| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. | 2 |
| ఆ. |
పార్థుఁ డిట్లు ప్రతిన వట్టిన నది నిర్వ | హించు పనికిఁ గృష్ణుఁ డివ్విధమునఁ బూని రాత్రి యన్ని పోకలఁబోవుట | విని విచిత్రవీర్యుతనయుఁ డులికి. |
3 |
| క. |
‘ఇమ్మెయి వేగినఁ బాండవు | లెమ్మెయిఁ గార్యంబు నడపి? రెఱిఁగింపుము; చి త్తమ్ము కలంగెడు సంజయ! | నమ్మితి నగ్గురుఁడు గాచెనా మిమ్ము ననిన్?’ |
4 |
| వ. | అని అడిగిన నమ్మహీశ్వరునకు సూతసూనుం డిట్లను; ‘నట్లు ప్రభాతం బగుటయు. | 5 |
| క. |
వందిజన తుములముల యా | నందిత మాగధ సుగీత నాదంబుల ప్ర స్పందిత పాఠక రవముల | క్రందున ధర్మజుఁడు మేలుకనియె నరేంద్రా! |
6 |
| వ. | ఇట్లు మేలు కని తగు తెఱంగున మజ్జనశాలకుంజని, మంత్రపూతంబులగు జలంబులు సముచిత పరిచారికా జనంబులు గనక కలధౌత కలశంబులఁ దేరఁ గృతస్నానుండయి, లఘుధౌతాంబర పరిధానంబును బరిమళ బహుళాంగ రాగానులేపనంబును సురభి కుసుమ మాలికాభరణధారణంబును నాచరించి, దేవార్చనంబు దీర్చి యగ్నికార్యంబు నిర్వర్తించి, కక్ష్యాంతరంబునకు వెడలి, విప్రనికరంబులకు ధేనుప్రకరంబులు గాంచన సంచయంబులు వ స్త్రవిసరంబులు మణిభూషణ పుంజంబులుం జిత్తంబు రంజిల్ల నొసంగి తదాశీర్వాదంబులు గైకొనుచు నేనుంగు మొగసాల గడచి యాస్థాన మండపంబునకు వచ్చి. | 7 |
| తే. |
ఉదయధరణీధరంబుపై నొప్పు దివస | నాథు నెనయుచు సింహాసనంబుమీఁదఁ బొలిచె లీలావతీ కరకలిత చామ | రములు వొలయంగ నుచిత జనములు గొలువ. |
8 |
| వ. | కొలువున్న సమయంబున దౌవారికుఁడు వచ్చి ‘దామోదరుండు వచ్చె’ నని యెఱింగించిన ‘నవ్విభుండు వేగంబ తత్ప్రవేశంబు నడపు’ మనిన వాఁ డట్లచేయ నమ్మహాత్ముండు ప్రీతి నేతెంచుటయు, నుచితాసన విన్యాసంబున నత్యాదర ముఖవికాసంబున నతనికి సత్కారంబు సేసి గారవించి తదాననం బాలోకించి యి ట్లనియె. | 9 |
| క. |
‘జ్ఞానమ్ములు దెలివొందం | గా నత్యంతంబు సుఖముగా నింద్రియ సం తానంబు ప్రసన్నముగా | నీ నిశ శుభవృత్తి గడపితే మధుమథనా!’ |
10 |
| క. |
అనుటయు హరి ధర్మతనూ | జున కిట్లనుఁ ‘బ్రీతి నిన్నుఁ జూడఁగనెపుడున్ జననుత! శోభనములు నా | కనూనముల కాదె? దీని నడుగఁగ నేలా?’ |
11 |
| వ. | అని పలికె నట్టియెడ భీమ నకుల సహదేవులును; సాత్యకి ద్రౌపదేయ ఘటోత్కచులును, బాంచాల మాత్స్య కేకయులును, మఱియుం దగువారుం జనుదెంచి సముచితంబుగాఁ బ్రవేశించి యుధిష్ఠిరునకుం బొడసూపి, యతండు నియోగింప నుచితాసనంబుల నుండిరి; సాత్యకిం గృష్ణుండు నిజాసనంబున నునిచికొనియెం; దదనంతరంబ యెల్లవారలు వినుచుండ నన్నరపతి నారాయణున కిట్లనియె. | 12 |
| ఉ. |
‘పంకజనాభ! మాపడినపాటులు రాజ్యము గోలుపోకయుం గింకకు మూలమై కడఁగి గెల్పుకిరీటికి నీఁ దలంచి యీ వంకకు వ్రాలి భక్తజనవత్సలతన్ రథచోదకుండ వై తిం కిట మమ్ముఁగావు మని యేటికిఁ జెప్పఁగ మాటిమాటికిన్? |
13 |
| వ. | అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము; దుఃఖామర్ష మహార్ణవ మగ్నులమైన మమ్ముం దీరంబు సేరుపం దేపవు నీవ కాదె?’ యనిన విని యచ్యుతుం డతని కి ట్లనియె. | 14 |
| మ. |
విను నేఁ డర్జునుఁ డన్యసైన్యముల నుర్విం గూల్చుచుం బ్రేత భూ త నికాయంబులు మాంస భక్షణము రక్తస్వైర పానంబుఁ జే సి నలిం గ్రాలఁగఁ గ్రీడసల్పు నిను మెచ్చించుం దుదిన్ సైంధవుం డను వానిం దెగటార్చి పేర్చు రిపుధైర్యక్షేపణాటోపతన్. |
15 |
| వ. | క్రోధ శోక జ్వర విముక్తుండ వై శాంతిం బొందు ’ మను నవసరంబున ధనంజయుండు వచ్చి ధర్మనందనునకు మ్రొక్కి నిలిచినం జూచి యతండు సంతసంబున సముత్థితుండై కౌఁగిలించుకొని దీవించి దరస్మిత రుచిరాననుండై. | 16 |
| క. |
‘గెలుపు ధ్రువము నీకును మెయిఁ | దలతలమనుచాయ దోఁచె; దైత్యాంతకుఁడుం దెలివొంది యున్నవాఁ’డని | పలికిన నా విభునితోడఁ బార్థుఁడు నెమ్మిన్. |
17 |
| క. |
‘దేవరకు నధికభద్రమ; | యీ వసుదేవసుతు కరుణ నే నత్యాశ్చ ర్యావహము గంటి; నది వినఁ | గావలయును బంధు మిత్ర గణ సహితముగన్’. |
18 |
| వ. | అని పలికి స్వప్నంబున ఫాలలోచనువలనం బరమోత్కర్షంబు వడసిన తెఱం గేర్పడం జెప్పిన నతండును గొలువు వారును విస్మయ ప్రమోదంబులతో వృషభధ్వజు నుద్దేశించి నమస్కరించిరి; తదనంతరంబ యన్నరపతిచేత నన్నుజ్ఞాతులయి యా సకలయోధులుం బొంగి సంగర సన్నాహంబులు మెఱయ వెడలిరి; కృష్ణార్జున సాత్యకులు నతనికి నభివాదంబులు సేసి సహర్షంబుగా వెలువడి యర్జునావాసంబున కరిగి; రందుఁ గృష్ణుండు రథంబు వన్ని, జైత్రంబులగు మంత్రంబులు ప్రయోగించి యుజ్జ్వలంబు సేసిన నది బాలభానుండునుం బోలె దేజోమయంబై వెలుంగుచుండ సమర సన్నద్ధుండై ధనుర్బాణ పాణియై యర్జునుండు విప్రాశీర్వాదంబులతో నమ్మహనీయ స్యందనంబునకుం బ్రదక్షిణంబునుఁ బ్రణామంబునుం జేసి యారోహణం బాచరించి మేరు శిఖరంబునం బొలుచు భాస్కరుని భంగి శోభిల్లెఁ గృష్ణ సాత్యకులు నొగలను నతని పిఱుందను గూర్చున్న నా ఫల్గునుండు బుధశుక్ర సమేతుం డగు చంద్రు చందంబున నొప్పె; న ట్లొప్పివారు పుణ్యపాఠక రవంబులును వందిమాగధ ధ్వనులును వినుచుం జని రప్పుడు దమకు విజయప్రదంబులు గౌరవులకు విపరీతంబులు నైన గంధవాహాది నానానిమిత్తంబు లనుసంధించి యా సవ్యసాచి సాత్యకితో నిట్లనియె. | 19 |