| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 120. పలుకవేలనే |
| 120. పలుకవేలనే |
| కల కల లాడుచు కిల కిల నవ్వుచు కలికీ! నాతో పలుక వేలనే? |
| వలపు నీ పయిం గలిగెను నిజముగ పలుకకున్న నెద నిలుపజాలనే? |
| తలపులు నిను విడి తొలగ కున్నవే అలరన్ వీనులు పలుక రాదటే? |
| చలువ వెన్నెలల నలమజేసి మది నలరిచె చంద్రుడు చల మిం కేలనే? |
| చెలియరొ నీమది వెలిగెడు వలపుం దెలిపి ప్రాణములు నిలుపరాదటే? |