| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 074. లజ్జ |
| 74. లజ్జ |
| మాటలైన తిన్నగరావే, నను పాటపాడు మందు వేమి దేవా? |
| మేటి గాయకుడవౌ నీకడనే పాటపాడు టేమిసొంపు దేవా? |
| పదములకూర్పే యెఱుగని నే నెటు పాటల నల్లంగలనో దేవా? |
| హృదయ సుమము విచ్చకయే యెటు జి మ్మెడు భావపరిమళము నోదేవా? |
| తల్లిబోవ చిన్నతనముననె వే తల్లుల ప్రేమను బ్రోచిన దేవా? |
| పిల్లని చింతాగానము విన నీ యుల్లము నిజముగ గోరెనె దేవా? |
| మాటలైన తిన్నగ రావే, నను పాట బాడు మందు వేమి దేవా? |