| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
రోషమున దుస్ససేనుఁడు | పాషాణప్రథన నిపుణ పార్వతికతతిన్ భీషణముగఁ గవియింప జి | గీషం బొదువుటయుఁ జూడ్కిఁ గెంపారంగన్. |
84 |
| క. |
శినివరుఁ డాఱా లెల్లను | దునియలుగా నేయ మగిడి తొరఁగుచు నవి వై చినవారిన నొప్పింపఁగ | గనుకని నమ్మూఁక విచ్చెఁ గౌరవనాథా! |
85 |
| తే. |
విచ్చుటయు నంటఁదాఁకి యవ్వీరుఁ డంప | వెల్లిఁ దేల్చిన వెగడంది పెల్లగిల్లి యధిప! దుశ్శాసనుఁడు మొదలైన యోధ | గణము లెల్లను ద్రోణుని కడకుఁ బఱచె. |
86 |
| వ. | ఇవ్విధంబునఁ దన చేరువకుం జనిన యా దుశ్శాసనునిం గనుంగొని మున్ను శైనేయు చన్నదెసం బుట్టిన యక్కోలాహలం బాకర్ణించుచున్న యగ్గురుం డి ట్లనియె. | 87 |
| క. |
‘ఏమి యువరాజ విభునకు | సేమమె? సైంధవుని నేమి సేసె నరుఁడు? నీ వేమిటి కి ట్లీరథిక | స్తోమముతో విఱిగి? తెందుఁ జొచ్చెద వింకన్? |
88 |
| క. |
అడుకులు ది న్నట్లగునే? | కడుపునఁ గుట్టెత్తినపుడు గడుఁ బఱచితి నాఁ డొడ లెఱుఁగక పాండుసుతుల | నుడిగి మడుగ వలసె; నిప్పు డొక సాత్యకిచేన్. |
89 |
| వ. | భీమార్జునుల బారినుండి యేమి గాఁ గలవాఁ డ?’ వని పలికి యలుక వొడమిన నంత నిలువక. | 90 |
| చ. |
‘మఱచితె యా సభన్ భువనమాన్య గుణోత్తర యాజ్ఞసేని నీ పఱచిన పాటుఁ? బాండవులఁ బల్కిన పల్కులు? నాఁటి క్రొవ్వు నే డ్తెఱయును నెందుఁ బోయె? రణధీరుల వారల నల్గఁ జేసి సి గ్గఱి తుది; నిట్టు లైతి; తగు నక్కట! తియ్యన గావె ప్రాణముల్? |
91 |
| ఆ. |
బ్రతుకఁ దలఁచితేని బాండునందనులకు | నింక నైనఁ బుడమి యిచ్చునట్లు గాఁగ నన్నతోడఁ గార్యంబుఁ జెప్పు మ | వ్వెడఁగు భీష్ము బుద్ధి వినక చెడియె! |
92 |
| వ. | ఇట్లు సేయఁజాల వైతేని. | 93 |
| క. |
ఎటు వోవ వచ్చు? నిను ముం | దట నిడుకొని పోరనున్న తగు రాజుల నె క్కటఁ దోలెడి సాత్యకి నీ | వట దఱుముదు గాక! యొదుఁగ నగునే నీకున్?’ |
94 |
| క. |
అనుటయు నతండు వినియును | వినని చెవులు సేసి మగుడ విక్రమమునకున్ గొనకొని యేమియుఁ బలుకక | చనియె శిని ప్రవరుపజ్జ సమరంబునకున్. |
95 |
| వ. | తదనంతరంబ యాచార్యుం డవార్యదోర్వీర్యంబు మెఱయం దఱిమి మెఱుంగు వాలమ్ముల వేఁడిమి సూపిన. | 96 |
| శా. |
పాండుక్ష్మా వరసూను సైన్యములు దర్పం బేదుడున్ వీరకే తుం డుగ్రంబునఁ దాఁకి యగ్గురుని సూతున్ నొంచి యేనమ్ము లు ద్దండుం డై తను వాడ నేయుటయు నాతం డల్గి దీప్తోజ్జ్వల చ్చండాస్త్రంబునఁ గూల్చె నా ద్రుపదసంజాతున్ మహోదగ్రతన్. |
97 |
| వ. | ఇట్లు వీరకేతుండు వడినం గినిసి యతని యన్నలుందమ్ములు నగు చిత్రకేతుండును సుధన్వుండును జిత్రవర్మయు జిత్రరథుండును ద్రోణురథంబు బాణమయంబు సేసిన నతండు. | 98 |
| క. |
వారల రథ్యంబులఁ ద | త్సారథులం బొడ వడంచి ధరఁ దొరగించెన్ వారిశిరంబులు పువ్వు ల | వారణమెయి డుల్చు గంధవహుఁడుం బోలెన్. |
99 |
| వ. | అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుండు గెంజాయ రంజిల్లు కన్నులం గన్నీ రొలుకం గవిసి కుంభసంభవు నురంబునం గ్రూర నారాచంబులు సొనిపిన మనమూఁకలు హాహాకారంబుఁ లెసంగ నతండు మూర్ఛిల్లిన న ప్పాంచాలవరుండు. | 100 |
| తే. |
పలకయును వాలునుం గొని యలఘుజవము | మెఱయ నేలకు లంఘించి మెఱుఁగు మెఱచి నట్లు సని తల గోయుట కప్పళించి | యెగిరె నగ్గురు తేరిపై నేపు మెఱయ. |
101 |
| వ. | అంతటం దెలిసి యాచార్యుండు ధైర్యధురంధరుండై యెదురు గదియంబడినప్పటికి సాధనంబు లగు జేనకొలంది తూపుల నతని నొప్పించినం గడుఁదురులు గఱచిన వెగడు పడునట్లు మొగతిరిగి యా ద్రుపదనందనుండు నిజస్యందనంబునకు వచ్చి విల్లు గొని పెల్లేసిన. | 102 |
| క. |
గురుఁ డతని సూతుఁ దునుముడుఁ | దురగములు రథంబు ననికి దొలఁగఁ దిగువ నా ధరణీసురోత్తముఁడు బం | ధుర పాండవ సైన్య సమితిఁ దోలెం బెలుచన్. |
103 |
| క. |
కలశజుని తెంపుఁ బెంపును | బలిమియునుం జూచి యపుడు పాండునృప తనూ జుల దెస సైనికు లెవ్వరు | నలపు మెఱసి కడఁగఁ జాల రైరి నరేంద్రా! |
104 |
| వ. | అట్టి యెడ. | 105 |
| ఆ. |
అవ్విధమునఁ బల్కి యాచార్యుఁ డట పుచ్చ | నరిగి దుస్ససేనుఁ డాశిని ప్ర వీరుఁ దాఁకుటయును గౌరవపతి ద్రిగ | ర్తుని బలంబుఁ బనిచెఁ దోడువడఁగ. |
106 |
| వ. | ఆ సంశప్తకులలో దండిమగలు మూఁడువేల రథంబులవారు బెట్టు గిట్టిన నా వృష్ణివీరుండు పంచశత ముఖ్య రథికులం బంచత్వంబు నొందించి, పెఱచతురంగ బలంబుల నెత్తుట జొత్తిల్లం జేసిన, నా త్రిగర్త సైన్యంబు దైన్యంబు నొంది ద్రోణు దెసకుం బఱచినం బోవక యువరాజు శైనేయుతోడ నానానిశిత శరంబుల దురంబు సేయ నతండు. | 107 |