| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
అనిన నొడఁబడి యట్లకా కనుడు నన్న | రేంద్రునకు భక్తి మ్రొక్కి సురేంద్రపుత్త్రుఁ డతనిచేత దీవన గొని యవ్విరోధు | లున్న దెస కేఁగె సంతోష ముత్కటముగ. |
230 |
| వ. | ఇట్లు ధర్మజుని యొద్ద వాసి విజయుండు చనుటకు నుబ్బిన మన సైన్యంబులం గనుంగొని యమ్మహీపతి ధృష్టద్యుమ్నుతోఁ ‘గౌరవులు గరుడ వ్యూహంబుగా మోహరించిన వారు; దీనికి నీవుం దగ మండలార్ధ వ్యూహంబు సమకట్టు’మని పనిచిన నతం డట్ల చేసె; నివ్విధంబున నుభయవ్యూహంబులును గాఢసన్నాహంబులై శంఖ భేరీ ప్రముఖ తూర్యస్వనంబులు సెలంగ నడు వాన కాలంబునం బొంగిన గంగా యమునలుం బోలె నొండొంటిం దార్కొను సమయంబున నయ్యజాతశత్రుండు ద్రుపదపుత్రు నాలోకించి గురుం జూపి. | 231 |
| క. |
‘నేఁ డీ బ్రాహ్మణు చేతం | బోఁడిమి సెడి యేను జిక్కిపోవక యుండన్ వేఁడిమి మెఱయు శరంబుల | వాఁడిమి సొంపెల్లఁ జూప వలయుం జుమ్మీ!’ |
232 |
| క. |
అనుడు నతఁడు నవ్వుచు ని | ట్లను ‘నే నాఁగంగ ద్రోణుఁ డని నిను గదియం జనువాఁడె? యింత యేటికి? | నను నీతఁడు గెలువలేఁడు నమ్ము మధీశా!’ |
233 |
| వ. | అని పలికి పారావత వర్ణాశ్వ వర్ణనీయ రథుండగు నయ్యతిరథుండు గుంభసంభవునకు సమ్ముఖంబుగా నడుచుటయు, నా ధృష్టద్యుమ్ను దర్శనంబు దనకు నరిష్టం బగుటయు నగ్గురుం డొక్కింత విన్ననై యతని దిక్కు దేఱిచూడం జాలక క్రేడించి పాంచాల బలంబుపై నిశిత విశిఖంబులు పరఁగించుచుం బాయవడ నడరె నంతనక్కడ. | 234 |
| సీ. |
క్రీడి యాఁకొనియున్న కేసరి హరిణ చ | యము మీఁదఁ జనునట్టు లా త్రిగర్త వరులపై నరుగంగ వా రట మున్నర్ధ | చంద్రాకృతిగఁ నొడ్డు సంఘటించి కొనియుండి యాతనిఁ గని ప్రీతి నార్పులు | బొబ్బలుఁ జెలఁగంగఁ బొంగుటయును జూచుచు నా సవ్యసాచి మందస్మితుఁ | డై కృష్ణుతోడ నిట్లనియెఁ ‘జూడు |
|
| ఆ. |
మెక్కుడైన రవము నెసకంపుటుబ్బునఁ | బొదలుచున్నవారు మదము కతన; నెదిరిఁ దమ్ము నించుకేనియు నెఱుఁగరు | వీరు క్రొవ్వి చావ వేఁడి రకట!’ |
235 |
| వ. | అని మఱియును. | 236 |
| క. |
‘తగు సంతసింపఁ గుజనుల | కగపడని విశిష్టగతికి నస్మద్దివ్యా శుగములచేఁ బోఁగనుటకు | విగత భయత్వంబు సమరవిధి కొప్పుఁగదా!’ |
237 |
| వ. | అనుచుం జేర నడచి దేవదత్తంబు పూరించిన. | 238 |
| ఉ. |
ఆ నినదంబు సాంద్రముగ నాకసమంతయు నిండఁ బర్వుడున్, మానసముల్ గలంగి, యభిమానము ధైర్యముఁ దూలి, విద్విష త్సేన నితాంత నిశ్చలతఁ జిత్ర సమర్పిత మూర్తియో యనం గా, నులి వేది యుండియును గ్రమ్మఱఁ దేఱె రవంబు మీఱఁగన్. |
239 |
| వ. | ఇట్లు దెలివొంది యొండొరులం బురికొల్పికొని సంశప్తకు లొక్కపెట్ట ఫల్గునుపయిం బటు శరపరంపరలు గురిసి; రతండు దవ్వుదవ్వులఁ బదియేను వేల రథంబుల వారిం గూల్చినం బెలుచ నబ్బలంబు లడరి. | 240 |
| క. |
శరము లొకఁడొకఁడు పదిపది | పరఁగింపఁగ మూఁట మూఁటఁ బార్థుఁడు నొంచెన్; సరి నైదై దేయఁగ న | న్నరుఁ డందఱ రెంట రెంట నలి నొప్పించెన్. |
241 |
| వ. | అట్టియెడ సుబాహుండు గ్రీడి కిరీటంబు దశవిశిఖంబుల నేయ నతం డతనిపై ననేక శరంబులు పరఁగించిన సుశర్ముండును సురథుండును సుధన్వుండును బాసటయై యప్పార్థుం దాఁకిన. | 242 |
| ఆ. |
వారి కేతనములు వడిఁ ద్రుంచి యవ్వీరుఁ | డా సుధన్వు హయ శరాసనముల తునియ లవనిమీఁదఁ దొరఁగించి తన్మస్త | కంబుఁ దునిమె తేరుగముల కుఱికి. |
243 |
| క. |
ఇరువే యుద్భట రథములఁ | బొరిగొనుటయుఁ బెఱ బలంబు పురికొనక వెఱం దెరలుచు గుంపులు గట్టుచుఁ | గురుపతి సైన్యంబు పొంతకుం జనుచుండెన్. |
244 |
| వ. | ఇట్లు భయభ్రాంతులైన సైనికులం గనుంగొని సుశర్మ యెలుంగెత్తి. | 245 |
| క. |
‘వెఱవకుఁ డిట మరలుఁడు ము | న్నెఱుఁగరె? యర్జునునిఁ గురుమహీపతి కడ నే డ్తెఱఁ బలికిన పంతంబులు? | మఱతురె నో రెద్ది రిత్త మరలిన మనకున్?’ |
246 |
| వ. | అని బరవసంబు సేసిన నా సైనికులు గోల్తలసేసి; రప్పుడు నారాయణ గోపాలు రెక్కడెక్కడ యని వారిం గూడి కడంగిన నిస్సాణాది తూర్యరావంబులు సెలంగుటయు వాసవి వానుదేవు నాలోకించి. | 247 |
| చ. |
‘ఒడలను బ్రాణముల్ గలుగ నూరక యుండుదురే త్రిగర్తు లి ప్పుడ నుఱుమాడి పోద మటు వోవఁగనిమ్ము రథమ్ము’ నావుడుం గడువెస నా ధనంజయుని కాంక్షిత మెక్కడ నక్క డెల్ల నె క్కుడు ముదమొప్పఁ దేరు రథికోటులపైఁ బఱపెన్ ముకుందుఁడున్. |
248 |
| క. |
విమలాంబుదములు పూనిన | విమానమో నాఁగ మెఱసె వెలిమావుల వే గము సొంపున నయ్యరదం; | బమరేంద్రుని లీలఁ బొలిచె నతని సుతుండున్. |
249 |
| వ. | ఇట్లు మండల ప్రచారగత ప్రత్యాగతాది వివిధ గతులం దేరు సంచరింపం జేయుచు నిలింపకోటికిం గన్నుల పండువు సేయం బుండరీకాక్షుం గనుంగొని నారాయణ గోపాలురు గుపితాత్ములై యర్జున దుర్యోధనులు ద్వారకా నగరంబునకుం బోయిన నాఁడు కృష్ణుతోడి సరిగా దుర్యోధనుఁడు దమ్ముఁ గోరికొనిన వాఁడగుటం జేసి యీసునం బేర్చి య న్నరనారాయణుల మేనుల నానాస్త్రంబులు నినిచిన నరుండు దేవదత్తంబు పూరించి యవష్టంభంబునం ద్వష్టయిచ్చిన మహాస్త్రంబు ప్రయోగించినం దత్ప్రభావంబున. | 250 |
| క. |
గాండీవి చందమయి వా | రొండొరులకుఁ దోఁచి యొకళు లొకళుల నానా చండాస్త్ర శస్త్రసముదయ | ఖండితులుగఁ జేసి పడిరి కలనం గలయన్. |
251 |
| వ. | ఇమ్మెయిఁ గృతార్థంబైన దివ్యాస్త్రంబు పదంపడి శాంతం బగుటయు హతశేషులు వోక పొదివి రథరథ్యకేతు సహితంబుగా సవ్యసాచి నాభీల శరజాల సంవృతుం జేసిన. | 252 |
| క. |
ఆ పార్థుఁడు గోపానల | దీపితుఁడై విశిఖశిఖల తీవ్రనిహతి న త్తూపులగమి నేర్చి జముని | ప్రోపు గుడువఁ బుచ్చె వారిఁ బురువంశనిధీ! |
253 |
| వ. | ఇవ్విధంబున విజృంభించి యట్టహాసంబు సేయుటయుం దుండి మగధ కేరళ మచ్ఛిల్లికాదు లడరి సాయక నికాయంబులం గప్పిన. | 254 |
| క. |
నానాస్త్రంబుల నాతఁడు | పీనుఁగు పెంటలుగఁ జేయఁ బిరుసనక మహా సేనలు దోడ్తో డగ్గరి | యా నరుపైఁ బెల్లుగురిసె నమ్ముల వానల్. |
255 |
| క. |
కరి తురగ రథపదాతులు | బెరసి కదిసి చుట్టుముట్టి భీషణ హేతి స్ఫురణ మెఱయఁ జేరిన న | చ్చెరువుగ విజయుండు సించి చెండాడె వడిన్. |
256 |
| వ. | సంశప్తకులు మఱియును. | 257 |
| క. |
పెరయీఁగలగతిఁ గవియుచుఁ | బొరిఁ బొరిఁ గడుఁదురుల పగిదిఁ బొదువుచు నెరకై వెరవునఁ గాకులుఁ గ్రోఁతులుఁ | బరువడిఁ జీకాకుపఱుచు భంగి నలఁచుచున్. |
258 |
| వ. | పెనంగి; రందుఁ గొందఱు వీరావేశంబున. | 259 |