| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
గురుమెయిఁ దొంబది సునిశిత | శరముల నినుచుటయు, నతఁడు సక్రోధుం డై యిరువదియేనిట నాతని | యురస్స్థలము నొంచి పొదివె నుగ్రాస్త్రములన్. |
239 |
| క. |
రథమును నశ్వమ్ముల సా | రథిఁ దన్నునుఁ గప్పుశరపరంపర లెల్లన్ వృథ సేసెం గరలఘుతా | ప్రథితుం డగు ధర్మసుతుఁడు బాణౌఘములన్. |
240 |
| చ. |
అలిగి గురుండు ధర్మజుశరాసన మేడ్తెఱఁ ద్రుంచి పెక్కు ల మ్ముల సతురంగ సూతముగ ముంచె రథం బది యెల్లఁ జూచి సే న లతఁడు పేర్చె నిమ్మనుజనాథుఁడు సచ్చునొ? యోడి పాఱునో? బలిమిఁ దొఱంగి పట్టువడి పాడఱిపోవునొ? యంచు నున్నెడన్. |
241 |
| క. |
ఒండొక విలు గొని ధర్మ సు | తుం డా నిబిడాస్త్ర సంతతులు రయము మెయిన్ ఖండించి తీవ్ర రశ్ముల | మండెడు ఘనశక్తి వైచె మార్తురు దలఁకన్. |
242 |
| సీ. |
శక్తి యాచార్యు శక్తిని మాయించుఁ బొ | మ్మని చూపఱెల్లను నఱ్ఱు లెత్తి; రక్కుంభసంభవుఁ డపుడు బ్రహ్మాస్త్ర ప్ర | యోగంబు సేసిన నుగ్రభంగి నయ్యస్త్ర మాశక్తి నద్భుతంబుగ నేలఁ | గలిపి యుధిష్ఠిరు వలను నిగుడ నమ్మహీవిభుఁడు బ్రహ్మాస్త్రంబునన యది | యడఁగునట్లుగఁ జేసి, యతని మేన |
|
| తే. |
నైదు దూపులు నాఁటి శరాసనంబుఁ | దునుమ గద గొని వైచె నుద్ధురత నతఁడు పతియు గదవైవ దత్సన్నిపాత జాత | చటులపావక జ్వాలలు చదల నిగుడ. |
243 |
| వ. | ద్రోణుండు కోపించి. | 244 |
| తే. |
ధర్మతనయు రథ్యంబుల ధరణిఁ గూల్చి | ధనువుఁ గేతువుఁ దునుమాడి తనువు నొంప నాతఁ డరదంబు డిగ్గి నిరాయుధుండు | నూర్ధ్వబాహుండు నై యూరకుండె నధిప! |
245 |
| క. |
కనుఁగొని గురుఁ డవ్విభు నే | యను బొడువను చేతులాడ కట పార్శ్వములం దనచూడ్కిఁ బడిన హయరథ | మనుజ ద్విప సముదయముల మడియించె వెసన్. |
246 |
| క. |
పోనీఁడు పొదువుఁ గుంతీ | సూనుని గురుఁ డనుచు నుండ జూపఱగము ల మ్మానవపతి యతిరయమున | దా నెక్కెం బాఱి పిన్నతమ్ముని రథమున్. |
247 |
| వ. | ఇట్లు పాండవాగ్రజుండు సహదేవుని రథం బెక్కి తొలంగం దోలుకొని పోయె; నట్టియెడ. | 248 |
| తే. |
క్షేమధూర్తి భృహత్ క్షత్త్రు శిత శిరముల | నొంచి విలు ద్రుంప నొండు ధనువు రయంబు వఱలఁ గొని హయసారథి ధ్వజయుతముగ | నతని మస్తక మిలఁ గూల్చి యార్చె నతఁడు. |
249 |
| చ. |
కడువడి వీరధన్వుఁడు ద్రిగర్తులు వొంగఁగ ధృష్టకేతు విల్ నడిమికిఁ ద్రుంచినన్ మొగమునం దళుకొత్తెడు కెంపు సొంపుతోఁ జిడిముడిపాటు లేక యతి శీఘ్రమునన్ ఘనశక్తి నాతఁ డె క్కుడు మద మొప్ప నానృపతిఁ గూలఁగ వైచె సురల్ నుతింపఁగన్. |
250 |
| వ. | సహదేవుండును మగిడివచ్చి దుర్ముఖునిం దలవడి దోర్విలాసంబు మెఱయం బోరి పోరి. | 251 |
| ఉ. |
కేతువుఁ గూల్చి, రథ్యములఁ గీటడఁగించి, శరాసనంబుతో సూతుని కంఠముం దునిమి, స్రుక్కఁగ నంగము బాణపంచక స్యూతము నేయ నీదు తనయుం డరిగెన్ నిరమిత్రుతేరిపై కాతత సంభ్రముం డయి రయంబున బాండవ సైన్య ముబ్బఁగన్. |
252 |
| వ. | అంత నిలువక. | 253 |
| తే. |
తఱిమి సహదేవుఁ డా త్రిగర్త క్షితీశ | తనయుఁ డగు నిరమిత్రునిఁ దునిమి యొప్పె ఖరుని తలఁ ద్రెవ్వనేసి రాఘవుఁడు మెఱయు | తెఱఁగు దోఁప నీసేనకు వెఱపు గదుర. |
254 |
| క. |
నకులునిఁ దాఁకి వికర్ణుం | డొకపరి యైనను బెనంగ నోపక తిరిగెన్ సకల బలముఁ జూడఁగ ఱా | తికిఁ బైకొని యడరి తగరు దెరలిన మాడ్కిన్. |
255 |
| తే. |
వ్యాఘ్రదత్తుండు సాత్యకి నస్త్రవృష్టి | ముంచె ముంచిన నతఁడు కోపించి సూతుఁ జదిపి హయములఁ బొరి గొని చటులవృత్తి | జంపె నమ్మగధ క్షితీశ్వరుకుమారు. |
256 |
| వ. | శలుండును ద్రౌపదీపుత్రుల నేవుర నైదైదు బాణంబుల నేసి; మఱియును మార్గణ నికరంబులు నిగిడింపం జలింపక వా రా సౌమదత్తి నొక్కుమ్మడిం జుట్టుముట్టిన నతం డందఱ కన్నిరూపులై యేపునం బెనంగుచుండ | 257 |
| చ. |
హరిసుతసూతి మావుల, బకాంతక సూనుఁడు చాపమున్, యుధి ష్ఠిర తనయుండు గేతువు గడింది మగంటిమిఁ ద్రుంప సూతునిం బొరిగొనియెన్ వెసన్ నకులపుత్రకుఁ; డిమ్మెయి జిక్కువడ్డఁ జె చ్చెర సహదేవ నందనుఁడు సేసె శిరంబును మేను వేఱుగన్. |
258 |
| సీ. |
వెస మారుతియు నలంబుసుఁడును బోరుచో | నద్దానవేంద్రుని యంప బలువు చేత నతండు మూర్ఛిల్లి యాలోనన | తెలిసి కాటుకకొండ పొలుపు గెలుచు నాతని మేను పెల్లలరిన మోదువు | తెఱఁగుగాఁ జేసిన నుఱక వాఁడు మాయా విలాసోగ్ర కాయంబు గైకొని | యఖిల దిక్కులఁ దోఁచి నిఖిలబలము |
|
| తే. |
నుఱిపి నెత్తురు టేఱులు వఱపి ‘భీమ | సేన! మా యన్న బకుని నా లేనిచోట నట్లు సేసితి గాక, నీ యలవుఁ జలము | నింక మెఱయంగ వచ్చునె యేను గలుగ?’. |
259 |
| తే. |
అనిన విని కెంపు గనుఁగవ నడరఁ గినిసి | యుజ్జ్వల త్వష్టృ బాణప్రయోగమునఁ బ్ర భంజనాత్మజుఁ డమ్మాయ వాయఁజేసి | తఱిమి యేసి యారక్కసుఁ బఱపె నధిప! |
260 |
| వ. | ఇవ్విధంబున మనదిక్కునఁ జేయంగల దొరల చావును, నోటమియుం జూచి మూఁకలు గలంగినం గుంభసంభవుండు రోషసంరక్త లోచనుం డై తలకడచి సాత్యకి ప్రముఖ పాండవపక్షవీరులఁ గ్రూరనారాచ నిచయంబుల నిలువరించి నెఱయం బొలిచి నిలిచి మెఱయుటయును. | 261 |
| చ. |
తఱిమి ఘటోత్కచుండు బలదర్పము లేర్పడ ద్రోణుమీఁద నే డ్తెఱ నడతేరఁ గాంచి చనుదెంచి యలంబుసుఁ డమ్మహాసురుం గుఱియుఁగఁ జేసి శాతశరకోటికి నడ్డము సొచ్చు సాత్యకిం బిఱిఁదికిఁ ద్రోఁచి యద్దనుజు భీమతనూజుఁడు నొంచె నమ్ములన్. |
262 |