| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
తెలుపుదురు సాంఖ్యులును యో | గులుఁ దమతమ తెఱఁగు మేలగుట కారణసం కలితముగ నాకుఁ జూడఁగ | నలఘుగుణా! యొక్క రూప యయ్యిరు దెఱఁగున్. |
572 |
| క. |
ప్రత్యక్షహేతువాదులు | సత్యపరా! యోగపరులు సాంఖ్యులు శాస్త్రా ర్థాత్యంతనైపుణులు స | ద్గత్యాకలనంబు సరియ తదుభయమునకున్. |
573 |
| క. |
ఆ తెరువులు రెంటికి వే | ఱై తోఁచుట దర్శనంబునంద నరేంద్రా! భూతహితము సద్వ్రతచ | ర్యాతిశయము శౌచమును నియతకృత్యంబుల్.’ |
574 |
| వ. | అనిన విని యుధిష్ఠిరుండు ‘భూతదయయును, సద్వ్రతధారణంబును, శౌచంబును దుల్యంబులై సాంఖ్యయోగంబులకు దర్శనంబు వేఱగుట యెట్లు? వివరింపవే’ యనుటయు, నన్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె. | 575 |
| క. |
‘యోగులకు యోగబలమున | రాగము మోహంబునుం జిరస్నేహముఁగా మాగమముఁ గ్రోధము గుణా | యోగము వరుసఁ బెడఁబాప నున్నతి యొలయున్. |
576 |
| చ. |
ఘనఝషమున్ సముద్ధతమృగంబును జాలము వ్రచ్చి వాగురా వినిహతిఁ జేసి యిష్టపదవిం జను చాడ్పున యోగతంత్రరో ధనమగు లోభ జాత దురితవ్రజముం బెడఁబాచి సత్పథం బునఁ జరియించు యోగి సుఖమూర్తిత సుస్థితగా వహించుచున్. |
577 |
| ఆ. |
యోగబలము లేని యొకభంగి యోగి బల్ | ద్రోపు లేని మీను నేపు లేని మృగము వలయు నురియుఁ దెగిపోవ నుఱుకంగ | లేనియట్ల భవములోన నడఁగు. |
578 |
| ఆ. |
అల్పమైన యగ్ని యడఁగు నింధనములు | మీఁద వైవ బలము మిగులలేని యోగమట్ల తనకు నురునట్టి దానన | సాదమొందు సకలజనమనోజ్ఞ! |
579 |
| ఆ. |
ఇద్ధమైన యగ్ని ఇంధన సంపద | నతిశయిల్లు నట్టు లధికబలస మగ్రసారయోగ మహిమయు నంతంత | కగ్గలించు వ్రతము లగ్గలింప. |
580 |
| క. |
స్రోతోవేగము పటుగతి | వీతబలుం దిగుచునట్లు విషయము లీడ్చుం జేతోబలసంభృత యో | గాతిశయుఁడు గాని వాని నంచితచరితా! |
581 |
| క. |
నది రయము వారణేంద్రుఁడు | గుదియించిన యట్ల పోలెఁ గురువర! దైన్యా స్పదమగు విషయోల్లాసముఁ | గుదియించును యోగసిద్ధి గురుహృద్బలుఁడున్. |
582 |
| తే. |
కుపితుఁడగు నంతకుండును గ్రోధఘోర | మృత్యువును నైన నియమసమృద్ధయోగ బలునిదెస వోవఁ జాల రప్రతిహతముగ | నెందుఁ జరియించు నతఁడు నరేంద్రముఖ్య! |
583 |
| క. |
భోగంబుఁ దపముఁ బొరిఁబొరి | రాగవిరాగతల హృదయరంగమునకుఁ గే ళీగతులఁ దెచ్చి యార్చుచు | యోగి యనుభవించుఁ దగిలియుండం డెందున్. |
584 |
| క. |
జగతీవర! యోగస్థూ | లగతులు సెప్పితి వినం గలదు సూక్ష్మవిధం బగుమార్గ ప్రచయము ద | న్నిగదన మవధానమున వినిన మతి దేఱున్. |
585 |
| క. |
ఏమిగతి లక్ష్యభేదముఁ | దా మేలుగఁ జేయు ధన్వి తత్పరుఁడై యో గామల చిత్తుఁడు మోక్షం | బామెయి సాధించువాఁ డహంకృతిదూరా! |
586 |
| ఆ. |
నేతికుండ మోచి యే తెఱఁగున సోబ | నాలు వ్రాఁకు నైపుణంబు గలుగు పురుషుఁడట్ల యోగపరిణతుండును నాత్మ | నేమఱక విముక్తి కెక్క వలయు. |
587 |
| తే. |
రథికునకుఁ గలమరికి సారథియుఁ గర్ణ | ధారుఁడును బోలె నాత్మకుఁ దాను సుపథ వర్తనైకవిధాయి గావలయు యోగ | ధారణా నిశ్చలుం డగు ధీరు డధిప! |
588 |
| క. |
శిరమును నాభియు హృదయము | నురమును గర్ణములుఁ బార్శ్వయుగళము నాత్మా దరణీయస్థానము ల | య్యిరవులఁ గనుయోగి యాత్మ నిభపురనాథా!’ |
589 |
| వ. | అనిన నజాతశత్రుం డాపగాపుత్రునితో నిట్లనియె. | 590 |
| తే. |
‘యోగి యెట్టి యాహారంబు లుడుగవలయు? | నాతఁ డెబ్భంగి భోజ్యంబు లనుభవించి బలము వడయువాఁ?డిది నాకుఁ దెలియఁజెప్ప | వే జనస్తవనీయసమిద్ధబుద్ధి! |
591 |
| సీ. |
అనవుడు నతనితో నతఁడు ‘సుస్నిగ్ధంబు | లైన యాహారముల్ మానువాఁడు యోగి; నీరసముల నుదకంబులను జాల | నాఁకలి పుచ్చుచు నవియు నుదర మధికపూర్ణంబగు నట్లుగాఁ గొనక వ | ర్తించుట బలము వర్ధింపఁజేయు’ నని చెప్పి వెండియు ననుఁ ‘గామమును గ్రోధ | మును నిద్రయును దృష్ణయును భయంబు |
|
| తే. |
రతియు నరతియుఁ బవనంబుగతియు నుడిపి | ధారణా నిశ్చలుం డయి తన్నుఁ దాన కనుచునుండెడు యోగి దుర్గంపుఁజోటు | వెడల నరిగి సుఖస్థానవిభవ మొందు. |
592 |
| క. |
జనవర! యసిధారావ్రత | మనఁదగియెడు ధారణానియతి పనుపడు నె వ్వని చిత్తంబున నా యో | గనిరూఢున కరిది యైన కార్యముఁ గలదే. |
593 |
| క. |
యోగనిరూఢుఁడు సంగ | త్యాగానందైకరతుఁ; డతనికి జనన సం యోగము మృతిదైన్యంబును | భోగాభోగ సుఖదుఃఖములు లే వధిపా! |
594 |
| క. |
అతనికి సరిత్సముద్ర | క్షితిభృ ద్ద్వీపములు గేలికిం బట్టులు దా మతిఁ దలఁచెనేనిఁ బరిశాం | తత నున్నను గుడియు గుహయుఁ దగుమందిరముల్. |
595 |
| క. |
విముఖుం డగుటయుఁ గీళులు | దమయంతన చెందు జనులఁ దా వారలకున్ సుముఖుం డగుటయు శుభములు | సమకూరును శివునియట్ల చరితము లెల్లన్.’ |
596 |
| వ. | అని చెప్పి వెండియు. | 597 |
| తే. |
‘యోగతంత్రంబు సకలశాస్త్రోదితంబు | విను విశేషించి లోకైక విభుఁడు సెప్పె దీని నారాయణుఁడు; మునిమాననీయ | మిది మనంబునఁ దెలిసికొ మ్మిద్ధచరిత!’ |
598 |
| వ. | అనిన విని ధర్మతనయుండు ‘యోగతంత్రప్రకారంబు భవత్ప్రసాదంబునం బ్రబుద్ధంబయ్యె; సాంఖ్యస్వరూపం బెట్టిది యెఱింగింపవే’ యని యడిగిన, నతనికి దేవవ్రతుం డిట్లనుఁ ‘గపిలాది మహాముని దర్శితంబైన మార్గంబున వివరించెద. | 599 |