| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అని చెప్పె ననిన విని ధర్మతనయుండు పితామహుతో ‘ధన తృష్ణాభిభూతుండగు పురుషుం డేమిట సుఖియగు?’ ననుటయు నయ్యమరనదీనందనుండు ‘ధనార్జనంబుతోడి విసువుటం బుట్టిన విడుపున సుఖంబు గలుగు నయ్యర్థంబుఁ దెలిపెడునది యొక్క యితిహాసంబు గలదు విను’మని యిట్లనియె. | 39 |
| సీ. |
మంకి నాఁ బరఁగు బ్రాహ్మణుఁడు ధనేచ్ఛమై | వర్తించు శిక్షింపవలయునట్టి గుజ్జుదోయిని జట్టిగొని ప్రీతి లంకించి | యుండ లంకియతోన గండు మీఱి పాఱె నక్కోడియల్ పడియున్న గనపలొ | ట్టేనుంగు పై నది యెగసి పఱవ నుభయ పార్శ్వంబుల నురిపోసిన ట్లవి | వ్రేలి చచ్చినఁ జూచి విప్రుఁ డడలి |
|
| తే. |
‘రత్నములుఁ బోని వత్సతరంబు లకట! | వ్రేలుచున్నవి లొట్టేన్గు వెంటఁ దవిలి’ యనుచు నిర్వేద మొంది యిట్లనియెఁ దన్నుఁ | గరుణతోడఁ గనుంగొను నరులతోడ. |
40 |
| తే. |
సారమతిఁ బరికింపంగఁ బౌరుషంబు | కంటె దైవంబు ముఖ్యంబు గార్యసిద్ధి; కెచట నేనియుఁ బౌరుష మెసకమెసఁగె | నేని యది దైవదత్తంబ యింత నిజము. |
41 |
| వ. | కావున. | 42 |
| క. |
మనమునకు సుఖము గోరెడు | జనులకు నర్థక్రియా విశారద భంగుల్ పొనుపడ విడిచి భరము లే | కునికియ యూహించి చూడ నుర వెబ్భంగిన్.’ |
43 |
| వ. | అని పలికి యుద్దామంబైన కామంబు విడుపువడకున్నఁ జిత్తంబునకు నిర్వ్య తి గలుగునే? యను విచారంబు పుట్టి తదీయోత్సారణం బూహించి యా చిత్తధర్మంబు నుద్దేశించి. | 44 |
| క. |
‘నీ మూలం బే నెఱిఁగితిఁ | గామమ! సంకల్పమునన కలిగెదు సంక ల్పామర్శరహితమగు చే | తోముద్రం దాల్తు నేను దుది యది నీకున్. |
45 |
| వ. | అని కామం బనునది గోర్కి గావునఁ గోర్కి యొప్పమి దేటపఱుపం దలంచి. | 46 |
| తే. |
సొమ్ము గోరినయంతన సుఖము గలుగ; | దది యుపార్జింపఁగా సిద్ధియగుట నిజమె? కలిగెనేని యనేక చింతల నొనర్చుఁ | జెడుట చావుతోఁ దుల్య మయ్యిడుమ యేల? |
47 |
| వ. | ఇచ్ఛా నిరసనంబు సుఖం’బని వెండియు. | 48 |
| క. |
‘శోకశ్రమ తృష్ణలకున్ | నీ కలిమియ యోల మగుట నీ కగపడు వాఁ డే కర్తవ్యము గానం | డో కామమ! నిన్ను దొఱఁగి యుండెద సుఖినై. |
49 |
| క. |
నీ వాస పఱుప ధనములు | గావించెదఁ బో వినాశకముల నుడుపఁగా నీ వశమె? కాన నీ చెడు | టే వగపుం దేదు పెనుపదే దైన్యంబున్? |
50 |
| చ. |
సులభమొ దుర్లభంబొ యని చూడ నెఱుంగవు గన్నదానిపై నలముదు కామమా! యిడుమ లందఁగఁ జేయుదు నిండు టేమిటం గలుగదు నీకు నీతెఱఁ గగాధ రసాతల భంగి నీవు స న్పొలమునఁ బోవకుండ నినుఁ బుచ్చెద బచ్చెన రూపు పోకలన్. |
51 |
| తే. |
ధనము చేటున విసివి నామనము నిన్ను | నెడలవిడిచెనో కామమ! యేను శాంతి దాంతి సత్యక్షమాభూతదయలఁ జెంది | నాఁడ; లోభాదు లందవు నన్ను నింక. |
52 |
| తే. |
కామ సుఖ దివ్య సుఖములు కాంక్ష దొఱఁగు | మేలి షోడశాంశంబునఁ బోలలేవు గాన కామమ! నిను శత్రు కరణిఁ జంపి | బ్రహ్మపురమున నుండెద రాజుఁ బోలె.’ |
53 |