| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
సాత్త్వ వతేయ వాఙ్మయవిశాల గృహస్ఫురిత ప్రదీపితా! ప్రత్త్వ య గోచరా! విహృతి భగ్న నిశాచర! శాంత బోధసం పత్త్వ వినాభవన్మహిమ భాసుర! సంభృత భూసురాళి సాం గత్త్వ ! వివిక్త యుక్త జనకౌశల భావిత! దేవసేవితా! |
395 |
| క. |
వేదశిరోమణి చరణా! | నా దాంత స్ఫారకరణ నైష్ఠికతరణా! భేద రహిత ప్రకారా! | వాద విదూరా! విరించివర్య విహారా! |
396 |
| మాలిని |
అనుపమ హితవిద్యావ్యక్త! యోగానురక్తా! దనుజ మథనలీలా! స్తవ్యశాంతానుభావ్యా! జననమరణ దుఃఖోత్సారి! సర్వోపకారీ! సనకముఖయతీంందాసన్న! నిత్యప్రసన్నా! |
397 |
| గద్యము | ఇది శ్రీమ దుభయకవి మిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున ద్రోణపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 398 |
| ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. | ||