| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
వారి కి ట్లనియె ‘నిష్ఠారంభమతి నిలు | వెడలి కోర్కుల కెల్ల విముఖుఁ డగుచు జనములకీడు వాక్చక్షుర్మనోవర్త | నములఁ గూర్పక మైత్రి సమతఁ గరుణ గలిగి, నిందాప్రశంసల ఖేదమును నుబ్బు | లేక పాడింటను నేకతంపు గుడి మ్రాని పొంతను గుహలోన నుండుచు | డంపకములకు వంటకములకును |
|
| తే. |
భోజనములకుఁ దఱియైన ప్రొద్దు గడపి | భిక్ష గొనుఁ బ్రీతి మన్నన పెద్దవెట్టు నట్టియెడఁ దక్కి క్రొత్తగా నరుగు యతి ని | రంతరంబు నాత్మారాముఁ డై చరించు. |
393 |
| తే. |
అనిన వారు కృతార్థులై యతనిఁ బ్రస్తు | తించి రని చెప్పె విని నరదేవవరుఁడు దేవతటినీ తనూజుతో ‘భావశుద్ధి | కలిమి యొప్పుఁగదే!’ యని పలికి మఱియు. |
394 |
| తే. |
రాజభావంబు తొడుసునఁ గ్రచ్చుకొన్న | మనసుతో నుండ కెన్నఁడో మరలి యింద్రి యముల నిర్జించి సత్త్వాదు లవులఁ ద్రోచి | యేను శాంతిసుఖంబున కెలయు టనఘ!’ |
395 |
| చ. |
అనుటయు నాతఁ డిట్టు లను నక్కురుభర్తకు ‘వేగ మేటికిన్ ఘనభుజ? యెల్లచందములుఁ గాలముతోడివ చుమ్ము; వర్ణధ ర్మనిరతి చిత్తపాకము గ్రమంబునఁ దెచ్చుఁ గషాయపక్వతన్ బనుపడ కర్హుఁ డేలగు నృపాలకుమారుఁడు సన్న్య సింపఁగన్? |
396 |
| వ. | ఇవ్విషయంబున వృత్రగీత యను నితిహాసంబు గలదు వినుము. వృత్రుండు భండనంబునం బడిన నెత్తికొనిపోయి పెట్టుకొని యున్న యెడ నయ్యవస్థ నొందియు విషాదంబు లేకయున్న యద్దనుజవిభునితో శుక్రుండు ‘వైరిహృతవిభవుండవైన నీకు మనోవ్యథ లేమికిఁ గతంబేమి?’ యని యడిగిన నతం డతని కిట్లనియె. | 397 |