| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 022. గోపికా గీతములు 1 |
| 22. గోపికా గీతములు-1 |
| నీపై మోహము నో కృష్ణా! నిలుపగ లేనోయీ కృష్ణా! ముద్దుమోము గాంచన్ కృష్ణా! మోహ మాపలేరా కృష్ణా! |
| చిన్నదాన నీకై కృష్ణా! చింతల జిక్కితిరా కృష్ణా! నీ సిగలో దొకటీ కృష్ణా! నెమలికన్ను నీరా కృష్ణా! |
| నిన్ను జూడకుండన్ కృష్ణా! నిముస మాగలేరా కృష్ణా! పతి గలదాననురా కృష్ణా! పదెపదె తిప్పకురా కృష్ణా! |
| బతిమాలుదు నోయీ కృష్ణా! బాధపెట్టకోయీ కృష్ణా! అబలను ప్రాణములో కృష్ణా! అర్పించితి నీకో కృష్ణా! |
| బ్రతికింపను చంప\న్ కృష్ణా! భారము నీదేరా కృష్ణా! నీపై మోహము నో కృష్ణా! నిలుపగ లేనోయీ కృష్ణా! |