| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
మేనల్లుఁడగు నకులానుజు నేటులఁ | బడియుండి శకునుల పాలువడ్డ శకునిఁ జూచితె? మురసంహర! యితఁడు మా | యా జాలమునకు నాఁడోజ సకల మాయలు నీ చేత మడిసె దుర్ద్యూతంబు | నొనరించి రాజ్యంబు గొనియె ధర్మ తనయునిచే నిప్డు దన చెయ్ది ఫలియించె | ననియను జూదంబునందుఁ బ్రాణ |
|
| ఆ. |
మోటు వడియె నెత్తమాటకు నీతండు | గఱచు టెల్లఁ గురునికాయనాశ మునకు నయ్యె నీ నృపుఁడ కాఁడె పాండు నం | దనుల తోడివైరమునకుఁ గర్త? |
137 |
| క. |
హిత మొనరించెద నంచున్ | ధృతరాష్ట్ర తనూభవునకుఁ దెక్కలికాఁడై మృతి యొనరించెం దానును | మృతుఁ డయ్యెను భ్రాతృపుత్ర మిత్ర యుతముగన్. |
138 |
| మత్తకోకిల |
వార లస్త్రహతాంగులై యనవద్యలోకము గాంచి రీ వైరకర్తయు నట్లు గాంచెను వారి నల్పవిచారులం బోరి కెత్తెడునట్లుగాఁ దగఁ బొంది వెఱ్ఱులఁ జేసె నీ క్రూరుఁ డందును నన్నదమ్ములకున్ విరోధము సేయఁడే? |
139 |
| క. |
రుచిరాంగదు శస్త్రనిచయు | నిచితాంగకునిం గళింగనృపుఁ గంటి సమి ద్విచరణ విహరణమున నితఁ | డ చలితధృతి యగుట యెఱుఁగ నయ్యెడుఁ గృష్ణా! |
140 |
| ఆ. |
ఇతని చుట్టునున్న యెలనాఁగ లడలునఁ | గూరి వందియును ముకుంద! యొప్పు వాయకున్నవారు బలితంపువడఁబడ్డ | పుష్పదామకముల పొలుపు దోఁప. |
141 |
| ఉత్సాహవృత్తము |
మానినీ జనంబు సేరి మగధనాథుఁడగు జయ త్సేను చుట్టు నేడ్వ నధిక దీన నాదములకు నా మానసంబు సాంద్రకరుణమయతఁ బొందె మోహనం బైన యిట్టి యేడ్పు లెందు నంబుజాక్ష! వింటిమే? |
142 |
| సీ. |
కోసలనాథుండు భాసురమూర్తి బృ | హద్బలుచుట్టుఁ బ్రియాంగనాజ నంబులు సేరి కంపంబుతోడఁ జెమర్చు | కరముల నభిమన్యు కరవిముక్త శరములఁ బెఱుకుచుఁ బొరి మూర్ఛఁ బొరయుచు | నప్పటికప్పటి కతని ముఖముఁ దేఱి చూచుచు విధిఁ దిట్టుచు శోకాగ్ని | నుల్లంబు లెరియంగ నున్నవారు |
|
| ఆ. |
తునిమివైవ నెండఁ దనికినఁ బెద్దయు | వంది చూడ్కి దిగువ వలను కలిమి దొఱఁగకున్నయట్టితోయజంబుల చంద | మయ్యెఁ జూడ వీరి యాననములు. |
143 |
| వ. | ద్రోణబాణపరిపీడితప్రాణులై పడియున్నవారు ధృష్టద్యుమ్ననందనులు. | 144 |
| మత్తకోకిల |
అంగదంబులుఁ గంకణంబులు హారవల్లులు నాదిగా నంగకంబుల భూషణంబులు హారికాంతి వెలుంగఁ సంగరాంగణభూమికిం దమచారుభావ మలంక్రియా సంగతిం గలిగింప నొప్పిరి శౌరి! చూచితె వీరలన్? |
145 |
| నర్కుటము |
త్వరిత రథాశ్వమారుత గతస్ఫురితాకృతియై శరబహుళార్చిరుద్గమవిశాలతఁ బొల్చు ధను ర్గురుఁడను చిచ్చుపై శలభకోటిగతింబడి మ్రం దిరిఁ గనుఁగొంటె యేవురు నుదీర్ణులఁ గేకయులన్? |
146 |
| క. |
పంచాననంబుచేతం | బంచత్వముఁ బొందియున్న బంధురకరిఁ బో లించుటకుం దగి యొప్పెం | బాంచాలుఁడు ద్రోణుకడిమిఁబడి కంసారీ! |
147 |
| క. |
ద్రుపదనృపాలుని ధవళా | తపత్రమస్త్రంబులె చోటుఁ దాఁకక జిగియా రి పొలిచె శారద చంద్రుం | డుపమాపాత్రంబు గాఁగ నుర్వియను దివిన్. |
148 |
| తే. |
వల్లభులును గోడండ్రు నీ వసుమతీశ్వ | రునకు నగ్నిసంస్కారంబు నొనరఁ జేసి యుమ్మలికమునఁ దద్దయు వెమ్మునంత | రంగములతోడ నరిగిరి గంగ దెసకు. |
149 |
| క. |
ద్రోణుఁడు దలరం దలపడి | బాణకళావేది చేదిపతి యుజ్జ్వల త ద్బాణహతిఁ గూలి సమర | క్షోణి పరిష్కారమగుచు శోభిల్లెఁ గడున్. |
150 |
| తే. |
తలయుఁ గాళులు దమయూరుతలములందు | బెట్టికొని వీని భార్యలు బెట్టిదంపు టడలు తాఁకునఁ గడు బెగడారఁ గూరు | నుల్లములతోడఁ బలవించుచున్నవారు. |
151 |
| క. |
మానవనాథు లనేకులు | వీని భుజావిక్రమంబు వేఁడిఁ బడిరి నీ మేనమఱఁది శిశుపాలుని | సూనుం డీ ధృష్టకేతుఁ జూచితె? కృష్ణా! |
152 |
| ఉత్సాహవృత్తము |
అతని నందనుఁడు సుకేతుఁ డల్లవాఁడె ద్రోణ పా తితుఁడు వీనిఁ జూడగా మదిన్ సుయోధనుండుఁ ద త్సుతుఁడు దోఁచుచున్నవారు శోకవహ్నితాప మూ ర్జితము గాఁగ బంధుజనుల చిత్తమెంత గుందునో? |
153 |
| తే. |
అల్ల వారె యవంతీశు లధిక బాహు | బలులు విందానువిందులు బహుళభూష ణోజ్జ్వలులు పడియున్నవా రుగ్ర వాయు | పతిత కుసుమిత నవసాల భంగి దోఁప.’ |
154 |
| వ. | అని చూపి యిట్లనియె. | 155 |
| సీ. |
‘శాంతనవుండు నాచార్యుండుఁ గర్ణుండు | భూరిశ్రవుఁడు గురుపుత్రకుండుఁ గృపుఁడు సైంధవుఁడును గృతవర్మయును గురు | రాజు నమానుషరథికవరులుఁ గలయంగ నెన్నెడు కొలఁదులవారె? వా | రలిగిన జెడుదు రయ్యమరులైన నట్టి వీరుల బారికగపడియుండియు | నేమియుఁ గారైతి రీవుఁ బాండు |
|
| తే. |
తనయు లందఱు నీ కూర్మితమ్ముఁడును | మహాద్భుత మ్మిది దలఁప భీష్మాదులైన వారి నటె పోర నిర్జింపవచ్చు నెట్టి | పనియు భరమె? దైవమునకుఁ బద్మనాభ! |
156 |
| వ. | దైవంబు దుర్యోధనాదులగు నూర్వురకు నొక్కెత్తున నిట్లగునే?’ యని వెండియు. | 157 |
| తరువోజ |
కురురాజు మొదలైన కొడుకుల నెల్ల గోల్పోవు టిప్పుడు గోవింద! కలిగె; నరిగితి సంధి సేయఁగరాకయున్న నటయప్డు నీ చెప్పుటైనది కాదె? పరమహితంబుగఁ బలికిరి గంగపట్టియు విదురుండు పాటించి పెక్కు వెరవుల నొత్తిన విననైతి నా వివేకుల చూ పేల వృథ నోవనేర్చు?’ |
158 |
| వ. | అని పలికి పశ్చాత్తాప దుఃఖంబు పెల్లున నొల్లంబోయి తెలిసి చిత్తస్థాయియైన పుత్రశోకం బడరి యలంతి గాని యలఁతఁ బెట్ట నూరకుండి యక్కౌరవరాజపత్ని పద్మనాభుదెసఁ గనుంగొని కోపోద్దీపితయై. | 159 |
| సీ. |
‘ధృతరాష్ట్ర పాండుభూపతుల కుమారులు | తమలోన నీసున సమరమునకుఁ దొడఁగిన నీ వడ్డపడవైతి తగుచాలు | మానిసుల్ గలిగియు మాననీయ వాక్యుండవయ్యును శక్యసమస్త కా | ర్యుండనఁ బేర్కొనియును నుపేక్ష చేసితి కురురాజుఁ జెఱుపన తిరిగితి | నిఖిలరాజులఁ దదనీకములను |
|
| ఆ. |
నామ మడఁచి తెల్లభూములుఁ బాడయ్యె | నంతవట్టు ఫలము ననుభవింపు మేపడంగ నిన్ను శాపానలజ్వాల | దగ్ధమూర్తిఁ జేయుదాన వినుము. |
160 |