| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 078. కైపు |
| 78. కైపు |
| కావ్యపానము జేసి కై పెక్కినానే! |
| దివ్యలోకాలన్ని తిరిగొచ్చినానె! ఎక్కరానీకొండ లెక్కివచ్చానే! పైకెక్కి నీకేసి పారజూశానే! కావ్య.... |
| కావ్యదేవత నోటె కవిత విన్నానె చీమ లనిపించారె భూమిలో కవులు! కావ్యపానము జేసి కైపెక్కినానే! |