజందం బొల్లఁడు; | మెచ్చరె సురలైనఁ? బలుకు మృదువై యుండున్. |
36 |
| క. |
లోకము చందము గనికొని | యీ కానఁగ నగు ధనాదు లెల్లను గాల వ్యాకులతఁ బొందఁ గలయవి | గాకుండమి యెఱిఁగి విడుపు గడుఁ జదు రెందున్. |
37 |
| క. |
ధనవత్త్వము దుఃఖకరం | బని కని తత్కాంక్ష విడుచు నతని కధనతా జనితాత్మాధీనత్వం | బనుపమ సౌఖ్యంబు సేయు నక్షీణముగన్.’ |
38 |