| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| శా. |
లీలాస్వీకృతచక్రశూల! వినతాళీరక్షణాలోల! దు శ్శీల స్వాంతవిదూర! వేదజలదశ్రేణీమయూరా! సమి త్కేలీఖండిత దైత్య! నిర్జరగణక్షేమక్రియానిత్య! ని స్త్రైలోక్యత్వ నిరంజనాగ్రవిహృతీ! సంస్థాపకవ్యాహృతీ! |
630 |
| మాలిని |
జపయజన నిషేవ్యా! సంగనిర్ముక్తభావ్యా! విపుల దురితభేదీ! విశ్వలోకప్రమోదీ! యపరిమిత విభూతీ! యప్రమాణస్వరీతీ! యుపనిష దవగమ్యా! యోగభావ్యైకరమ్యా! |
631 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందుఁ బంచమాశ్వాసము. | 632 |
| శాంతిపర్వంలో పంచమాశ్వాసం సమాప్తం. | ||