| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 128. జీవమింక దాల్పనేల |
| 128. జీవమింక దాల్పనేల |
| చెవికింపుగ బారుచు నో సెలయేఱా యేమందువె? "చెలియ నిన్ను మోసగించ జీవమేల దాల్తు" వనెదె? |
| చెలియ మోసగించె, నిజమె జీవమింక దాల్పనేల? కోర్కులన్ని వమ్ములయ్యె కొనుము ప్రాణముల వేగమె! |
| వెనుకనుంచి కూకూయని పికమ, నన్ను బిలుతు వేల? "చెలియ నిన్ను వలచె రమ్ము వలదు విడువ ప్రాణ" మనెదె? |
| పికమ నీదు మాటల విని వెఱ్ఱి నౌదు ననుకొంటివె? ఉవిద నన్ను వలచు భాగ్య మున్న నింత యేల మునుగు? |
| పికమ, నా దురంతము చెలి వీను లలర జెప్పగదవె, కరుణ మిగిలియున్న నన్ను మరువకు మని వేడగదవె? |