| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| మ. |
ధర దివ్యాస్త్ర హతిం బగిల్చి కొల నుత్పాదించి వే దానికి న్శర జాలంబుల నిల్లుగట్ట మన సైన్యంబుల్ వెఱంబొందె, న చ్చెరు వందెన్ సురసంఘముల్; హరి నుతించెం బొంగి యప్పార్థు; భూ వర! మున్నిట్టివి సూడరున్ వినరు నెవ్వారుం ద్రిలోకంబులన్. |
162 |
| తే. |
హర్షమందస్మితము తోడ నమ్మురారి | యపుడ హయముల మెయివెట్టునట్లు సేసి తఱిమి నీళులు ద్రావించి తడవి మగుడఁ | దెచ్చె మన యోధు లెల్లను బిచ్చలింప. |
163 |
| వ. | ఇట్లు సేదదీర్చి. | 164 |
| క. |
మును దివ్యాస్త్ర బలంబున | జనియించిన నీరితోన సంభూతం బై యొనరిన ఖాణము మేపెం | దనివు సనం దురగములకు దర్ప మెలర్పన్. |
165 |
| వ. | మేపి కట్టాయితం బయి మనమూఁకల నడుమం బడంతుల పిండులోనం గ్రాలెడు విలాసియుం బోలె విల సిల్లుచు నమ్మహనీయ రథ్యంబులం బూన్చినఁ బాండవమధ్యముం డా రథం బల్లన యెక్కె; నా తడవున దుర్యో ధనుం డనతి దూర వర్తి యై వారలం గని వేగంబున వచ్చుచుండె; వార లక్కడ చూడ; రయ్యవసరంబుననచ్చటి భూవల్లభులెల్ల వెల్లనైన మొగంబులతోడ వెఱఁగంది డెందంబులు గుందుచుండం దమలో ని ట్లనిరి. | 166 |
| చ. |
చతురంగంబులు నొక్కపెట్ట వివిధాస్త్ర జ్వాలలం గప్పఁగా నతివేగంబున మ్రింగెఁ గ్రోలె ఘనమాయన్ రూ పడంగించె నా నితఁ డన్నింటిని రిత్త పుచ్చుచు మదం బేపార నిమ్మై రణ క్షితియుం బీనుఁగు పెంటఁ జేసెఁ జెనయం జిట్టాడఁగా శక్యమే! |
167 |
| సీ. |
కురుసేన పైఁబడ్డ సరకు సేయక మంచు | విరియించు భానుని వెరవు మెఱసి, యిది నడుగల నని యించుక గొంకక | తన ఘోటకంబులఁ దడవఁ బనిచి కొల నక్కజంబుగ నలుఁగుల మొన ఘటి | యించి యమ్ముల దానికిల్లు గట్టి సారథి లీల నశ్వముల కార్యము దీర్చు | నంతకు నవ్వుచు నవుల నిలిచి, |
|
| ఆ. |
గారవమునఁ దాను గానివాఁడును బోలె | నరద మెక్కె నింక నడ్డపడఁగ నలవియే పురారి కైనను? వీనిచేఁ | జచ్చువాఁడు గాక సైంధవుండు. |
168 |
| వ. | అనుచు నీ యోధ వీరులందఱును బెండు వడి యుండిరి గాని యందు నొకండేనియు మార్కొనువాఁడు లేఁడయ్యె నట్లు గోపాల దేవుండును గ్రీడియు బాల క్రీడ విధంబుగా విహరించి యనాయాస గమన విలాసంబు మెఱయం జని చని ప్రొద్దువాలుట గనుంగొని పాంచజన్య దేవదత్తంబు లొత్తి, రయంబు గైకొని యరిగి; రా చక్కటిం గొందఱు నరపతు లొండొరులం బురికొల్పికొని యడ్డపడి తవులు వెట్టి బెట్టు పెనంగి సముద్రంబు సొచ్చిన యేఱులుం బోలె నడంగి; రట్లు సైన్యంబు గడచి బలితంపు వల వ్రచ్చికొని వెలువడిన మహా మత్స్య ంబులును రాహు ముఖంబు వెడలిన చంద్రార్కులుం బోలెఁ బొలిచి యట వోవుచుండ నయ్యెడ సైనికులు సింధురాజు పని సాలించి తొలఁగి; రిత్తెఱంగున దుస్తరంబు లగు బహుళ బలంబుల నిస్తరించి యయ్యిరువురుం దలలెత్తి చూచి తమలో నిట్లనిరి. | 169 |
| ఆ. |
వీఁడె సైంధవుండు! వీని చుట్లను గృప | శల్య గురుతనూజ సౌమదత్తి కర్ణ కర్ణ సుతులు గావలి యున్నారు; | పోటు మగలు గాన పూఁచి పట్టి. |
170 |
| వ. | అని పలికి వారలలో నా జయద్రథుం దప్పక చూచి వెండియు. | 171 |
| క. |
‘వీ రేమి గాచెదరు? తా | నే రూపున బ్రదుకు? వీర లేల? సురలు జం భారియుఁ గాచినఁ దన్నును | బారిసమరి కాక నింగిఁ బడనిచ్చెదమే?’ |
172 |
| క. |
అను పలుకులు నీ యోధులుఁ | దనయులు వినుచుండ ఘోరతరదుర్గము లె ల్లను గడచి లాభదేశము | సనఁ జొచ్చిన వణిజులట్ల సమ్మదలీలన్. |
173 |
| వ. | ఒప్పిన యప్పురుష సత్తములం గనుంగొని యారథిక జనంబులు విస్మయంబునం దమలో ని ట్లనిరి. | 174 |
| తే. |
పెక్కు నదు లీఁది వెడలుట, పేర్చు దావ | శిఖలు గడచుట, దారుణాశీవిషముల బారి దప్పుట గాదె! కుంభజముఖోగ్ర| శూరయోధుల మిగిలి వచ్చుటఁ దలంప. |
175 |
| వ. | అనుచు నాకృష్ణుల నుపలక్షించి. | 176 |
| క. |
‘గురుముఖ బహురథిక శరో | త్కరములచే నైన క్రొత్త గంట్లను సుమనో భరిత నవకర్ణికార | స్ఫురితాచలయుగము భంగిఁ బొలిచిరి చూడన్.’ |
177 |
| క. |
అని యగ్గించుచు సింధువి | భునిదెస విగతాశు లైరి భూవల్లభ! య వ్వనజాక్షు లెఱ్ఱసెర లొ | ప్ప నతని వీక్షించి యార్చి బరవస మలరన్. |
178 |