| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 017. కోణంగిపద్దు |
| 17. కోణంగిపద్దు |
| పన్నెండేళ్ళ చిన్నాడే పైట కొల్ల గొన్నాడే అడగవమ్మ అడగవమ్మ అమ్మ యశోదమ్మా! |
| చీకటైన కాలేదే, రాకపోక లాగలేదే! లోకానికి జడవొద్దా? పోకిళ్ళకి అదుపొద్దా? పన్నెండేళ్ళ... |
| ఇంటి కిల్లాలినిగాదే కంటబడితె తంటాలౌనె! అంటె నీకు కోపమొద్దే కొంటీ కోణంగిపద్దే! పన్నెండేళ్ళ.. |
| వొట్టే నలుగురిలో తల గొట్టినట్టు లాయెనమ్మ! ఏంతో టబ్బరాలైనా ఇంతపనులు జేసేనా? |
| పన్నెండేళ్ళ చిన్నాడే పైట కొల్ల గొన్నాడే అడగవమ్మ అడగవమ్మ అమ్మ యశోదమ్మా! |