| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 029. రాగిణి |
| 29. రాగిణి |
| చూడ జూడ నీ రూపము సుందరమై యొప్పు దేవ! సొక్కి సొక్కి నీ వలపున సోలి పరవశత గందును! |
| వినగ వినగ నీ నామము వీనుల విందౌను నాథ! చనగ చనగ నీ జాడల సౌఖ్యము మునుముందె తోచు! |
| తలప తలప నీ లీలలు తనువు పులకరించు స్వామి! వలచి వలచి దేవ నిన్నె వంతలెల్ల మరచిపోతి! |