| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 076. నా జీవిత నాటకము |
| 76. నా జీవిత నాటకము |
| ఈ కపటనాటకాల నే నింక నాడ లేను, తెరదించుడీ, కొరగాని నాలి వేసముల వేసి, పొట్టకై మోసగించి పరుల యాచించి లాలించి బతుకలేను. |
| పుట్టినట్టి పౌరుషమైన పుటక మరిచి పరునికృతికి వేసముగట్టు పాప మేల? నా విధురజీవితమ్ము నే నాటకమ్ము జేసి ఆడించి జగతి రంజింపలేనొ? |