పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. లలిత చతుర్దళాఢ్య కమల ప్రసవ ప్రసరత్సరస్వతీ
విలసన సౌరభోద్గమ నివిష్ట! మహామహిమాభిరామ! కే
వల సుఖితానుభూతిమయ వైభవ సార! జగజ్జనిస్థితి
ప్రళయ విధాన కేళి పరిపాటి వికస్వర! నిత్యభాస్వరా!
381
క. హృదయ సరసిరుహ మధుపా | స్పద విహృతి విశేష! నిహత పాపోన్మేషా!
వదన సముత్థిత వేదా! | మదవదసుర హరణ కరణ మంత్ర వినోదా!
382
మాలిని ముని సముదయ హృద్యా! మూలవిద్యాఽనవద్యా!
వినమదమృతవృష్టీ! విశ్వలోకైక దృష్టీ!
మనన సుగమమూర్తీ! మంత్రరూప ప్రకీర్తీ!
జనిమృతి భిషగాత్మా! శశ్వదాహ్లాదవర్త్మా !
383
గద్యము ఇది శ్రీ మదుభయ కవిమిత్త్ర, కొమ్మనామాత్య పుత్త్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున ద్రోణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 384
ద్రోణపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )