| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 027. గుర్తులు |
| 27. గుర్తులు |
| "అతడే నా నాథు డంచు అతివ! యెట్లెఱింగితివే?" |
| "ఎందరిలో నున్నను తా నీ మోమే గాంచుచుండు సుందరాంగు లెంద రున్న చూడ డించుకేని వారి నతడే నీ నాథు డంచు నతివ నే నెఱింగితినే!" |
| "అంతమాత్ర నెట్టులందు వతడే నా నాథుడంచు!" |
| "చెలియ! నిన్న నీవు ముద్దు చేతులతో గూర్చినట్టి కలువపూలదండ యతని కంఠసీమ నలర గంటి నతడే నీ నాథు డంచు నతివ! తెలియ జాలనటే!" |