| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | చని యడచిపాటు గదుర నతనితో ని ట్లనియె. | 162 |
| క. |
‘నరుఁడును సాత్యకియు వృకో | దరుఁడును మనసేనఁ గలఁచెదరు; సైంధవుఁ జే రిరి; నీకుఁ దగునె నరునిం | జొరనిచ్చితయేని వారిఁ జొరనీ ననఘా! |
163 |
| క. |
సమరంబున నీ వోడుట | సముద్ర మింకుట; జయించె సాత్యకి గురుఁ గ య్యమున నని యెసఁగు జనవా | దమ మేలుగఁ దలఁచి తొక్కొ! ధనురాచార్యా! |
164 |
| క. |
ఈ భంగి నీ వడంగుట | మా భాగ్యము గాక యింక మాటలు వల దీ క్షోభం బెట్టు లుడుగుఁ జెపు | మా! భవదీయ బలశౌర్యమతులకుఁ దగఁగాన్.’ |
165 |
| చ. |
అనవుడు నాతఁ డిట్టు లను ‘నక్కడ నిక్కడ నొక్క రూపునన్ మన మొనకైన యీ యెడరు మాన్పఁగ నోపిన యంత మాన్చెద; న్వినుము! విశిష్ట కార్య మవనీవర! సైంధవుఁ గాచికోల య ర్జునునకు నీకునుం గలిగె జూదము నేఁ డధికంపుటొడ్డుగన్. |
166 |
| క. |
మును శకుని బుద్ధిమై గెలి | చిన యది యస్థిరపు గెలుపు; సెడకీ జూదం బున వెడలఁ బాటు సూవే | మన వెరవును లావు కలిమి మనుజాధీశా! |
167 |
| వ. | కావున నీవు సమరోత్సాహుండ వై సాహాయ్యంబునకు నద్దెస నున్న కర్ణాదులం గొని కవ్వడి మొదలగు నమ్మువ్వురకుం జాలి సింధురాజ రక్షణంబు నిర్వహింపు; మేను సేనాముఖంబున నిలిచి తక్కినయందఱి నిలువరించుట మేలు; నీతో వచ్చుట కర్జంబు గాదు పొ’ మ్మనుటయు నతండు మరలి తన్నుందాన పురికొలిపికొనుచు నట సనియె; నప్పుడు యుధామన్యుండు నుత్తమౌజుండును మున్ను కృతవర్మచేత నివారితులై నరునితోడ నఱుమం జనక కెలని కుఱికి మనమొనఁ దెరల్చికొని బయలికి వెడలి కపిధ్వజ గాండీవ గుణరావంబుల కతన నతని యున్న యెడ యుపలక్షించి తిరిగి వచ్చి బలుపున మన బలంబు వాయఁ బాపికొని చొచ్చి వివ్వచ్చుం జేరవచ్చుచున్నం గని యక్కురువిభుండు వారల వారింపం గడంగిన. | 168 |
| క. |
ఆ యిరువురతో నజ్జన | నాయకునకు నయ్యె దారుణం బగు రణ మం దాయత నృపచాపము రో | షాయత్తత నుత్తమౌజుఁ డార్చుచుఁ దునిమెన్. |
169 |
| తే. |
తునిమి తోడన యుర మాడ సునిశితాస్త్ర | చయము నిగుడింప రా జొండు చాప మెత్తి యతని హయముల సారథి నవనిఁ గూల్చె; | నాతఁ డరిగె యుధామన్యు నరదమునకు. |
170 |
| క. |
అరిగి తురగముల సూతుం | బొరిగొన విరథుఁడయి నృపతి పొలివోవక యు ద్ధుర గతిఁగద గొని చని త | త్తురగంబుల సారథిని జిదుర్పలు సేసెన్. |
171 |
| తే. |
రథము డిగ్గి తొలంగి రా రథికు ల మ్మ | హీశుఁడేతెంచి యెక్కె మద్రేశు తేరు; వారు నీ యోధు లిరువుర బారిసమరి | యా రథము లెక్కి యర్జునుఁ జేరఁ జనిరి.’ |
172 |
| వ. | అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లను ‘మనవా రెల్లం గర్ణుండు గౌంతేయుం గెలుచు నని యాస పడుదు రా ధర్మతనయుం డాతని యాటోపంబు దలంచి రేలెల్లను గన్ను మూయండు. | 173 |
| ఆ. |
అట్టి జెట్టి యనిలుపట్టి చే విరథుఁడై | పోయి పోయినట్లు పోయెఁ గాని; మరలి కయ్యమునకుఁ జొరఁ డెట్టు? లాతని | తెఱఁగు సెప్పు నాకుఁ దేటపడఁగ. |
174 |
| చ. |
‘అనవుడు నాతఁ డిట్టు లను నన్నరనాథున “కట్లు సూతనం దనుఁ బొరివుచ్చి భీముఁడు మదంబున నర్జును దిక్కు వోవఁ గాఁ గని యతఁ డాయితం బయి తగం దనపే రెలుఁగెత్తి పిల్చె; నా ధ్వని విని యావృకోదరుఁ డుదగ్రగతిన్ మరలెన్ మహీశ్వరా! |
175 |
| వ. | అట్లు దార్కొని అర్కప్రతాపు లగు నయ్యిరువురు నొండొరువుల శరంబులు దూలించుచు దురంగంబుల యంగంబులం దూపులఁ గీలించుచు సారథుల బెట్టు వఱచుచుఁ జాపంబులు విఱుచుచు మైమఱువు లఱువుళ్ళు సేయుచు మేనులు నెత్తుట జొత్తిల్లఁ జేయుచు నొండొరులకు వేఁడిమి సూపి యేవునం బెనంగు నెడ నయ్యనిలతనయుండు. | 176 |
| క. |
విలు దురుము సేసి గుఱ్ఱం | బుల సూతునిఁ బిలుకుమార్చి భుజగనిభ శరం బులఁ జేడ్పఱిచిన సిగ్గఱి | కలఁగి పఱచి యొండు రథముఁ గర్ణుం డెక్కెన్.’ |
177 |
| క. |
అనిన విని ధృతరాష్ట్రుం డి | ట్లను ‘నమ్మినబంటు పిఱికియై యిటు పఱవం గని మందబుద్ధి దుర్యో | ధనుఁ డేమని తలఁచెనొక్కొ! తన చిత్తమునన్. |
178 |
| వ. | అది యట్లుండె; నా కర్ణుని బింకంబు పిదప నెట్లయ్యె?’ ననవుడు సంజయుం డతని కిట్లనియె. | 179 |
| తే. |
ఆననంబునఁ గ్రోధమహానలంబు | భీషణముగ రాధేయుండు భీము దెసకు మరలి యురవడిఁ గవియ నయ్యిరువురకు మ | హాద్భుతం బగు సంగ్రామ మయ్యె నధిప! |
180 |
| క. |
బలు డేగల కైవడి బె | బ్బులుల పగిది మత్తకరుల పోలిక దర్పో జ్జ్వల సింహంబుల చాడ్పున | నలవుఁ జలము మెఱయఁ బెనఁగి రా రథికవరుల్. |
181 |
| క. |
పెనఁగునెడం గర్ణుని ది | క్కునఁ జతురంగములు బెట్టు గోల్తల నా భీ మునిమీఁదఁ గవిసి మంత్రిం | చిన యట్టులు గూలె నతని చేతి బలువునన్. |
182 |
| వ. | అనవుడు నాంబికేయుండు. | 183 |
| క. |
‘తొడరెడు కొలఁదియె వానికి? | వడముడి భుజవిక్రమంబు వారల మన మె ప్పుడు వినమొ? కర్ణు వినమో? | యడిబీరపుఁ దులువ గెలుచు నటె పాండవులన్? |
184 |
| ఉ. |
సూతసుతుండు పాండునృపసూనులఁ బోర జయించు నంచు గ ర్వాతిశయంబునన్ మనమదాంధుఁడు కృష్ణుఁ దృణీకరించి సం ప్రీతిగ సంధి సేయఁడ యపేతకళంకులు వారు; వారి కే లా తగ వేది దైవము దలంచు రణంబునఁ జేటు? సంజయా! |
185 |
| వ. | తానును దమ్ములుం జెడుదు; రింతియ కాక యొండు గలదే? యది యట్లుండె; భండనంబు తెఱంగు సెప్పు’ మనిన నమ్మనుజపతికి నా సూతసంభవుం డి ట్లనియె. | 186 |
| చ. |
సమసిన సేనఁ జూచి రభసంబునఁ గర్ణుఁడు భీముఁ గిట్టి ద ర్పము సిగురొత్త ముప్పది శరంబుల నొంచినఁ గెంపు సొంపు వ క్త్రమునకు నొప్పు సేయఁగ నతండు వెసన్ విలు ద్రుంచి సూతు ప్రా ణముఁ గొనినం జలం బెదఁ బెనంగొన వాహన చోదకుండు నై! |
187 |
| వ. | కర్ణుండు శక్తి వైచిన. | 188 |
| క. |
ఎనిమిది తునియలుగా నది | దునిమి, మరున్నందనుండు తొమ్మిది శరముల్ తను వాడ నేయ బలువిలు | గొని యన్నియుఁ గర్ణుఁ డేసె గ్రూరాస్త్రంబుల్. |
189 |
| క. |
వాని నెడ నఱికి యప్పవ | మాన తనూభవుండు నిశిత మార్గణములు పై పై నిగిడింపఁగ రాధా | సూనుండును సాయకముల సోనలు గురిసెన్. |
190 |
| క. |
చెలఁగు పటు సింహనాదం | బులు ఱంకెలు గాఁగ వారు పొలిచిరి వృషభం బుల క్రియ నొండొరులకు మా | ర్మలయుచుఁ దాఁకుచు నుదాత్తరభసోజ్జ్వలు లై. |
191 |
| ఉ. |
అత్తఱిఁ గర్ణువిల్లును హయంబులు నుగ్గుగఁజేసి నెత్తుటన్ జొత్తిల మేన బాణములు సొన్పి మరుత్సుతుఁ డార్చె నార్చినం జిత్తము తల్లడిల్లఁ గురుసింహుఁడు దుర్జయుఁ బన్ప నాతఁ డ త్యుత్తమ సాహస ప్రకటితోద్ధతి నాజగజెట్టిఁ దాఁకినన్. |
192 |
| తే. |
బలము లచ్చెరువంద న ట్లలవు మెఱయ | నీ సుతుఁ డనిలసుతుఁ దాఁకి నిశితసాయ కముల నొప్పించి రథతురంగముల నొంచి | సూతు నో నేయఁ గ్రోధ విస్ఫూర్తి నతఁడు. |
193 |
| క. |
తురగముల తలలు సూతుని | శిరము నతని మస్తకంబు శితశరషట్క స్ఫురణమున ధరణిమీఁదం | దొరఁగించెం గర్ణుఁ డేడ్పుతోఁ గనుఁగొనఁగన్. |
194 |
| వ. | ఆలోనన సూతసూనుండు రథంబు సన్నద్ధంబు సేసికొనినవాఁడగుట నప్పాండవతనయుం దలపడియె; నమ్మేటిమేగలు కోపంబులు నాటోపంబులు చలంబులు శౌర్యంబులు మెఱయు తెఱంగునం బెనంగి; రట్టి యెడ. | 195 |
| మ. |
ఖరనారాచము భీము వక్షమున నా కర్ణుండు బాహాబలా భరణుం డై నిగిడింప నుచ్చి చని భూభాగంబు నాఁటంగ నా తురతం బొంద కతండు నిష్ఠుర గదం ద్రుంచెం దురంగంబులన్, ధరణిం గూల్చె ధనుర్విలాస మలరం దత్సూతునిం గేతువున్. |
196 |
| మ. |
విరథుం డయ్యును రాధనందనుఁడు దోర్వీర్యం బవార్యంబుగా శరజాలంబుల భీముఁ గప్పుట మహాశ్చర్యంబు గావించె భూ వరుఁ డంతం దన తమ్ము నా రథికుఁ గావం బంచె నా దుర్ముఖుం డు రయం బారఁగఁ దాఁకె భీమునకు నాటోపంబు దీపింపఁగన్. |
197 |
| క. |
అయ్యంగరాజుతోడం | గయ్యము సేయుచును దుర్ముఖ ప్రాణంబుల్ సయ్యన తొమ్మిది యమ్ములఁ | గ్రుయ్యక డయ్యక యతండు గొనియె నరేంద్రా! |
198 |
| వ. | ఇట్లు భవదాత్మజుండు వడుటయు. | 199 |
| ఉ. |
ఆతనిఁ జూచి కన్నుఁగవ నశ్రులు గ్రమ్మఁగ సూతసూతి శో కాతురుఁడై తదీయ రథ మల్లన యెక్కఁగ భీమసేనుఁ డు ద్ద్యోతితహేమ భూషిత చతుర్దశ మార్గణ విద్ధుఁ జేయుడు న్శాతశరంబు లన్ని వెస నాఁటె నతండును దద్భుజంబులన్. |
200 |
| వ. | దానం గనలి అనిలతనయుండు. | 201 |
| ఆ. |
వాఁడి నారసములు మూఁడు కర్ణుని ఱొమ్ము | గాఁడ నేయ నాన గడచి నొవ్వు భయము గదురఁ జేయ రయమున నరదంబు | దోలికొని యతండు దొలఁగఁ బాఱె. |
202 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. | 203 |
| క. |
విను పౌరుషము నిరర్థక; | మనుమానము లేదు దైవ మధికంబు; మరు త్తనయునిచే నారాధా | తనయుం డి ట్లగుట నెవ్విధంబునఁ దలఁపన్. |
204 |
| క. |
అట్టన నేల? మహాబలు | పట్టికి సుర ఖచర దనుజ పన్నగులు మా ర్వెట్ట రనినఁ గర్ణాదుల | కెట్టు నిలువవచ్చు వాని యెదురం దిరమై! |
205 |
| క. |
పాండవుల గెలుచు నాజి ని | తం డని యగ్గించు సూతతనయుని మత్పు త్రుం; డతఁడు భీము నేపున | గం డడఁగినఁ జూచి మనసు గందక యున్నే? |
206 |
| క. |
వినఁడె జరాసంధాదులఁ | దునుముట; మన దుర్జయుండు దుర్ముఖుఁడును భీ మునితోడఁ బెనఁగువా రే | మని కర్ణునిఁ గావఁ బనిచె నబ్బాలకులన్? |
207 |
| క. |
పవనజుఁ డొక్కఁడె పెఱపాం | డవులను సాత్యకియు హరియు డాఁ తురె యుగ్రా హవమునఁ బ్రాణములావున | నవిజయ్యులు వారిఁ దొడర నగునే తనకున్?’ |
208 |
| చ. |
అని పలుమాట లాడుటయు నమ్మనుజేంద్రునితోడ నాతఁ డి ట్లను ‘విష మెత్తి క్రోలి యది యంగము నారట పెట్ట నన్యులం గినిసిన యట్ల మీఁదు పరికింపక యమ్మెయి నీవు పాండునం దనులకుఁ జెట్టవై, హృదయతాపము వచ్చినఁ బల్కె దొండులన్. |
209 |
| వ. | ఊరక బవరంబు తెఱంగు వినుము; నీ తనయులు దుర్మర్షణుండును, దుర్మదుండును, దుస్సహండును, విజయుండును, విచిత్రుండును గర్ణునోటమి సయిరింపం జాలక వడముడిం దొడరి తూపు లడరించినం జూచి యా సూతసూనుండు దాను నతనిపయిం గవిసి యేసిన దద్విశిఖంబుల వారించుచు మారుత నందనుండు. | 210 |
| ఆ. |
ఏచి కురుకుమారు లేవురఁ దురగ సా | రథులతోడఁ గూడ రయము మెఱయ వసుధఁ గూల్చె మెఱుఁగు వాలారు తూపు లా | ఱాఱు నిగుడఁజేసి యద్భుతముగ. |
211 |
| క. |
అనిఁ బడిన రాచకొడుకులఁ | గని కర్ణుం ‘డేటి బ్రదుకుగా బ్రదికెద నే నని యింక నెన్నఁటికి లా | వని భీముని నొంపవలదె?’ యని తెం పెసఁగన్. |
212 |
| ఆ. |
కదిసి డెబ్బదేను కాండంబు లాతని | మేనఁ బఱపి యుబ్బు మిగిలి నవ్వ నతఁడు నూటయేను శితవిశిఖంబుల | నతని నేసి చాపయష్టిఁ ద్రుంచె. |
213 |
| మ. |
రయమారన్ బలువిల్లు పుచ్చుకొని యా రాధాసుతుం డేయ దు ర్జయుఁ డమ్మారుతి వొంగి సూతుని వెసం జానేసి విల్ ద్రుంచుచున్ హయ సందోహముఁ గూల్చి హాస్యమునకున్ హాసంబు సేయన్ గద న్భయదాకారత వైచె నాతఁ డది భగ్నం బయ్యె నా భీముచేన్. |
214 |
| వ. | ఇట్లు గద ద్రుంచి పైపై నేయు పావని బరవసంబునకుం దెరలక యొండు కోదండంబు గొని కర్ణుం డతని తను త్రాణంబు దునియలు సేసి పెల్లేసిన నతండును దదీయ కంకటంబును భుజంబును భేదించె; నిప్పరుసునఁ బాదచారియై పెనఁగు నయ్యోధవరుం జూచి భూవరుండు సత్వరుండై పనుపం జిత్ర విచిత్ర చిత్రాక్షచారు చిత్రులును చిత్రధ్వజ చిత్రాయుధ చిత్రకర్ములును శరాసారంబులు బరఁగించుచు ధర్మపుత్రానుజుం దాఁకిన నతండు మహావాత పతిత భూరుహ ప్రతతిభంగి దోఁప నక్కుమార సప్తకంబును, రథసప్తకంబును, రథసప్తి సారథి సహితంబుగాఁ బొడవడంగం జేసె; నా సందునఁ గల్పితస్యందనుం డై యాసూతనందనుం డప్పాండు నందనునిపై నురవడించిన. | 215 |
| క. |
అఱిముఱి నిరువుర శరములు | తఱుచుగ నొండొరుల బెట్టు దాఁకిన నయ్యి ద్దఱు నెత్తుటఁ దోఁగి కడున్ | వఱలిరి కల్పాంత నవదివాకరుల క్రియన్. |
216 |
| క. |
అరదములు చిత్ర గతులం | జరియింపఁగ ధైర్యములును శౌర్యంబులు ను ద్ధుర బాహా వీర్యంబులు | సరి యై మెఱయంగ నధిక సంరంభములన్. |
217 |
| ఉ. |
ఒండొరు మీఁద సాయకము లొక్క మొగిం బరఁగింతు రేపు మై నొండొరు బాణముల్ నఱకి యుర్విపయిన్ నెఱయింతు రుగ్రులై యొండొరు మేనులన్ శరము లుచ్చిచనన్ నిగిడింతు; రిట్టు లు ద్దండతఁ బోరి రాఱని మదంబుల నొండొరు మీఱు నాసలన్. |
218 |
| క. |
మరుదాత్మజుఁ డేచిన న | న్నరుఁడు హరియు సంతసంబునం బొదలుదు రు ద్ధురతం గర్ణుఁడు మిగిలినఁ | గర ముబ్బు విభుండు దమ్ము గమియుం దానున్. |
219 |
| తే. |
సూతనందనునకు నెడ సొచ్చి చొచ్చి | సమదుఁ డగు భీమసేనుచేఁ జచ్చి చచ్చి బలము లఱుగ నా కర్ణుండు దొలఁగిపోవఁ | జూచుఁ దెగిపోఁడు పడిన నీ సుతులఁ జూచి. |
220 |
| వ. | శోకంబునం గోపంబునం గర్ణు విక్రమాటోపంబు దీపించిన. | 221 |
| క. |
గొడుగునను వింటి కొమ్ముల | సిడమున నరదంబునందు సెల లవిసి కడున్ వడి నిగిడెడు చాడ్పున న | వ్వడముడి దెస నమ్ము లడరె వసుధాధీశా! |
222 |
| క. |
దానికి మనమున నించుక | యైనను దలఁకక సమీరణాత్మజుఁ డవి పై రానీక నిలిపి యతనిం | దా నిరువది నారసములఁ దలరఁగఁజేసెన్. |
223 |
| వ. | అప్పుడు. | 224 |
| క. |
మనవారు వారి వారలు | ననిలతనయు విక్రమంబు నగ్గింప సుయో ధనుఁడు దనయొద్ది యోధుల | ననుజులనుం గర్ణుఁ గావుఁ డని పనుచుటయున్. |
225 |