| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 028. తగనా? |
| 28. తగనా? |
| దాసిగా నుంటకైన తగనా ప్రాణేశ, దేవ? దాసిగా... |
| పాదమ్ములు నొచ్చినంత పట్టుటకైనను దగనా? దాసిగా... |
| తలపై నీ పాదధూళి దాల్చుటకైనను దగనా? దాసిగా... |
| వదనమ్మును గాంచి భక్తి ప్రణమిల్లుటకుం దగనా? దాసిగా... |
| నిన్ను జూచి మదిని ప్రేమ నిలుపుటకైనను దగనా? దాసిగా... |
| నా నాథుడ వీవె యనుచు నమ్ముటకైనను దగనా? దాసిగా... |
| ఒరు లెవ్వరు జూడకుండ నొక్క ముద్దుగొన దగనా? దాసిగా... |
| పరవశమున నీ ప్రేమము పాడుటకైనను దగనా? |
| దాసిగా నుంటకైన తగనా ప్రాణేశ, దేవ? దాసిగా... |