| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 121. మాయమైపోతే |
| 121. మాయమైపోతే |
| మగువరో యింతలో మాయమైపోతే మాటాడకుండనే మాయమైపోతే మల్లెపూజాడలనె మాయమైనావె మనుగొట్టి కనులలో మాయమైపోతే? |
| మండు వేసవిటెండ పండువెన్నెలయట్లు భావించి నీకునై పరుగెత్తి వచ్చితినె మగువరో! యింతలో మాయమైపోతే? |
| నోరార దాహమున కోరికల నువ్విళ్ళ నూరి ప్రాణము నిల్పి పారి వచ్చితినే మగువరో! యింతలో మాయమైపోతే? |
| వడదాక నెమ్మేను పడిపోయి తరువట్లు కడగండ్లు దీర్తువని వడిలేచి వచ్చితినె మగువరో! యింతలో మాయమైపోతే? |
| ఇంత మోసము జేయ నింతి నీ కేలనే భ్రాంతి గొన్నందులకు వంతగూర్చితివే మగువరో! యింతలో మాయమైపోతే? |