| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 077. నా కవిత్వధాటి |
| 77. నా కవిత్వధాటి |
| నన్నెవ్వ రాపలే రీవేళ నాధాటి కోపలే రీవేళా! |
| నోటపలికేదంత పాటగా మోగేను కోటివరహా కెత్తు కెత్తుగా తూగేను నన్నెవ్వ... |
| గుండు ఠాఠామంటు కొట్టినట్టుగ నేటి పండితులు ఠారెత్తి పరుగుచ్చు కోవాలి నన్నెవ్వ... |
| పట్టుపట్టితినంటె వాగీశుడే వచ్చి దాసోహమని పాట వ్రాసి వల్లించాలి! |
| నన్నెవ్వ రాపలే రీవేళ నాధాటి కోపలే రీవేళా! |