| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 075. తెలిసీ తెలియని పలుకులు |
| 75. తెలిసీ తెలియని పలుకులు |
| పదిమందిలోన పాట బాడుమని బలవంతము జేయకు నాథా! |
| పదిమందిలోన పాటలు బాడగ భయము సిగ్గు వేయును దేవా! పలువుర రంజింపగ నిచ్చకాల పాటలు రావే నోటికి దేవా! తెలిసీ తెలియని పలుకుల గూర్చిన వలపు పాటలే వచ్చును దేవా! పది... |
| చదువు నీ కడం జాల గల్గుటను వినిపింతు ప్రేమమెల్లను దేవా! కనికరించి యొక్కడవె నా ప్రణయ గానము విన రాలేవా? |
| పదిమందిలోన పాట బాడుమని బలవంతము జేయకు నాథా! |