| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 026. త్రోవేలేదా? |
| 26. త్రోవేలేదా? |
| రావాలంటే త్రోవేలేదా దేవదేవుడౌ నా నాథునకు? తారలు జూపెడు దారు లెరుగడే భూరమణుండౌ నా ప్రాణేశుడు? |
| పూవుల జాడల బడి రాలేడే భువన మోహనుడు నా రాజేంద్రుడు? రాగిణి ప్రణయపు రవళిని వినడే రాగలోలుడౌ నా లోకేశుడు? |
| ప్రేమద్వారము బెట్లు సడిల్చీ నామనోహరుడు రాజాలడటే? రావాలంటే త్రోవేలేదా దేవదేవుడౌ నా నాథునకు? |