| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 021. విరహము |
| 21. విరహము |
| ఏడ తిరుగాడెదవు కృష్ణా! ఈ వాడకే రావైతి కృష్ణా! |
| నీపైని మోహమున కృష్ణా! నే నిలువవలేకుంటిరా కృష్ణా! |
| కాల్చుచున్నది జ్వరము కృష్ణా! నా కాలుసేతులు వడకు కృష్ణా! |
| ఆస లడుగంటెరా కృష్ణా! ఆ యాసమున బలముడిగె కృష్ణా! |
| బాలభానునియట్ల కృష్ణా! నీవు వచ్చి న న్నలరింపు కృష్ణా! |
| వదనకాంతులు జిమ్మి కృష్ణా! నా పరితాప మార్పరా కృష్ణా! |