| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 020. వటపత్రశాయి |
| 20. వటపత్రశాయి |
| ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా జంటగా నను బిల్వదగదోయీ? |
| కంటికంతా జలమయంబై మింటివరకును నేకరాశై జంటదొరుకని మహాప్రళయపు టింటిలో వటపత్రడోలిక |
| నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా జంటగా నను బిల్వదగదోయీ? |
| జగము లన్నియు కాలయోనిని మొగము లెఱుగక నిద్రబోవగ నగుమొగము గల ముద్దుబాలుడ వగుచు జోలల బాడుకొంచూ |
| నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా జంటగా నను బిల్వదగదోయీ? |