| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 025. క్రొత్తవింతలు |
| 25. క్రొత్తవింతలు |
| "ఈ తమ్మలపు ముద్రలేడవే చెలియ?" నిద్రలో ప్రియుడు నన్ ముద్దాడెనేమొ! |
| "ఈ మేని గందంబు యేడదే చెలియ?" భువన మోహనమూర్తి పూసినాడేమొ! |
| "మగువ! నేడీ కంఠమాధుర్య మేమొ?" నా మోహనుడు నింపెనేమొ ప్రేమముతో! |
| "కాంత నీ కీ దివ్యకాంతి యెక్కడిదే?" నా దేవదేవుండు నన్ మెచ్చెనేమొ! |